Konnella kritham Manam 10th class lo chaduvutunnappudu ee paatiki pusthakaalatho kusthi paduthu.. Ee lokam lo evaru lenantha busy ga undevaallam. Manalo chaala mandi first face chese BIG EXAM 10th class public exams kadhaa mari. Andhulo first face chese Paper Telugu paper. Ippudu Mee chuttu pakkala kuda books mundeskuni chaduvuthunna pillalani chuse untaaru. Alaa chusina naaku o sari alaa mana Telugu question papers ni lessons ni palakarinchaali anipinchindi. So, I'm taking you along with me to nostalgic ride of Telugu question paper. Randi inkosari chaduvudaam.
తెలుగు - 1 లో పద్య భాగం, గద్య భాగం అని రెండు భాగాలు ఉండేవి, పద్యభాగం 9 పాఠాలు, గద్యభాగం లో 9 పాఠాలు మొత్తం 18. మళ్ళీ పద్యభాగం లో ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం అని ఇంకో రెండు భాగాలు. పద్యభాగం: ప్రాచీన పద్యభాగంలో: మాతృవేదన జడివాన ప్రవరుని స్వగతం సుభాషితాలు ఆధునిక పద్యభాగంలో: ఓరుగల్లు సందేశం తామసి. స్ట్రీట్ చిల్డ్రన్ గీతాంజలి గద్యభాగం లో బొండుమల్లెలు అంపకాలు రంగస్థలంపై సమయస్ఫూర్తి చేనేత దృక్పథం నా విషయం అంబేద్కర్ వ్యక్తిత్వం రిప్ వాన్ వింకిల్ వదరుబోతు ఊతపదాలు, వ్యర్థపదాలు
ఈ 9 పాఠాలు నుండి చాలా ఏవేవో అడుగుతారు: 1. ప్రతి పదార్థం: 2 పద్యాలని ఇచ్చి, ఎదో ఒక దానికి ప్రతి పదానికి అర్థం రాయమని వాళ్ళు.. కవి గురించి, ఆ పద్యం వచ్చిన సందర్భం గురించి, భావం వీటన్నిటిని వీలైనంత అందంగా అర్థవంతంగా రాయాలి, ఆ పదాలలో కూడా సంధి విభజన చేయాలి. ఒక రకంగా చాలా పెద్ద ప్రక్రియ. "ప్రవరుని స్వగతం" తెగ బట్టి పట్టేవాళ్ళం, ఇందులో maximum మార్క్స్ కొట్టేయడానికి.
2. పద్య భావం: "మాతృ వేదన" ఒక story లాగ narration ఉంటుంది కాబట్టి అందులో పద్యం వస్తే భావం రాయడం తేలికగా ఉండేది. కవిపరిచయం సందర్భం రాస్తే మంచి మార్క్స్ వస్తాయనేవాళ్ళు. ఆ రెండు extra marks కోసం "మాతృ వేదన" ని ఎంత వేదనగా చదివే వాళ్ళమో.
3. అర్థ సందర్భం: కవి పరిచయాలు, సందర్భాలు actual గా రాయాల్సింది ఇక్కడ. కానీ పైన రెండు questions కూడా రాయమనేవాళ్ళు, మనం కూడా "ఒక్క మార్కు" కి ఆశపడి రాసేవాళ్ళం. పద్య భాగం లో గద్య భాగం మొదటి 4 పాఠాలు సరిగ్గా చదివితే set కుమ్మేసేవాళ్ళం exam ని. పద్య భాగం లో ఒకటి, గద్య భాగం ఒకటి రాయాలి.. underlines, పెన్స్ మార్చడం ఇవన్నీ చేసేసరికి గంట ఇక్కడే అయిపోయేది.
4. పద్య పురణం: ఏదో ఒక పద్యాన్ని పూర్తిగా రాయాలి. మొత్తం పద్యం with భావం & కవిపరిచయం రాసేసరికి, మనమే ఒక నన్నయ్య అనే ఫీలింగ్ వచ్చేది. ఒక్క తప్పు లేకుండా పద్యం రాస్తే వాడే topper.
5. పద్యభాగం ప్రశ్నలు: మనలో ఉన్న రచయిత బయటపడే సమయం ఆసన్నమయ్యింది. పుస్తకాలలో ఉన్నది as it is దింపడానికి ఈ పాఠాలని మనం చదవలేదు, అర్థం చేసుకున్నాం. మన సొంత మాటల్లో రాయాలి కాబట్టి ఇంక అదరగొట్టేయడమే. మధ్యలో పద్యం రాసావంటే నువ్వు తోపు అనే చెప్పాలి. మాతృవేదన లో ఆ పక్షి మనమే అనేంత feel రాసేవాళ్ళం ఒక వేళ అందులో నుండి question వస్తే. ఎంతైనా first lesson కాబట్టి అన్నిటికన్నా బాగా నేర్చుకునే వాళ్ళం. ఇంకా 8 మిగిలిన 8 పాఠాలలో మొదటి నాలుగు పాఠాలే నేర్చుకునే వాళ్ళం mostly workout అయ్యేది.
