ఒక గొప్ప యజ్ఞం చేయాలంటే, అందుకు ఆ యజ్ఞం లో కాలే సమిధలు కూడా అంతే గొప్పవై ఉండాలి. కళా తపస్వి విశ్వనాథ్ గారు (story-direction), గొప్ప విలువలు కలిగిన నిర్మాత (producer)ఏడిద నాగేశ్వర రావు గారు, హాస్య బ్రహ్మ జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి గారు (dialogues), లోకనాయకుడు కమల్ హాసన్ గారు(lead role as Balu), గొప్ప నటి జయప్రద గారు(as Madhavi), గొప్ప నటులు శరత్ బాబు గారు(Balu’s true friend), హీరో తల్లిగా నటించిన డబ్బింగ్ జానకి గారు, సాక్షి రంగారావు గారు(Balu’s uncle), Maestro ఇళయరాజా గారు(Music), స్వర్గీయ వేటూరి సుందరరామ్మూర్తిగారు (lyrics) గానగంధర్వ S.P. బాలసుబ్రమణ్యం గారు, Nightingale of the South S. జానకి గారు, గాయనిగానే కాకుండా నటిగా నిరూపించుకున్న S.P. శైలజ గారు(Madhavi’s daughter), తెర వెనుక కష్టపడ్డ ఎందరో గొప్ప technicians, ఇంతమంది legends సమిధలై ఒక యజ్ఞాన్ని తలపెడితే అదే మన సాగరసంగమం అనే మహాయాగం, అమరకావ్యం సృష్టింపబడింది. వారి కష్టఫలమే తెలుగు సినీ చరిత్ర మకుటంలో ఒక అరుదైన వజ్రమై వెలుగులీనుతోంది.
ప్రతి తెలుగువాడు, ప్రతి శాస్త్రీయ నాట్య కళాకారుడు(classical dancer), ప్రతి భారతీయ సినీ ప్రేక్షకుడు collar ఎగరేసి చెప్పుకోగలిగిన గొప్ప సంపద మన సాగరసంగమం . పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ సంస్థ పేరు మీద release అయిన ఈ సినిమాకు రెండు National అవార్డులు, మూడు Filmfare లు, ఒక నంది, అన్నిటిని మించి ఎనలేని ప్రేక్షకాదరణ వరించాయి. ఇది బాలకృష్ణ అనే శాస్త్రీయ నృత్య కళాకారుని కథ. కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇలా అన్ని రకాల భారతీయ నృత్యాలను నేర్చుకుని అన్నిటిని ఒకే తాటిపైకి తీసుకురావాలని తపన పడే యువకుని కథ. టాలెంట్ ఉన్నా పేదరికం వల్ల పైకి ఎదగలేని బాలు కి మాధవి అనే ఒక పెద్దింటి అమ్మాయి పరిచయం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడతారు. బాలు talent చూసిన మాధవి అతడికి support గా నిలుస్తుంది. మన కథానాయకుడి కి అండగా నిలిచే పాత్రలో జయప్రద గారు ఒదిగిపోయారు అనడంలో ఏ మాత్రం సందేహం లెదు. బాలు అనే కుర్రవాడిని విశ్వనాథ్ గారు మంచితనం, దీక్ష, హాస్య చతురత, ఆదర్శ జీవనం లాంటి గొప్ప గుణాలున్న వాడిగా ఆ character ని తీర్చిదిద్దారు.
అంత గొప్ప talent ఉన్న ఒక dancer అనుకోని విధంగా ఒక తాగుబోతుగా, ఒక రోగిగా, ఒక విఫల ప్రేమికుడిగా మారిన పరిస్థితులను దర్శకుడు హృదయాలను కలచి వేసేలా తీసారు. నిజమైన స్నేహం ఏ పరిస్థితిలో అయినా అండగా తోడుగా ఉంటుందని రఘుపతి (Sharath Babu) ద్వారా అద్భుతంగా చూపించారు.ఆ పాత్రలో శరత్ బాబు గారు జీవించారు. కమల్ హాసన్ గారి గురించి ఎంత పొగిడినా తక్కువేనండి. నాట్యాన్నే జీవితంగా భావించే బాలు నుండి, తాగుబోతుగా మారి బావి పై 'తకిట తదిమి' నృత్యం చేసిన బాలు వరకు, ఆ పాత్రకు ప్రాణం పోశారు మన లోకనాయకుడు. ఆ పాత్రను తన నటన తో పతాక స్థాయికి తీసుకెళ్ళారు. కమల్ హాసన్ లేని సాగారసంగామాన్ని ఊహించుకోవడం కష్టమేమో. ఈ సినిమా కథ ఒక ఎత్తు అయితే, దానికి అందించిన బాణీలు ఒక ఎత్తు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. మన వేటూరి గారి సాహిత్యం, మన ఇళయరాజా గారి సంగీతం, గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం, జానకిల గానం, అన్నీ కలిసి ఒక గానామృత చిత్రంగా సాగారసంగామాన్ని తీర్చిదిద్దాయి.
తాగుబోతుగా, దిశలేకుండా బ్రతుకుతున్న బాలు లోని కళని తిరిగి బయటకు తీయాలని మాధవి ప్రయత్నించడం, తాను నేర్చుకున్న కళను మాధవి కూతురికి నేర్పించి ,సభలో నే చూస్తూ కన్నుమూయడం, బాలు ని స్నేహితుడు రఘుపతి, మాధవి వర్షంలో తీసుకెళ్తూ ఉండడంతో సినిమా end అవుతుంది. అబ్బ... రాస్తుంటే నాకు ఇక్కడే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమా final shot లో విశ్వనాథ్ గారిచ్చే గొప్ప సందేశమే ‘No end for any art’.
ఈ సినిమా కళకు బంగారు నీరాజనమండి. ఈ సినిమా చూసి చాలా మంది classical dances నేర్చుకోవడం మొదలుపెట్టారు, వాటి విలువను అర్తంచేసుకున్నారు. పెద్ద, చిన్న, ఆ తరం , ఈ తరం తేడా లేకుండా ఇంటిల్లిపాది చూడగలిగే గొప్ప సందేశాత్మకమైన, కళాత్మకమైన, అమరమైన ప్రేమ కథ. అందరూ చూడండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి.