(Contributed by Rupesh)
నాపేరు అర్ఙున్.
Feb 18,2016 చెల్లి పెళ్ళికి ఇంకా రెండు రోజులె ఉంది. ఏ అన్నయ్యకైన చెల్లి పెళ్ళి అంటె చెప్పలెనంత భాద్యత, చెయ్యలేని పనులు ఉంటాయి. ఆ రోజు ఉదయం నేను ఇంటి బయట phone మాట్లాడుతున్నాను, అప్పుడే ఆమెను చూసాను. తాను నా వైపు వస్తుంది, ఎందుకో తెలీదు నా గుండె చాల వేగంగా కోట్టుకోవడం ప్రారంభించింది. ఆమె వచ్చి హయ్ అని అంది. నేను హయ్ సావిత్రి అన్నాను. school లో, college లో, ఊరిలో, అందరు నీ lover ఎవరు అని అడిగిన ప్రతిసారి లేదు అని చెప్పలేక నా అభిమన Heroine సావిత్రిగారి లాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నా అని చెప్పెవాడిని. తాను నాకు నచ్చిందో, లేదా ఇంకా ఎందుకో మరి సావిత్రి అని పిలవలనిపించింది. సావిత్రి ఎంటి నేను సుమని, నీ చిన్న మామయ్య కూతురిని మర్చిపోయవా అని అడిగింది. లేదు,మర్చిపోలేదు, ఎలా ఉన్నావ్ అని అడిగాను. బాగున్నాను అని చెప్పి ఇంతలో వాళ్ళ అమ్మ పిలిస్తే వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలు అయింది ఆమెను చూసి, ఇప్పుడు చూడగానే అందానికి అసలైన definition లా అనిపిస్తుంది. ప్రక్కన ఉన్న పూల మొక్కలను చుసి, అప్పుడువరకు "ఆమని వస్తే కోమ్మలన్ని కోయిలమ్మలు కాదా" అని పాడిన వేటూరిగారి పాట "ఆమె వస్తే కోమ్మలన్ని కోయిలమ్మలు కాదా" అని పాడలనిపిస్తుంది. పెళ్ళిలో చాలా పనులు చేస్తున్నా,నా చూపులు తన మీదె ఉన్నా. తను నన్ను చూసిన ప్రతి క్షణం నాకు ఒక గెలుపులా అనిపిస్తుంది.పెళ్ళికి ముందు రోజు సాయంత్రం పూలు తిసుకురావటానికి, మమయ్యకి తెలిసిన వాళ్ళ తోటకు నన్ను, సుమని పంపించారు. వెళ్ళి వచ్చాం.
ఎన్నో మాటలు, తను నాతో అన్నా ప్రతి మాట నా డైరీలో underline చేసి మరి రాసుకోవాలనిపించింది. పెళ్ళి అయిపోంది. తరువాత రోజు సాయంత్రం నేను మేడ పైన ఉన్నా,తాను వచ్చింది. ఏంచేస్తున్నవ్ బావ అని అడిగింది. తను నన్ను బావ అని పిలవగానే సమధానం చెప్పడం మర్చిపోయా. నిన్ను ఒకటి అడగన, అంది. నా మదిలో దాచుకున్న రహస్యం తనకు తెలిసిపోయిందేమో అని భయం వేసింది. సరే అడుగు అని చెప్పాను. చిన్నప్పటినుండి నాకు ఒక ఆశ... ఎవరినైన అబ్బాయిని చెంప మీద కొట్టాలి అని, ఎందుకో నిన్ను కొట్టాలి అనిపిస్తుంది, కొట్టించుకుంటావా అని అడిగింది. అది వినగానే ప్రపంచంలోని అతిపెద్ద question mark నా faceలోనే ఉంది. కాని తను అడిగింది, నేను ఒప్పుకున్న. నా ఎదుట నిలబడి, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తు, చేతి గాజులు వెనుకకు జరిపి, కళ్ళు ముసుకో, నువ్వు నన్ను అలా చూస్తుంటే నేను కోట్టలేను అంది. సరే అని కళ్ళు ముసుకున్నా. కొట్టింది, గట్టిగానే కొట్టింది. కాని కొట్టింది తాను కాదా తానువు చలించలేదు. గట్టిగా తగిలిందా అని అడిగింది, లేదు అన్నాను. అమ్మయీలను ఎంతోమంది విసిగిస్తు ఉంటారు. కాని వాళ్ళని కొట్టకుండ నిన్ను ఎందుకు కొట్టానో తెలుసుకోవాలనిపించలేదా? ఉంది చెప్పు అన్నాను. చిన్నప్పటినుండి నాకు నచ్చిన వాళ్ళనే చెంప మీద కొడదాం అనుకున్న అందుకే నిన్ను కొట్టాను అని చెప్పి వెళ్ళీపోతుంది. నాకు అర్థంకాలేదు, సుమ ఆగు అర్థంకాలేదు అన్నాను. నీ బుగ్గ మీద చూసుకో అర్థం అవుతుంది అని చెప్పింది. నేను వెoటనే కిందకు వెళ్ళి అద్దంలో చూసుకున్న. తాను love symbol ని చేతిలో వేసుకుని, నన్ను కోట్టింది. అది నా బుగ్గ మీద ఉంది. అది చూడగానే ప్రపంచంలోని ప్రతీ ఒక్కడికి వినిపించేల నా సావిత్రి నాకు దోరికింది, అని చెప్పాలనిపించింది. మన జీవితంలో దీనేమ్మ జీవితం అని అనుకోనే రోజులు చాలానే ఉంటాయి, కాని మళ్ళి మళ్ళి రాని రోజు మాత్రం ఒక్కటే ఉంటుంది. నా జీవితంలో అలాంటి రోజు ఇదే.
'Savitri Chempa Pagalagottindhi... Kaani....' - A Short Story!
