This Inspiring Talk By 'Sadhguru' Will Teach You Everything About Leading Your Life Happily!

Updated on
This Inspiring Talk By 'Sadhguru' Will Teach You Everything About Leading Your Life Happily!

మనలో చాలామందికి ఎన్నో అనుమానాలు, అపోహలుంటాయి. నిజమైన నిజం తెలియక మనం అనుకున్నదే, మనకు నచ్చినదే నిజమని భ్రమ పడుతుంటాం.. సుధీర్ఘ జీవితానికి సరైన దారి తెలియక ఎంతో మధనపడుతుంటాం. కొంతమంది వీటిని తేలికగా కొట్టిపారేస్తుంటారు కాని మనలోని శాంతికి, మన లక్ష్యానికి ఇవి అత్యంత కీలకమైనది.. సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవాళికి తన సందేశంతో శాంతిని అందిస్తున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో తన సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. తాను చేస్తున్న ఇంతటి అధ్యాత్మిక సేవకు కేంద్ర ప్రభుత్వం నుండి "పద్మవిభూషన్" పురస్కారం దక్కడం నిజంగా అభినందనీయం. ఉన్నది ఒక్కటే జీవితం ఆ జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో అని ఈ వీడియోలో వివరించిన తీరుతో ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం ఎంతటి శక్తివంతమైనదో తెలుసుకోవచ్చు.