What If...Sarvam From Amrutham Gives Suggestions To Solve The TN Political Crisis In His Style?!

Updated on
What If...Sarvam From Amrutham Gives Suggestions To Solve The TN Political Crisis In His Style?!

అందరికీ నమస్కార వణ్ణక్కం,

తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను నేను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంటిని. మొన్న కిల్లీ వేసుకొని ఆలోచిస్తూ ఉంటె ఈ సమస్యని పరిష్కరించగలిగే మేధావిని నేనే అని నాకు అర్ధం అయ్యింది ,మా అంజి సార్వాడి శిష్యరికం లో నేను కూడా జాస్తి తెలివిమంతుడిని అయ్యితిని కదా. విషయం ఏమంటే నేను తంబి పన్నీరుసెల్వా కి, చిన్నమ్మకి నా సలహాలు ఇలా తెలియపరుస్తున్నాను.

తంబీ, పన్నీరుసెల్వ, నీవు నేను ఒకే మాదిరిదా. మా అంజి, అమృతం సార్వడ్లు ఊరిలో లేనప్పుడు నేనుదా అమృతవిలాస్ ని చూసుకునేవాడ్ని, మళ్ళా సార్వాడ్లు వచ్చినాక నేను ఎప్పటిమాదిరి సర్వర్ ని. నీ విషయం కూడా అంద మాదిరే, కాబట్టి నీవి ఇంద మాదిరి తగువు చేయరాదు, నాకు అంజి, అమృతం సార్వాడ్ల మాదిరి, నీకు అమ్మ, చిన్నమ్మ. కావున నెమ్మదిగా కూర్చొని నిర్ణయానికి రమ్ము.

ఇప్పుడు చిన్నమ్మ, మీరుదా ఎప్పుడు వెనకే ఉండి కథ నడిపినారు మా అంజి సార్వాడి మాదిరి, ఇప్పుడేమో అంతా నేనే అని అంటున్నారు, హనుమంతుడు లేకుండా, రామాయణం, సర్వం లేకుండా అమృతవిలాస్, పన్నీరుసెల్వం లేకుండా మీరు నిలబడడం కష్టం....కావున మా అమృతవిలాస్ లో సాంబారిడ్లీ సాపాడు చేస్తూ ఒక రాజీ కి రండి.

మీరుదా త్వరగా ఒక నిర్ణయం తీసుకోకపోతే నేనే ఒక పార్టీ మొదలుపెట్టెద,కిల్లీ గుర్తు తో.అసలే నాకు మా యూత్ లో,అమ్మాయిల్లో రొంబ ఫాలోయింగ్ ఉంది, మీరు ఎదో ఒకటి త్వరగా తేల్చవలె,లేకపోతే ఇంగ నేనుదా రంగంలోకి రావలసివచ్చును.

PS: అప్పాజీ సార్వాడు,ఇప్పుడు నేను భావితమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిని,కావున ఇకనైనా ఆలస్యం చేయక,ఉమాదేవితో వివాహం జరిపించండి.

ఇట్లు, సర్వేశ్వరన్, After 2 months CM of Tamil Nadu