ఇంజినీరింగ్ కంప్లీట్ చెయ్యడానికి మనోళ్లు చాలా కష్టపడతారు. ఇంజినీరింగ్ 4 సంవత్సరాలైతే 5,6,10 ఇంకా ఎప్పటికీ పాస్ కాని మహానుభావులను కూడా మనం చూస్తుంటాం. బహుశా ఈ ఆర్టికల్ ను చూసి వాళ్ళందరూ కుళ్ళుకుంటుంటారు కాని తప్పడం లేదు బ్రదరూ..
మూడు సంవత్సరాల నుండే:
మామూలు పేరెంట్స్, టీచర్స్ లా సంహిత పేరెంట్స్(గీత, లక్ష్మీ నరసింహా) అస్సలు ఆలోచించరు. సంహితను వాళ్ళను చూసి నేర్చుకో, వీళ్ళను చూసి నేర్చుకో అని మిగిలిన వాళ్ళను కాపీ కొట్టమని చెప్పలేదు. స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగానే ఆలోచించనిచ్చారు. వీలు కుదిరినప్పుడల్లా ఒక ఆట సమయంలా పద్యాలు చెప్పేవారు. జస్ట్ 3Years నుండే గుర్తుపెట్టుకొని గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తుండడంతో పేరెంట్స్ ఇంకా జ్ఞానంతో ఆటలాడించారు. ప్రపంచ దేశాల పేర్లు, వాటి రాజధానులు, ఆయా దేశాల జెండాలను చూపించి వాటి దేశాల గురుంచి చెప్పుచుద్దాం అని పేరెంట్స్ సరదాగా గడిపేవారు. సంహిత 3 Years నుండే పేరెంట్స్ మీద గెలవడం మొదలుపెట్టింది.
అబ్దుల్ కలాం గారి నుండి:
సంహిత మూడేళ్ల వయసు నుండి చదవడం మొదలుపెట్టిన దగ్గరినుండి అర్ధం చేసుకోవడం కూడా మొదలుపెట్టింది. సంహిత చదువులోనూ మాత్రమే కాదు క్విజ్, ఆటలలోను ఆశ్చర్యానికి లోను చేసేది. ఐదు సంవత్సరాల వయసులో 16 పేజీల ఆర్టికల్ రాసి అబ్దుల్ కలాం గారికి పంపించారు. "ఇంత చిన్న వయసులో ఇంతటి జ్ఞానమా" అని కలాం గారు ప్రత్యేకంగా పిలిచి ప్రశంసించారు కూడా.
10 Years కి 10th క్లాస్:
ఇందాకనే చెప్పుకున్నాం కదా మూడు సంవత్సరాల నుండే గెలుస్తూ వస్తుందని. సంహిత ఆనంద పడుతుంది దానికి రెట్టింపుగా ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని పేరెంట్స్ అనుభవించారు. ఎదో చదవాలి రికార్డ్ కోసం, పక్కోడిని మన సక్సెస్ తో బాధపెట్టాలని అస్సలు చదివించలేదు. భయంతో బట్టీ పట్టించడం కాకుండా ప్రేమతో "కాన్సెప్ట్ మెథడ్" తో చదివించడం మొదలు పెట్టారు. గంటల తరబడి చదువు చదువు అని ఏనాడు కూడా సంహిత చదవలేదు. అలా పేరెంట్స్, టీచర్స్ సరైన గైడెన్స్ తో10th క్లాస్ Exams లో 8.8జి.పి.ఏ తో పాస్ అయిపొయింది సంహిత.
CBITలో ఇంజినీరింగ్:
తన వయసుకు మించిన Talent తో.. "అసలు నేను ఎవరినండి ఈ వయసులో ఇంత - టాలెంట్ ఉండాలి" అని Explain చెయ్యడానికి. అందరూ అదే Age లో ఎదుగుతూ వస్తున్నారు కాబట్టి అనుకున్నాను కాని సంహిత లాంటి వారు వయసుకు టాలెంట్ కు సంబంధం ఉండదని Example ఇస్తున్నారు. సంహిత "ఐదు సంవత్సరాల వయసులో చిల్డ్రన్ డే నాడు పిల్లలు మోస్తున్న బ్యాగుల బరువుల గురుంచి స్పీచ్ ఇచ్చేసింది" ఇదొక్క ఉదాహరణ చాలు సంహిత గురుంచి అర్ధం చేసుకోవడానికి. నలంద జూనియర్ కాలేజ్ లో MPC గ్రూప్ నుండి Intermediateలో 89%తో పాస్ అయ్యాక చిన్న Age లో ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ కావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత ఇబ్బంది పడినా గాని చిన్నతనం నుండి సంహితకు వచ్చిన ప్ర్తెజ్ లు, సర్టిఫికెట్ లు చేసి తెలంగాణ ప్రభుతం Special జీవో జారీ చేసింది. ఎంసెట్ కాకుండా ప్రత్యేకంగా ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇంజినీరింగ్ లో Admission కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు. అలా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన CBIT కాలేజ్ లో 8.85జిపిఎ తో తెలంగాణలోనే Youngest Engineer(electrical and electronic engineering) గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే సంహితకు Campus Selection లోనే మంచి జాబ్ వచ్చినా కాని "నాకు ఇంకా చదువుకోవాలని ఉంది" అని జాబ్ కు ఒప్పుకోలేదు.
మూడేళ్లకే దేశాలు, రాజధానుల పేర్లు గుర్తుపెట్టుకుని చెప్పడం.. నాలుగు సంవత్సరాలకే నాలుగొవ తరగతి పాఠాలు చదవడం, 10 సంవత్సరాలకే 10వ తరగతి పూర్తి చెయ్యడం,16 సంవత్సరాలకే ఇంజినీరింగ్ పాస్ అవ్వడం.. ప్రస్తుతం ఎం.టెక్ పూర్తిచేసి, తర్వాత ఎం.బి.ఏ చెయ్యాలనే ఆలోచనలో ఉంది. సంహిత చదువులో రికార్డులు పూర్తిచేసిన తర్వాత దేశ ప్రగతిని మార్చివేయడంలో రికార్డులు సృష్టించబోతుందనడంలోనే అతిపెద్ద విజయం దాగి ఉంది .