Ideated By Pavan Chelamkuri
సవ్యసాచి సినిమా తెలుగు సినీ పరిశ్రమ లో విడుదల అవ్వబోతున్న మరో ప్రయోగాత్మక చిత్రం. సినిమా టీజర్ విడుదల చేసినప్పుడు "Vanishing Twin Syndrome" ని ఎదుర్కొనే హీరో ని పరిచయం చేస్తూ ఒక ఆసక్తి ని రేకేత్తించారు.
టీజర్ లో చివర్లో కనిపించే మాధవన్, ట్రైలర్ లో మాత్రం ఒక కొత్త రీతి లో కనిపించి ఆ ఆసక్తి ని ఇంకొంచెం పెంచారు. అయితే ట్రైలర్ మొదట్లో మనకొక శ్లోకం వినిపిస్తుంది.. " సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు".
ఆ శ్లోకం యొక్క మూలం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం వేదాలు నాలుగు 1.ఋగ్వేదం 2. యజుర్వేదం 3.సామవేదం 4.అథర్వణవేదం.
ఇందులో యజుర్వేదం యజ్ఞాల గురించి వివరిస్తుంది. అందులో ఏకాగ్నికాండం నుండి సవ్యసాచి ట్రైలర్ లో మనకు వినిపించిన శ్లోకంగ్రహించ బడింది, నిజానికి అది శ్లోకం లో ఒక పంక్తి మాత్రమే పూర్తి శ్లోకం ఇది.
‘’ఏక మిషె విశ్నుస్త్యా నయతుహ్ –ద్వే ఊర్జేస్త్వా నయతు –త్రీణివ్రతాయ విష్ణుస్త్వా నయతు చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వా నయతు –పంచ పశుభ్యో విష్ణుస్త్వ్యా నయతు –షడ్ రాయ స్పోషాయ విష్ణుస్వ్యా నయతు –సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు ‘’
ఈ శ్లోకం సాదరంగా పెళ్లి లో సప్తపదులు అంటే ఏడడుగులు వేస్తున్నప్పుడు. యజ్ఞాలకు అధిపతి గా భావించే వామన మూర్తి ని తలుచుకుంటూ హోమగుండం చుట్టూ తిరుగుతారు,
“మొదటి అడుగు” “ ఏక మిషె విశ్నుస్త్యా నయతు ” ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!
“రెండవ అడుగు” “ ద్వే ఊర్జేస్త్వా నయతు ” ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తి లభించునట్లు చేయుగాక!
“మూడవ అడుగు” “ త్రీణివ్రతాయ విష్ణుస్త్వా నయతు ” ఈ మూడవ అడుగు వివాహవ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక!
“నాలుగవ అడుగు” “ చత్వారి మాయో భవాయ విష్ణుస్త్వా నయతు ” ఈ నాలుగోవ అడుగు మనకు ఆనందమును విష్ణువు అనుగ్రహించుగాక!
“ఐదవ అడుగు” “ పంచ పశుభ్యో విష్ణుస్త్వ్యా నయతు ” ఈ ఐదవ అడుగు మనకు పశు సంపదను విష్ణువు అనుగ్రహించుగాక!
“ఆరవ అడుగు” “ షడ్ రాయ స్పోషాయ విష్ణుస్వ్యా నయతు ” ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమిచ్చుగాక!
“ఏడవ అడుగు” “ సప్త సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్త్వ్యా నయతు ” ఏడూ రకాలైన సోమాది యాగాలను విష్ణువు అనుగ్రహించు గాక!
పెళ్ళి అయ్యే ముందు వరకు వరుడు కొన్ని యజ్ఞాలు చేయటానికి మాత్రమే అర్హుడు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే. జంతువులకి అన్నం పెట్టటం, సాటి మనిషి కి అన్నం పెట్టటం ఇవి కూడా యజ్ఞం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది అని వేదాలలో ఉంది. కానీ ఏడూ రకాలైన సోమ యజ్ఞాల కి మాత్రం పెళ్లి అయినా తరువాత అర్హత వస్తుంది. ఈ అర్హత ఇమ్మని కోరుకుంటూ 7 వ అడుగు భార్య భర్తలు వేస్తారు .
అయితే ఈ శ్లోకాన్ని మాధవన్ ఎందుకు చెప్పినట్టు? ట్రైలర్ మొదట్లో వచ్చే బ్లాస్ట్ సీన్ కి ఈ శ్లోకానికి ఏమైనా లింక్ ఉందా.. ఆ బ్లాస్ట్ మాధవన్ దృష్టి లో ఒక యజ్ఞం తో సమానమా? అయితే ఆ యజ్ఞం ఏంటి? అసలు మాధవన్ క్యారెక్టర్ ఏంటి? వేచి చూడాల్సిందే. ఈ సంస్కృత శ్లోకం పూర్తిగా సంస్కృతం లో రాసిన సవ్యసాచి పాట సినిమా త్వరగా చూడాలి అనే ఆసక్తి ని కలిగిస్తున్నాయి.