తెలుగు పండగలు గురించి తెలుగు లో చదవాలి కదండి. కాస్త ఓపిక చేస్కుని మీ తెలుగుని టెస్ట్ చేసుకోండి మరి. సిటీ లో ఎక్కువ ట్రాఫిక్ లేకుండా రోడ్ లు అన్ని ఖాళీగా ఉన్నాయి అంటే అది తప్పకుండ సంక్రాంతి పండుగ ఎఫ్ఫెక్ట్ ఏ. అందరూ పట్నం ఒదిలి పల్లె కు చేరుకుంటారూ. మరి ఆ పండుగ విశేహాలు చూద్దామా
1. చిన్న, పెద్ధ అని తేడా లేకుండా అందరికి నచ్చి చేసేది కైట్ ఎగరయెడం. మాంజ, అఫ్ఫా లాంటి పదాలు వాడేస్తూ తెగ కంపెటిషన్స్ పెట్టేసుకుంటారు. మనం ఎగరేయకపోయిన, కూర్చుని అలా ఆకాశాన్ని చూస్తూ ఉంటె చాలు.

2. పండుగ వాతావరణం ని తీసుకొచ్చేది ఇవే. రంగు రంగు ముగ్గుల నుంచి రధం ముగ్గులు వరకు అన్ని మనల్ని ఆకట్టుకుంటాయి. అమ్మాయిలు, అంటీలు తెగ కష్టపడ్తారు కరెక్ట్ ముగ్గు వెయ్యడాన్కి.

3. గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దుల ఇవి లేకుంటే పండగ కల తప్పినట్టే. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టేసి పువ్వులు తో నింపేస్తే భలే ఉంటుందిి. హరిదాసులు పాటలు పాడుతూ గంగిరెద్దులు ను తీసుకొస్తు ఉంటె చూడడం ఓక సరదా.

4. భోగి రోజు పొద్దునే లేచి పాత సామాలు, పిడకలతో మంటలు వేసి చలి కాచుకుంటే బలే ఉంటుంది కదు. పిడకలు ఎందుకు ఏస్తారో తెలుసా? అవి మంటలో కాలి గాలి ని స్వచ్చంగా చేస్తుంది. ఇంకా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడం, అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయ్.

5. మన అమ్మమ్మలు చేసే పిండి వంటలు ఎవరికి నచ్చవు చెప్పండి. నోరు ఊరించేస్తుంటాయ్. జంతుకలు, కారం పూస ఇలా ఎన్నో రకాలు. ఇంకా పసందైన భోజనాలు ఉండనే ఉంటాయ్.

6. మన అమ్మలు ఇల్లుని నీట్ గా ఉంచడాన్కి పడే కష్టాలు, మనల్ని హెల్ప్ చేయమని అడగాడలు. వాళ్ళకి అందని చోట్లని మనం శుభ్రం చేయాలి అనమాట. మొత్తానికి భాగా అందంగా తయారుచేస్తారు.

7. అందరూ పొద్దునే చేసే సౌండ్స్ తో మనకి ఎలాగూ నిద్ర పట్టదు. ఇంకా మన అమ్మలు రెడీ గా ఉంటారు మనల్ని లేపడాన్కి. త్వరగా లెగు రా, పూజ కి టైం అవుతుంది అని. భోజనాలు,చుట్టాలు, కొత్త డ్రెస్సులు. అసలు మామూలు హడావిడి ఉండదు.

8. కోమసీమ లో కోడి పందాలు అంటే ఒక రేంజ్ లో జరుగుతుంటాయి. సంవత్సరాల నుంచి పెంచుతుంటారు, పరువు తో పోల్చుకుంటారు కదా, ఆ మాత్రం ఉంటాది లెండి. అవి కొట్టుకుంటునప్పుడు బానే ఉంటాది కానీ, దేనికైనా డెబ్భ తాకినా/ చనిపోయిన చూసి బాధ పడాల్సిందే.

మన రైతులకి పంట చేతికి ఒస్తుంది అనే సంతోషం తో సంక్రాంతి పండుగ ని చేసుకుంటారు. ఆ కొత్త బియ్యం తోనే పొంగల్ చేస్తారు. అందుకే పొంగల్ అనే పేరు కూడా ప్రాచుర్యం లో ఉంది. పైన ఉన్నవి అన్ని పూర్తిగా అనుభూతి చెందాలి అంటే మన ఊర్లకి వెళ్లాల్సిందే.
సంక్రాంతి శుభాకాంక్షలు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.