If you Don't Start Saving Water Today, This is What will Happen to You!

Updated on
If you Don't Start Saving Water Today, This is What will Happen to You!
nbsp;

అందరికి ఒక Day లాగానే Water కూడా ఒక Day ఉంది. Pure Water Is The World's First And Foremost Medicine అంటారు. అదొక్కటే కాదు ఈ భూమి మీద Humans బ్రతుకుతున్నారంటే గాలి, నింగి, నేల, నిప్పు తో పాటు నీటి ప్రధాన్యత ఉన్నతమైనది. ఒక మనిషి Food లేకుండా కొన్ని వారాలు బ్రతకగలడు కాని Water తాగకుండా మాత్రం ఒక వారం కూడా జీవించలేడు. మన ప్రపంచంలో ఉన్న నీటిలో 97.5% నీరంతా ఉప్పు నీటి సముద్రమే. మిగిలిన 2.5% లో 70% మంచురూపంలో ఉండిపోయింది. ఈ భూమి మీద నదులు, చెరువుల రూపంలో మనకు మిగిలి ఉన్నది కేవలం 1% నీరే.మన ఇండియాలో నీటికోసం పురాతన కాలం నుండే యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పటికి రాష్ట్రాల మధ్య కూడా ఎంతలా గొడవలు జరుగుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. మన శరీరంలో 60% నీరే ఉంటుంది. నీటి అవసరం ఎంత ఉందో మనకు తెలుసు కాని మన భారతదేశంలో నీరు అనుకున్న స్థాయిలో దొరకక పోవడం వల్ల ఎంతస్థాయిలో మనం Problems Face చేస్తున్నామో ఒకసారి గమనించుదాం....

విస్తీర్ణంలో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా ఉన్న మనదేశంలో 60% వరకు వ్యవసాయం కొరకు ఉపయోగిస్తున్నారు. Ground Water లేకపోవడం ఇంకా 65% వరకు సరైన Irrigation Facilities లేకపోవడం,Power అనుకున్నంత రాకపోవడం వల్ల రైతులు వర్షం మీదనే ఇప్పటికి ఆధారపడుతున్నారు.రైతులు ఎదుర్కుంటున్న సమస్యలలో నీరు లేకపోవడం అత్యంత ప్రధాన సమస్య. 1 Kg Rice పండించడం కోసం దాదాపు 5,000 liters Water రైతుకు అవసరం..

World's Second Highest Population ఉన్న మన Country లో ప్రపంచంలోనే 17% జనాభా మన దేశంలో ఉన్నారు (125Cr Population). కాని మనకు కేవలం 4% మాత్రమే తాగునీరు అందుబాటులో ఉంది. ఒక్క రోజుకి మన హైదరాబాద్ లోనే 460 Million Gallons Water Requirement ఉంటే అందులో 40% Water Waste అవుతుందంటా. Pipeline Problems, ఇంకా ఇతర కారాణాల వల్ల వేస్ట్ చేస్తున్నాం....ఇండియాలో Water Reasons వల్ల చనిపోతున్న వారిలో 43% Dehydration తో చనిపోతున్నారు అందులో 84% చిన్నపిల్లలే ఉన్నారు. మన ఆసియాలో మహిళలు 20లీటర్ల నీటి కోసం 6 kilometers నడుస్తున్నారు. వీరిలో చాల వరకు Spine&Neck Pain అనుభవిస్తున్నారు..

ఫ్యాక్టరీ వదిలిన వ్యర్ధాలను నదులలో వదలడం, చనిపోయిన శవాలను గంగా వంటి నదులలో వదిలేయడం,Sanitation కరెక్ట్ గా లేక పోవడం వల్ల భారత్ లో ఉన్న 80% నీరు వరకు Pollutionకి గురి అయ్యింది. వీటివల్ల కలరా, Borne Diseases, Jaundice, Diarrhea తో ఇంక చాలా రకాల Health Problemsతో చాలమంది చనిపోతున్నారు Polluted నీటి వల్ల. ప్రస్తుతానికి 80 దేశాలు తాగునీటి సమస్యను ఎదుర్కుంటున్నాయి. దేశంలో పుట్టిన ప్రతినది కూడ సముద్రంలో కలిసిపోతున్నది. 2025 నాటికి వీటిలో చాల దేశాలకు తీవ్రమైన సమస్యను ఎదుర్కొబోతున్నాయని జాన్ హాప్కిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిస్తుంది. ఇది ఏ గవర్నమెంట్ వారిదో లేదంటే ఏ రాజకీయ నాయకుడిదో కాదు భాద్యత ప్రతి ఒక్కరిది. దేనినైన తయారు చేయవచ్చు సృష్టించవచ్చు కాని నీటిని కాదు..