"హైపర్ రియలిజం" అనే ఈ ప్రత్యేకమైన ఆర్ట్ ఈనాటిది కాదు కెమెరా కన్నా 150 సంవత్సరాల కాలం నాటిది. దీనిని మొట్టమొదటిసారి యూరోపియన్ చిత్రకారులు అభివృద్ది చేశారు. మిర్యాలగూడ గరిడెపల్లి అనే చిన్న గ్రామానికి చెందిన సత్యం గారు నేటి తరానికి మరోసారి తనదైన శైలిలో పరిచయం చేస్తున్నారు. మన ఇష్టాలు అభిరుచులే ఇతరుల కన్నా మనమెంత ప్రత్యేకమైన వారమో తెలియజేస్తాయి. తన అన్నయ్యలిద్దరూ మంచి ఆర్టిస్టులవ్వడంతో పేయింటింగ్స్ మీద ఇష్టం పెరగడానికి అంత సమయం పట్టలేదు.
ఆ ఇష్టమే జె.ఎన్.టి.యూ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేసేలా చేసింది. అలా ప్రపంచ చిత్రకళను అధ్యయనం చేశారు. మిగిలిన వాటికన్నా హైపర్ రియలిజం వల్లనే తనకంటూ ఓ ప్రత్యేకత లభిస్తుందని ఆశించారు. అలా చేసిన శ్రమే అతనికి అద్భుతమైన ఫలితాలను రాబట్టగలిగింది. భారతదేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటు అమెరికా, బ్రిటన్ లాంటి ఇతరదేశాలో సైతం ప్రదర్శనలిచ్చారు.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, రతన్ టాటా గారు లాంటి మహోన్నతులు సత్యం గారి ప్రతిభకు ముగ్దులయ్యారు.
ఈ వస్తువులన్నీ కూడా ప్రతిరోజు మనం ఉపయోగించేవే.. సడెన్ గా చూడగానే నిజమైన వస్తువులేమోనని కొన్నిక్షణాల పాటు భ్రమకు లోనైనట్లైతే అది సత్యం గారి ప్రతిభకు తార్కానం!