ఈ మాస్క్ నేను డబ్బుల కోసం, పేరు కోసం తయారుచెయ్యలేదు!! భారతదేశం, పూర్తి మానవాళి కోసం మాత్రమే చేశాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్ట్ డిటైల్స్ నేను ఉచితంగా అందిస్తాను. -శ్రవణ్ గట్టు.
కరోన వైరస్ నుండి రక్షణ కొరకు అందరూ ముక్కు నోరు మాత్రమే కవర్ చేసుకుంటున్నారు కానీ .1 మైక్రాన్ గల ఆ వైరస్ కళ్ళు, చెవి ద్వారా కూడా మన శరీరములోకి వెళుతుందని నిరూపితం ఐయ్యింది. అలాగే ఇప్పుడు వాడుతున్న మస్కులలో N95 మాత్రమే ముక్కు నోరు కు రక్షణ ఇవ్వగలదు, సర్జికల్ మస్కులు కానీ, బైక్ పొల్యూషన్ నుండి ప్రొటెక్షన్ కోసం వాడే ఇతర మస్కులు కానీ అంతంత మాత్రమే సేఫ్. ఇదంతా గమనించిన హైదరాబాద్ కు చెందిన రీసెర్చర్ శ్రవణ్ గట్టు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, హెయిర్ ఇలా తల అంతటిని కవర్ చేస్తూ అద్భుతమైన మాస్క్ ను తయారుచెయ్యగలిగారు.
ఏమేమి ఉపయోగించారు.?
ఈ మాస్క్ పూర్తిగా త్రి లేయర్ లో ఉంటుంది. మన ఇంట్లో వాడుకునే వ్యాక్యూమ్ క్లీనర్ లో ఉపయోగించే క్లాత్ పూర్తి రక్షణ ను ఇవ్వగలదని ఈ క్లాత్ ను ఉపయోగించారు. ఇది కరోన వైరస్ ఉండే పరిమాణం కన్నా 5 రెట్లు తక్కువగా ఉండే ఏ ఇతర వైరస్ క్రిములను ఏ మాత్రము లోనికీ రానివ్వలేదు. మిడిల్ లేయర్ లో acrylic combined plastic ను పొందుపరిచారు, ఇన్నర్ లేయర్ కోసం కాటన్ ను ఉపయోగించారు. దీని మూలంగా ముఖానికి ఇబ్బంది కలుగకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. మిగిలిన మాస్కులు ఎక్కువ శాతం ఒక్కసారి వాడకానికే ఉపయోగపడతాయి అది కూడా కేవలం నోరు ముక్కు వరకు మాత్రమే కానీ ఇది మాత్రం జుట్టు దగ్గరి నుండి నోరు రక్షణనిస్తుంది, శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఈ మాస్క్ తయారుచేయడానికి శ్రవణ్ గారికి సూర్య వంశీ సూరి, శశాంక శ్రీ చరణ్ సూరి విలువైన సహకారం అందించారు.
మార్కెట్ లో మాములు సమయాలలో దొరికే 5 రూపాయల విలువ గల మాస్కులు కూడా దుర్మార్గులు రూ.100 వరకు అమ్ముతున్నారు. ఇంకా N95 మాస్కులు అయితే రూ.1000 వరకు అమ్ముతున్నారు. ఇది సామాన్యుడు తన కోసం తన కుటుంబం కోసం కొనగలడా.? కొన్నా కానీ నోరు, ముక్కును మాత్రమే కవర్ చేసే మస్కుల నుండి రక్షణ పూర్తిగా ఉండదు.
కరోన వైరస్ ఇది శరీరంలోకి ఎలా అయినా ప్రవేశించగలదు, మీరు ఒక్కసారి గమనిస్తే కోవిడ్19 పేషంట్లకు ట్రీట్మెంట్ ను ఇస్తున్న డాక్టర్లు బాడీ అంతటిని కవర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అందిస్తారు. అందుకే అన్నిరకాల రక్షణ కొరకు శ్రవణ్ గట్టు గారు ఈ మాస్క్ ను అవసరం రీత్యా యుద్ధ ప్రాతిపదికన కేవలం మూడు రోజుల్లోనే తయారుచేశారు, ఇందుకోసం ఒక్క మాస్క్ కోసం ఐన ఖర్చు దాదాపు రూ.200. దీనిని కేవలం ప్రజల ప్రాణ రక్షణ కొరకు మాత్రమే చేశాను తప్ప మరో ఆలోచన తనకు లేదని, ప్రభుత్వాలు దీనిని పెద్ద ఎత్తులో తయారుచేస్తే కనుక కేవలం రూ.70, లేదా రూ.80 రూపాయలతో కూడా తయారుచేయవచ్చని అంటున్నారు. ఇందుకోసం శ్రవణ్ గారు అన్ని రకాల సహాయ సహకారాలు ఏమి ఆశించకుండా అందిస్తానని అంటున్నారు.
ఎవరీ శ్రవణ్ గట్టు.?
దేశమన్నా, భారతీయులన్నా శ్రవణ్ గట్టు గారికి ఎనలేని గౌరవం, ప్రేమ. శ్రవణ్ గట్టు గారు ఎనాడైనా ఒక్కసారి వేరే రకంగా ఆలోచించి ఉంటే వేరొక దేశానికి వెళ్లి అక్కడొక పెద్ద సైంటిస్ట్ అయ్యేవారు కానీ నా ప్రతిభ, టాలెంట్ అన్ని దేశానికే మొదటగా ఉపయోగపడాలని ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటూ ఏసీ హెల్మెట్, 21 పదార్ధాలతో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇలా ప్రజలకు ఉపయోగపడే 200 కు పైగా ఆవిష్కరణలు, వస్తువులను తయారుచేశారు. 60 కు పైగా పేటెంట్స్ శ్రవణ్ గారి సొంతం.