The Future Is Here! Robocops Soon To Replace Traffic Police On The Streets Of Hyderabad!

Updated on
The Future Is Here! Robocops Soon To Replace Traffic Police On The Streets Of Hyderabad!

Image Source: Deccan Chronicle

ఇక నుండి మనం ట్రాఫిక్ పోలీసుల బదులు రోబో పోలీసులను చూడబోతున్నామనమాట. ప్రపంచంలోనే రోబో పోలీస్ మొదట దుబాయ్ లో ఉంది ఆ తర్వాత రెండో రోబో పోలీస్ మన హైదరాబాద్ కు రాబోతున్నది. దీని కోసం 'హెచ్ బోట్స్ రోబోటిక్స్' రెండు నెలల పాటు ప్రత్యేకంగా Research చేసి Perfect Planning తో ముందుకు వచ్చారు. ప్రస్తుతం డిజైన్ పూర్తవ్వడం గవర్నమెంట్ నుండి పర్మిషన్ రావడంతో వీటి తయారీ ప్రారంభమయ్యింది. ఈ సంవత్సరం డిసెంబర్ 31న మొదటగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోబో పోలీస్ జాబ్ చేయబోతుంది.

ఎందుకు బెటర్..? రోబో పోలీస్ ను రంగంలోకి దింపడానికి చాలా కారణాలున్నాయి. పొల్యూషన్ తో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడడం, కొంతమంది లంచాలు తీసుకుని చూసి చూడనట్టుగా తప్పు చేసినవారిని వదిలేయడం, మారుతున్న పరిస్థితులకు అప్ డేట్ అవ్వాలనుకోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల రోబో పోలీస్ అవసరం ఏర్పడింది.

స్మార్ట్ వర్క్: ఈ రోబోలు వాటి హై రెజల్యూషన్ కెమారాల ద్వారా ట్రాఫిక్ Updates ఇస్తూ, సిగ్నల్ జంపింగ్ చేసేవారి ఫోటోలను సర్వర్ కు ఎప్పటికప్పుడు పంపించేస్తుంది. ఇంకా అన్నీటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే అనుమాస్పద వస్తువులను, బాంబులను ఇది వెంటనే గుర్తించేస్తుంది, ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. సెక్యూరిటి పరంగా, అలసి పోకుండా ఇది అద్భుతంగా పనిచేయబోతుంది.

ప్రస్తుతం మొదట హైదరాబాద్ లో మాత్రమే రోబో పోలీస్ వస్తున్నా కాని ఫ్యూచర్ లో మిగిలిన నగరాలు, మండల కేంద్రాలు, చివరికి గ్రామీణ ప్రాంతాలలో కూడా రోబో సేవలు ఉపయోగించుకోబోతున్నారు. ఇందుకు అనుగూణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడే రోబోలను తయారుచేసే పరిశ్రమలకు కరెంట్, ఇంటర్నెట్ బిల్లులలో రాయితీ, మొదలైన ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు.