Are you Satisfied With What You Have in Your Life?

Updated on
Are you Satisfied With What You Have in Your Life?
(Contributed by విక్రం బొల్లం) ఎదో ఒకటి, ఉద్యోగం ఉంటే చాలు. ఎవరో ఒకరు, పెళ్లి అయితే చాలు. ఏవో ఒకటి, వేసుకోడానికి బట్టలు ఉంటే చాలు. చిన్నదో, పెద్దదో, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు. ఎందుకిలా నువ్వు లేచిన దగ్గరినుండి, పడుకునే వరకి ప్రతీ విషయంలో రాజీ పడుతున్నావ్? ఎందుకీ సంతృప్తి ధోరణి? ఎందుకీ సర్దుబాటు? ఏం సాదిస్తావ్ ఈ సంతుష్టి జీవన శైలితో? నీ తలకి నిప్పంటుకుంటే, ఎదో ఒకటి, ద్రవమే కదా అని పెట్రోల్ పోసుకుంటావా? ఎవరో ఒకరు అని పందుల్ని పంక్తి భోజనానికి ఆహ్వానిస్తావా? కోరికలు ఉంటే తప్పేంటి? కోరికల వల్ల వచ్చే నష్టం ఏంటి? వెయ్యి రూపాయలను కూడా ఎప్పుడూ చూడని వ్యక్తి, అంబాని అయ్యాడంటే, ఆ కోరికే కారణం! వీధుల్లో తిరిగే వ్యక్తిని, బాలీవుడ్కి బాద్షాని చేసింది, ఆ కోరికే! అక్షర జ్ఞానం లేని వాల్మీకిని, రచయితను చేసింది, ఆ కోరికే! అత్యాశ అక్కర్లేదు, కోరికల వల్ల వచ్చే నష్టం లేదు. కలలు కను, కన్న కలల్ని జయించు! నీ కలలే, నీ పునాదులు! నీ కలలే, నీ కంభాలు! నీ కోరికలే, నీ పుస్తకంలోని పేజీలు! నీ కోరికలే నీ జీవితం!