పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు హీరోయిన్లందు సావిత్రి గారు వేరు. మహానటి అనే పదానికి పర్యాయ పదం సావిత్రి గారు. ఇంతవరకు సావిత్రి గారి గురుంచి భారమైన ఆర్టికల్స్ యే చూశారు. 1963 నాటి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ఇచ్చిన హావభావాల సమాధానాల ద్వారా సావిత్రి గారి లోని మరో కోణాన్ని చూద్దాం. (నాటి విలువైన జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడి నేటి ప్రేక్షకులకు అందిస్తున్న కౌముది కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..)
1. ఇక ప్రమదావను ప్రశ్న.. పాక శాస్త్రంలో మీకు ప్రావీణ్యం ఉందా.?
2. ఏకాంతంగా ఉన్నప్పుడు మీ శ్రీవారు మిమ్మల్ని ఏ విధంగా సంబోధిస్తారో తెలుసుకోవచ్చా.?
3. సెట్ మీదికి వెళ్ళే ముందు మీరు ధరించబోయే పాత్ర గురించి మీ మనసులో ఒక సుస్పష్ట రూపాన్ని చిత్రీకరించుకుంటారా.?
4. ఈ వేసవిలో కోడైక్కనాల్ వెళ్లారు కదా.? ఆ చల్లటి ప్రదేశంలో చాలా హాయిగా విశ్రాంతి తీసుకోనుంటారు.?
5. మీ కుమార్తె చిరంజీవి విజయకు త్వరలోనే తమ్ముడో, చెల్లాయో పుట్టబోతున్నారని..?
6. మీరు స్వయంగా ఏదైనా చిత్రాన్ని నిర్మించే ఉద్దేశ్యం ఉందా.?
7. మీరు స్టూడియోకు వెళ్తూన్నప్పుడు కోడం బాక్కం లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద మీ కారును ఆపవలసి వచ్చినప్పుడు మీరెలాంటి అనుభూతిని పొందుతారు.?
8. మీ ఆదాయం 'లకారం' దాటిందటగా?
9. నేడు అఖిల భారత తార ఖ్యాతి నందుకున్నందుకు మీరు గర్విస్తారా.?
10. మీకు మంత్రి పదవి లభిస్తే..?
11. మీ 'ఆత్మకథ' ను రచించే ఉద్దేశ్యం ఉందా.?
12. మీరు సంగీతమంటే చెవి కోసుకుంటారా..?
13. స్విమ్మింగ్ దుస్తులో మీరు నటించడానికి ఇష్టపడుతారా.?
14. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ ఫాషన్ చీరలను ఎన్నుకోవడంలో మీరు చాలా నేర్పుదల చూపిస్తారటగా.?
15. అన్నట్టు మీ ఇంట్లో ఎవరిదండి పై చేయి.? మీదా, మీ శ్రీవారిదా.?
16. అత్యవసర పరిస్థితిలో యుద్ధరంగం నించి పిలుపు వస్తే, మీరు ముందంజ వేస్తారా.?
17. మీరు ఆవకాయను మరచి పోలేదుగా.?
18. మీరు నాస్తికులా.?
19. దేహం నాజూకుగా ఉండడానికి మీరు ప్రతిరోజూ తగు పరిశ్రమ చేస్తారా.?
20. మీకు కాస్త ముక్కోపం ఉందని ఎవరో అన్నారు... నిజమేనా.?
21. మీరింకా సన్నబడతారా.?
22. మీ అమ్మాయి చిరంజీవి విజయ కూడా మీ అడుగుజాడల్లో నడుస్తూ, మీ లాగే అఖిల భారత తారగా ఖ్యాతి గడిస్తుందా.?