“మా అబ్బాయిని నాకన్నా పెద్ద హీరోని చేయాలన్నది నా కల అందుకోసం Experience ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కథలతో సిద్ధంగా ఉన్నారు.. డైరెక్టర్ గా నీకు ఏ Experience లేదు కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఏ ఒక్క సినిమాకు కూడా పనిచేయని నీకు.. నా కొడుకు బంగారు భవిషత్తుని ఏ నమ్మకంతో అప్పచెప్పాలి??"


Sir.. If We Want To Do Anything New, We Don’t Need Any Experience Except Vision మనం ఏదైనా కొత్త పని చేయలంటే మనకు ఏ Experience అవసరం లేదండి, జస్ట్ వర్క్ మీద విజన్ ఉంటే సరిపోతుంది.. "ఈ ఒక్క మాటతో అక్కినేని నాగేశ్వరరావు గారు రాంగోపాల్ వర్మ కి నాగర్జునను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు".

కట్ చేస్తే శివ పెద్ద హిట్.. మాములు హిట్ కాదు.! శివ సినిమా భారతదేశం అంతటా మారుమోగిపోయింది. కలెక్షన్స్ తో పాటు, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ కొత్త దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డులు, అభిమానుల నుండి ఎన్నో రివార్డులు అందుకున్నారు. అంతే కాకుండా CNN-IBN All Time Greatest 100 Filmsలో శివ కు కుడా చోటు దక్కింది, అప్పుడే టాలివుడ్ లో ఒక హీరోకున్నంత అభిమానం, క్రేజ్ ఒక దర్శకుడికి రావడం అదే మొదటిసారి. క్షణ క్షణం కి ఉత్తమ Screenplay Writer, Best Director కింద నంది Award అందుకున్నారు.. దాదాపు 50కి పైగా Films ని డైరెక్ట్ చేసిన వర్మ మొత్తం ఇప్పటికి 7 నంది అవార్ఢులను అందుకున్నాడు.. సింగర్ గా రక్తచరిత్రలో కత్తులతో సావాసం.. శర్వానంద్ సత్య2 లో ఓ ప్రియా.. ఓ ప్రియా.. పాటలు పాడి, ఇంకా నా ఇష్టం, Guns and Thighs పుస్తకాలు రాసి తనకున్న అదనపు టాలెంట్ ను చూపించాడు.

అన్నపూర్ణ స్టూడియోలో ఎప్పుడో చూసిన మాగజీన్ ద్వారా స్టడీ కెమెరా గురించి తెలుసుకొని, తన సినిమాకు ఈ కెమెరానే కరెక్ట్ అని ఎవ్వరు చెప్పినా వినకుండా అంత వరకు ఎవ్వరూ వాడని Cameraని తన మొదటి సినిమాకే మొదటిసారి వాడారు.. భారతీయ సినీ పరిశ్రమకి Black Magic, Flow-cam, Pocket-cam, 5D ఇలా ఎన్నో Camerasని Introduce చేసి Production Cost తగ్గించారు.. ఇప్పుడు కొత్తగా షార్ట్ ఫిల్మ్ చేసే వారికి ఒక దిక్సూచి గా మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే రెవల్యూషనరీ చేంజెస్ చేసిన గొప్ప టెక్నీషియన్ RGV.


ఆయన మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా ఆయనంత ఎత్తుకి ఎదిగారు, అంతేకాదు ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోలకు మంచి హిట్స్ కూడా ఇచ్చారు.. ఒక్క పూరి జగన్నాథ్ వల్ల మహేష్ బాబు(పోకిరి), పవన్ కళ్యాణ్ (బద్రి) ల కెరీర్ గ్రాఫ్ మారిపోయింది.. ఒక్క గుణశేఖర్ చిరంజీవి, మాహేష్ బాబు గారి కెరీర్ లో ఎప్పటికి నిలిచిపోయే మంచి Big హిట్ సినిమాలు(చూడాలనిఉంది, ఒక్కడు) ఇచ్చారు. ఇండస్టీకి ఎంతోమంది కొత్త నటులను పరిచయం చేస్తున్న తేజ, క్రియేటివ్ Director గా పేరుతెచ్చుకుని ఎన్నో అవార్డ్సు అందుకున్న కృష్ణవంశీ, బాలీవుడ్ లో అవార్డ్ ఫిల్మ్ తీస్తున్న మధుర్ బండార్ఖర్, అనురాగ్ కశ్వప్ ఇలాంటి ఎంతోమందికి Persons వర్మ దగ్గర పనిచేసి దర్శకత్వ మెలకువలు నేర్చుకుని తమ భవిషత్తును మార్చుకున్నారు.. కనీసం ఒక సాటి డైరెక్టర్ నీ పొగడాలన్నా ఇంకా పొగిడితే ఎక్కడ తనకు పోటి వస్తారో అని ఒకటికి రెండుసార్లు ఆలోచించే మన Industry లో సొంతంగా బ్యానర్ ను స్థాపించి ఎంతోమంది కొత్త దర్శకులకు వర్మ అవకాశం ఇస్తున్నారు.. బాహుశా ఇలాంటి సాంప్రదాయాన్ని భారతదేశంలో మొదటిసారి ప్రారంభించింది ఒక్క వర్మనే కావచ్చు.

వర్మ అంటేనే ఒక రెబల్, ఎవ్వడి మాట వినడు.. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు గాసిప్స్ అంటే భయపడిపోతారు ఎక్కడ తమ లైఫ్ కి ప్రాబ్లమ్ అవుతాయేమో అని.. కాని వర్మ వీటికేం భయపడడు.! ఒకవేళ తనమీద వచ్చిన ఆ గాసిప్ నిజం అయితే తనే ఒప్పుకుంటాడు. ఎవరైనా బయోపిక్స్ తీయాలంటే ఒక రాజుల చరిత్ర, లేదంటే భక్తుల చరిత్ర, లేదంటే ఒక మంచి నాయకుడి చరిత్రను తీస్తారు.. కాని హత్యలు, దొంగతనాలతో పోలీస్ రికార్డ్స్ లో నమోదైన నేరస్థుల వ్యక్తుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాగా తీసి ఆ వ్యక్తులనే హీరోలుగా తీర్చిదిద్దగలడు ఆయన, అలాంటి హీరోల నుండి ఏది ఎంత వరకు నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలని అంతర్లీనంగా చూపిస్తారు.. ఇలాంటి వ్యక్తుల గురుంచి తీయాలంటే చాల ధైర్యం కావాలి.. (రక్తచరిత్ర సమయంలో) ఒబుల్ రెడ్డి దెయ్యమై వచ్చిన ఆయనతో ఇంకో సినిమా తీస్తాను తప్ప భయపడి సినిమాను మాత్రం ఆపను అని ఒబుల్ రెడ్డి అనుచరులకు వార్నింగ్ ఇచ్చిన ధృడ వ్యక్తిత్వం ఆయనది. RGV గారు.. మీకు Birthday అంటే నచ్చదు కాబట్టి Wishes చెప్పడం లేదు.. మీ అభిమానులు, ప్రేక్షకులు గర్వించే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. మీకు అంత దమ్ము ఉంది కాబట్టే ఈ Request.!
