Remembering One Of The Legends of Telugu Cinema, Gollapudi Maruthi Rao Garu

Updated on
Remembering One Of The Legends of Telugu Cinema, Gollapudi Maruthi Rao Garu

పాత తరం నటులలో గొల్లపూడి మారుతీరావు గారు ప్రముఖులు.ఆయన ఒక గొప్ప రచయిత కూడా. తన 14 ఏళ్ల వయసులోనే అంటే 1954 december 18 న ఆయన రాసిన మొదటి కథ "ఆశాజీవి" ప్రచురితమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళా రంగం లో నటుడిగా, రచయితగా ఎంతో సేవ చేశారు. ఆయన రచనలలో ఆయన వేసిన పాత్రలలో ఒక ముక్కుసూటి తనం ఉంటుంది. ఒక నిజాయితి, గాంభీర్యం ఉంటుంది. లీడర్ సినిమా లో అయినా, బ్రహ్మోత్సవం సినిమాలో అయినా, ఆయన పాత్ర నిడివి తక్కువ ఉన్న, ఆ పాత్ర చేసిన impact మాత్రం సినిమా అంత ఉండటానికి కారణం అదే.

గొల్లపూడి గారు, "జీవన కాలమ్" అని సాక్షి పేపర్ లో ఒక column ని ప్రచురించే వారు. Koumudi అనే youtube ఛానల్ లో వాటి, podcasts ఉండేవి. అప్పుడు జరిగేటి విషయాలపై తన అభిప్రాయాన్ని, నిక్కచ్చిగా నిజాయితీతో ఉన్నది ఉండేట్టు తనకు అనిపించేది చెప్పేవాళ్ళు . ఆయన పదాలలో ఆయన గొంతులో అది స్పష్టానంగా కనిపించేది, వినిపించేది. మన చుట్టూ జరిగే పరిస్థుతుల పై ఒక స్పష్టమైన అవగాహన కోసం ఆయన coloumn, ఆయన facebook పేజీ తప్పకుండ ఫాలో అవ్వాలి. ఆ coloumns లో కొన్ని ఇవి..,

ఆయన ఇచ్చిన కొన్ని interviews ఇవి.

తెలుగు రచయితలు రాసిన ఒక కథ ని తీస్కుని ఆ కథని విశ్లేషించేవారు గొల్లపూడి గారు. "వందేళ్ల కథకు వందనాలు" అని వచ్చేది. Here is the playlist.

ఆయన చేసిన పాత్రలలో మనల్ని నవ్వించినవి ఉన్నాయి, ఏడిపించినవి ఉన్నాయి, ఆ పాత్ర వల్ల కోపాన్ని పుట్టించేవి కూడా ఉన్నాయి. ఆ పాత్రకు తగ్గట్టు ఆయన వైవిధ్యంగా నటించేవారు. అలా ఆయన నటన ద్వారా రచనల ద్వారా నేటి తరం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలను నేర్పారు. ఆయన లేరని నేడు తెలుగు అక్షరం చినబోయిన, ఆయన పదాలు ఎప్పటికి ఉండే చిరంజీవులు. విలువలని తెలిపే సూచనలు. ఒక గొప్ప నటుడు రచయిత మిగిల్చిన జ్ఞాపకాలు. Youtube channel:Koumudi Facebook page:click here