వింజమూరి రాగసుధ గారు ఇప్పటికి బ్రిటీష్ పార్లమెంట్ లో ఎన్నిసార్లు నాట్యప్రదర్శన ఇచ్చారో తెలుసా అక్షరాల 12 సార్లు. ఇది రాగసుధకు దక్కిన అదృష్టం మాత్రమే కాదు మన సమ్మోహనమైన నాట్యాన్ని తిలకించే అదృష్టం ఆ దేశ ప్రజలకి దక్కినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మన సంస్కృతి, సాంప్రదాయం ఎంతో ఉన్నతమైనది.. ప్రపంచం ఈనాడు మన నుండి ఎంతో నేర్చుకుంటుంది.. ప్రేమ, సమాజం పట్ల బాధ్యతలాంటివి మాత్రమే కాదు సైన్స్ విషయంలోనూ.. మన ఆచార వ్యవహారాలు, నుదుటన కుంకుమ పెట్టుకునే దగ్గరినుండి కాలికి మెట్టె తొడిగే వరకు ప్రతి ఒక్కటీ ప్రపంచానికి సందేశం అందించేదే.. ఇలాంటి మన గొప్ప సాంప్రదాయాలను రాగసుధ గారు తన నాట్యంతో ప్రపంచ వేదికలపై ప్రదర్శనలిస్తూ మన సంస్కృతిని ఈ ప్రపంచానికి చేరవేయడంలో వారధిలా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు
రాగసుధ గారు చిన్నతనం నుండే నాట్యాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించారు. ఏడు సంవత్సరాల నుండే నాట్యం నేర్చుకుంటూ చిన్నతనం నుండే నాట్య ప్రదర్శనలనిస్తున్నారు. నృత్యకారినిగా మాత్రమే కాదు రచయితగా, జర్నలిస్ట్ గా, ఉపాధ్యాయురాలిగా తన ప్రతిభకు హద్దులు లేవు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం టూరిజమ్ సబ్జెక్ట్ మీద లండన్ సండర్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మనదేశం మీద సంస్కృతి మీద నిజమైన ప్రేమ ఉంటే దానిని మరింతమందికి తెలియజేసేలా కృషిచేస్తారు అలా రాగసుధ గారు1830 సంవత్సరంలోనే బ్రిటన్‌లో తెలుగుభాష ఉందన్న విషయం తెలిసి బ్రటీష్ లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంధాలను తెలుగులోకి అనువదించి అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాల సంఖ్య పెంచుతున్నారు.
ఇక రాగసుధ గారికి బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు మాత్రమే కాదు బ్రిటన్ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు ఇప్పటివరకు 220కు పైగా నాట్య ప్రదర్శనలిచ్చారు ప్రతి ప్రదర్శనకు కూడా సుమారు 20వేలకు పైగా అభిమానులు హాజరవుతారంటేనే అర్ధం చేసుకోవచ్చు తన ప్రతిభ స్థాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్నారు రాయప్రోలు గారు. ఈ పదాలలో ఎంతటి కర్తవ్యం దాగి ఉన్నదో ఆ కర్తవ్యం అంత గొప్పది రాగసుధ గారి వ్యక్తిత్వం.