Latest example గా కరోన Incident నే తీసుకుందాము.. చైనా అధ్యక్షుడి దగ్గరి నుండి మన లోకల్ నాయకుల వరకు "మా ప్రభుత్వం కరోనపై యుద్ధం చేస్తుందని మీడియా ముందు హీరోయిజం చూపిస్తున్నారు". రియాలిటీ లో మాత్రం వీరెవ్వరు యుద్ధం చెయ్యరు, చూస్తారు అంతే!! డాక్టర్లు కొన్ని గంటల పాటు తన ఛాంబర్ లో ఉండి పర్యవేక్షిస్తారు, గైడెన్స్ ఇస్తారు, అసలైన యుద్ధం చేసేవారు మాత్రం నర్సులు. వారే పేషేంట్ కు కరోన, హెచ్.ఐ.వి, స్వైన్ ఫ్లూ, ఎబోలా, నిఫా.. మొదలైన ఏ వ్యాధులున్నా గంటల తరబడి వారికి అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటారు. ఇంతటి సేవ చేస్తున్నా కానీ సమాజంలో చిన్నచూపు, ప్రభుత్వం, ఆఖరికి డాక్టర్ల వద్ద నుండి కూడా గౌరవం అందడం లేదు.
చాలామంది నర్సులకు కనీస జీతం 10,000 వేల రూపాయలు కూడా రావడం లేదంటే మీరు నమ్మగలరా.? కొన్నిసార్లు ఒక్కో హాస్పిటల్ లో 100 మంది పేషంట్లకు ఒక నర్సు ఉంటున్నారని మీకు తెలుసా.?, ఒక్కోసారి వాష్ రూమ్ కు వెళ్ళడానికి కూడా సమయం దొరకడం లేదు. పని వత్తిడితో వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా ఒక్కటి అని కాదు నర్సుల సమస్యలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ సమస్యల గురించి నర్స్ లక్ష్మణ్ రుడావత్ గారు మన స్టేజ్ కు వచ్చి వారి ఇబ్బందులను తెలియజేశారు. వారు నల్లమల్ల గిరిజన ప్రాంతం నుండి వచ్చి ప్రస్తుతం నర్స్ గా ఉద్యోగం చేస్తూనే వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.
కేవలం ఒక నిజం తెలుసుకునే లోపే జీవితం పూర్తవుతుంది, ఇక నుండి ఒక నిజం తెలుసుకునెందుకు మనం గుణపాఠం అనుభవించాల్సిన పనిలేదు, రకరకాల విభాగాలకు అవసరం అయ్యే అలాంటి నిజాలనే స్టేజ్ మీకు అందిస్తుంది. వారు కష్టాలలో ఉన్నారా.? లేదంటే కష్టాలు దాటి సక్సెస్ ఫుల్ జీవితాన్ని అనుభవిస్తున్నారా.? బాగా మాట్లాడుతారా అనేది స్టేజ్ చూడదు. ఇది రెగ్యులర్ స్క్రిప్ట్ తో నడిచే టాక్ షో కాదు, స్టేజ్ కు వచ్చే ప్రతి స్పీకర్ సో కాల్డ్ సెలెబ్రెటీస్ కూడా కాదు, సో కాల్డ్ మొటివేషన్ గురూలు కాదు, మన చుట్టూ ఉండే వ్యక్తులు, వీడు మనవాడే అని దగ్గరి తీసుకునే వ్యక్తులు, ముఖ్యంగా వారి జీవితాల నుండి నిజాన్ని తెలిపే అతి సాధారణ మనుషులు.
పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు: