అప్పటి వరకు దాదాపు 900గడపలు ఉన్న కప్పట్రాళ్ళ గ్రామానికి ఏ పోలీసు అధికారి వచ్చినా గౌరవం ఉండేది కాదు.. పోలీసులకు అవినీతి మకిలి ఇంకా, వారి సమస్యలను సమూలంగా పరిష్కారం చేసేంత దమ్ము పోలీసులకు లేదనే అభిప్రాయం కావచ్చు.. కాని ఎప్పుడైతే రవికృష్ణ గారు కర్నూలు ఎస్.పి గా బాధ్యతలు తీసుకున్నారో ఇక అప్పటి నుండి అక్కడి వారి అభిప్రాయాలలో సమూల మార్పులు వచ్చాయి. మొదట కప్పట్రాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.. ముందు గ్రామ ప్రజలకి ఎస్.పి గారి మీద అంతగా నమ్మకం లేకపోయినా గాని అతని మాటలతో, చేతలతో క్రమంగా నమ్మకం బలపడింది వారి జీవితాలు మారబోతున్నాయి అని..
కర్నూలు జిల్లాకు సుమారు 55కిలో మీటర్ల దూరంలో ఉన్న కప్పట్రాళ్ళ ప్రజలకు వారు అసాధ్యమని ఊహించినవన్ని ఇప్పుడు కళ్ళముందు కదులుతున్నాయి. రోడ్లు వచ్చాయి.. బస్సులు తిరుగుతున్నాయి.. స్కూల్ బాగుపడింది.. ఊరిలో నేరాలు తగ్గాయి.. యువతకు మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.. అన్నిటికి మించి అక్కడి ప్రజలందరిలో రేపటి గురించి భయం లేదు. అప్పటి వరకు పోలీసులంటే గౌరవం చూపించని వారు ఇప్పుడు ఎస్.పి గారిని చూడగానే మా అన్న వచ్చాడు, నా ఇంటి పెద్ద కొడుకు వచ్చాడు అని గ్రామస్థులందరి మనసులో భావన కలుగుతుందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రేమతో ఆ ఊరిని బాగుచేశారో అని. ఇప్పుడు ఎస్.పి గారు అంటే తెలుగు రాష్ట్రాలలోని తోటి పోలీసు అధికారులకు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు, గ్రామాలను దత్తత తీసుకునే వారందరికి ఆయనే స్పూర్తి.
ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క సంఘ విద్రోహక చర్యలకు పాల్పడేవారిని ఎక్కడికక్కడ తొక్కిపెట్టారు. కర్నూలు జిల్లాలో ఇప్పుడు నేరాల సంఖ్య చాలా తగ్గింది. లాఠీ పట్టుకుని నేరస్తులను అదుపులో ఉంచారు.. ప్రేమతో గ్రామాన్ని దత్తత తీసుకుని ఊరిని ఉన్నతంగా తీర్చిదిద్దారు.. ఇప్పుడు ఎస్.పి గారు ప్రజలలో చైతన్యం నింపడానికి కొన్ని వీడియోస్ లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. యోగా, సేవ్ గర్ల్ చైల్డ్, ఐ డొనేషన్ల మీద వీడియోలు తీశారు. ఈ వీడియోలు జిల్లా అంతటా ఉన్న థియోటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. నిజంగా ఎస్.పి రవికృష్ణ గారు చేసిన కార్యక్రమాలు ఆయన సేవ గురించి వివరించాలంటే ఒక్క ఆర్టికల్ సరిపోదు ఒక 500 పేజీల పుస్తకం రాయాల్సి ఉంటుంది. పోలీసుగా బాధ్యతలు తీసుకునే వేళ ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు, అందులో చాలామంది ప్రతిజ్ఞను మరుసటి రోజే వదిలేస్తారు. కాని రవికృష్ణ గారు ఇప్పటికి వదలలేదు, ఆ ప్రతిజ్ఞను మనస్పూర్తిగా నెరవేరుస్తున్న ఉన్నత అధికారి ఆయన.. సెల్యూట్ సార్ మిమ్మల్ని చూసి మరింత మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాము..
బాహుశా ఒక తెలుగు పోలీస్ ఉన్నతాధికారి ఇంత అద్భుతంగా పాడడం ఇదే తొలిసారి అనుకుంటా..
Eye Donation
Yoga
Save Girl Child