26/11/2008 లో ఎంతో మంది ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడిన వీర సైనికులు.. Sri Hemant Karkare , Sri Ashok Kamte, Sri Vijay Salaskar, Sri Major Sandeep Unnikrishnan, Sri Tukaram Gopal Omble, లను స్మరించుకుంటూ..
కాలం కన్న వేగంగా పరిగెత్తే గుండె చప్పుడు జైహింద్ అంటుంటే... ఎప్పటికి రెప్ప వేయనని కన్నులు దేశాన్ని గస్తి కాస్తుంటే.. ఊపిరయ్యే ప్రతి గాలి దేశం మీదున్న ప్రేమని నింపుతుంటే ... సాగుతున్న దేశ సైనికుడిని ఈ దేశానికి తొలి ప్రేమికుడిని.
జనగణమన గీతం తరంగమై చెవి లో పదే పదే ప్రతిధ్వనించగా ... జన ప్రాణ రక్షణ లక్ష్యమని పాదాలు పద పదమని పరుగులు తీయగా.... దేశకాంతిని ఏ బాంబు దుమారం ఆపకుండా రెండు చేతులతో కాపాడుకుంటూ.... సాగుతున్న దేశ సైనికుడిని ప్రతి కుటుంబానికి ఆత్మబంధువుని.
కోట్లమంది సంతోషం కోసమే సమరం చేస్తూ... ప్రాణాలు వదిలిన కానీ, ప్రతి సైనికుడిని ఉత్తేజానా తిరిగి జన్మిస్తూ... నింగి అంచున ఎగిరే జెండా ఠీవి లో నివసిస్తూ... నిలిచిపోయే ఈ దేశ సైనికుడిని గెలిచిపోయే భారత మాత పెద్దకొడుకుని.