6. గద్యభాగపు ప్రశ్నలు బొండు మల్లెలు కథ భలే ఉండేది. విన్న వెంటనే ఎక్కడో తాకేది. సరైన మాస్టరు పడితే కంట్లో నీరొచ్చేస్తాయి. అలాంటి లెస్సొన్ నుండి ప్రశ్న వస్తే రాయకుండా ఉంటామ. ఒకవేళ అంపకాల నుండి వస్తే ఆ చిన్నపిల్ల మీద ఉన్న కోపమంత పేపర్ మీద పెట్టేవాళ్ళం.
7. ప్రక్రియలు ఇతిహాసం, ప్రబంధం, కథానిక, గల్పిక, పీఠిక, ఆత్మకథ, జీవిత చరిత్రలు. వీటిలో రెండు ఇస్తాడు ఎదో ఒక దాన్ని వివరించాలి. ఇక్కడ నుండి మన "బట్టి" పట్టే సామర్ధ్యం ఎంతుందో తెలుస్తుంది. ఇప్పటికే ఇంకో
Part B: 8. పద్య రచయిత పరిచయం: పైన చాలా సార్లు రాసుంటాం. ఇంకోసారి repeat చేస్తే చాలు. మన అదృష్టం కొద్దీ పైన రాసిన ఎదో ఒక పద్యం కవి గురించే రాయాలంటే అదే చూసుకొని రాసేయచ్చు brain కి strain ఉండదు.
9. గద్య రచయిత పరిచయం: ఎందుకో తెలీదు పద్య రచయితల కవిపరిచయం గుర్తుపెట్టుకున్నంత సులభంగా వీళ్ళవి గుర్తుపెట్టుకోలేకపోయేవాళ్ళం. బొండుమల్లెలు రాసిన "చాగంటి సోమయాజులు" గారి గురించి రావాలని మొక్కుకున్న దేవుడికి
10. పద్యభాగ నేపథ్యం: పెద్ద కష్టం కాదు, పద్యంగా ఉన్నది మన సొంత పదాలతో చెప్తూ, కవి గురించి కొన్ని మాటలని అక్కడక్కడ చల్లేసుకుంటూ వెళ్తే set.
11. గద్యభాగ నేపథ్యం: ఎంత రాస్తే అంత కాకపోతే సూటిగా సుత్తిలేకుండా ఉంటె బెటర్. క్లైమాక్స్ కి వచ్చేస్తున్నాం కదా సమయం తక్కువ రాయాల్సింది ఎక్కువ ఉండేది.
11. పాత్ర స్వభావం: జరితారి వస్తే కాసేపు ఆ పక్షి పాత్ర లోకి, ప్రవరుడు వస్తే అతనిలోకి, ఇలా ఎవరొస్తే వాళ్ళలోకి పరకాయ ప్రవేశం చేసేవాళ్ళం. అప్పట్లో ఆ dedication అలాంటిది.
12. పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యర్థం, అర్థం, నానార్థం, సమాసం, సమాసానికి ఉదాహరణ, సంధి, సంధి కార్యం, ప్రకృతి వికృతి చాలా ఈజీ గా రాసేసేవాళ్ళం.
13. గురు లఘు విభజన ఈ ఒక్క దానికి choice ఉండేది కాదు, సో fast గా వచ్చిన బండికి speed breaker పడ్డట్టు కొంచెం నెమ్మది గా రాయాల్సొచ్చేదీ.. విభజన చేసి, ఇది ఏ పద్య లక్షణానికి చెందిందో రాయాలి.
14. పద్య లక్షణం ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం శార్దూలం ఏదొచ్చినా ఓకే.
15. అలాంకారం చాలా జాగ్రత్తగా గుర్తుకుంచుకోవాలి కొంచెం కష్టం. ఆ పదాన్ని చూసి ఏయ్ అలంకారం కనిపెట్టాలంటే.
15. అలాంకారాన్ని వివరించడం ఉపమాలంకారం వస్తే పండగే, అంత్యానుప్రాస వచ్చినా చాలు. ఇంకేదైనా వస్తే brain కి పనిచెప్పాలి.
ఇక అక్కడితో తెలుగు - 1 పూర్తయ్యింది. చివరికి వచ్చేసరికి maximum time లిమిట్ ఉపయోగించి రాసేస్తాం వీలైతే choices రాస్తారు మనోళ్లు. మొత్తానికి ఆలా మన The First Big Exam వీలైనంత successful గా రాసేస్తాం అన్నమాట. పద్యభాగం లో మాతృవేదన, ప్రవరుని స్వగతం, గద్యభాగం లో, బొండుమల్లెలు, అంపకాలు, రిప్ వాన్ వింకిల్ పాఠాలు ఇంటరెస్టింగ్ గా ఉండేవి. ఇంకేదైనా మీకు memories ఉన్న, నేను మర్చిపోయా అనుకున్న comment లో చెప్పేయండి మరి. ఒకసారి ఆ question పేపర్ ని చూడాలి అనిపిస్తే.. here are the లింక్స్. Question Papers and preparation method:Click here
తెలుగు 2 అంటే మన "బారిష్టర్ పార్వతీశం" గారు, కొంతమంది sanskrit ని తీసుకునే వాళ్ళు. మీరు ఏం బ్యాచ్ మరి..
