Contributed by Raviteja Ayyagari
ప్రియమైన స్టూడెంట్ కి, నేను నీ స్కూల్ బాగ్ చెప్పుకునే మనసులోని మాట. మన అనుబంధం మొదలయ్యే సమయానికి నీకు 3 సంవత్సరాలు. మొదటి సారి నిన్ను చూసినప్పుడు ఫ్లాట్ అయిపోయాను. Love at first sight అని మనుషులు అంటే ఏంటో అనుకున్నాను. ఇదేనేమో. నిన్ను దక్కించుకోవాలి అని నాలానే మిగిలిన బాగ్స్ నాతో పోటీ పడ్డాయి. నీ బుడి బుడి అడుగులు వేస్కుని, అప్పుడే వచ్చిన ముద్దు ముద్దు మాటలతో, "దాది దాది నాకు ఆ బాగ్ కావాలి అని మీ నాన్న ని అడగడం" మీ నాన్న నన్ను నీకు అందించడం, ఇప్పటికి నాకు గుర్తుంది. మొత్తానికి ఆ సమయం వచ్చింది, మొదటి స్పర్శ! ఫస్ట్ టైం నువ్వు నన్ను ముట్టుకున్నావ్. అబ్బా! మగధీర సినిమా లో రామ్ చరణ్ కాజల్ ని తాకినప్పుడు కూడా ఇలాంటి వైబ్రేషన్స్ వచ్చి ఉండవ్. నీ వయసుకి మించిన బరువు ఉన్న పుస్తకాలను నాలో చాలా జాగ్రత్తగా దాచి, సుకుమారమైన నీ భుజాల మీద నన్ను వేస్కుని, మొదటి రోజు స్కూల్ కి వెళ్లిన సంఘటన నాకు ఇప్పటికి గుర్తుంది. ఆ వయసులోనే ఉసైన్ బోల్ట్ లాగ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ కింద పడిపోయావ్, నాకు ఏదైనా అయిందేమో అని పది సార్లు పదే పదే చూస్కున్నావ్. పిచ్చోడా! ఎంత ప్రేమ రా నేనంటే నీకు అని అప్పుడు సంబరపడిపోయాను! కానీ నెమ్మది నెమ్మదిగా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ఇంకో బాగ్ మీద మోజు పెరిగింది. అది నాకంటే అందంగా ఉంది అనే కదా దాన్ని దగ్గరకి చేర్చుకున్నావ్!? అంతేలే! ఎంతైనా నేను మనిషిని కాదు కదా! నా మీద ప్రేమ కలకాలం ఉండిపోవడానికి. నువ్వు ఏ బాగ్ వేసుకున్న అది నీకు సంతోషాన్ని ఇవ్వాలి అని ఎప్పుడు కోరుకుంటాను. కానీ నువ్వేమో ఇంజనీరింగ్ అసలు బాగ్ అనే పదానికే దూరంగా ఉన్నావ్. ఇలా అయితే ఎలాగా? సమాజంలో అసలే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే చాలా లోకువ. ఒక బాగ్ కొనుక్కుని వెళ్ళచ్చు కదా నాన్న ఆఫీస్ కి. నీ మీద జనాలకి ఒక మంచి అభిప్రాయం ఇస్తుంది. అరే! అమ్మ ఏవో ఫొటోలో చూస్తున్నారు! అరే! మనమిద్దరం. నీ స్కూల్ మొదటి రోజు. భలే ఉన్నాం ఇద్దరం! నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నవో! ఓహ్! వచ్చావా! రా! కూర్చో. ఏంటి! నీకు ఇంకా నేను గుర్తు ఉన్నానా!? నా గురించి మీ ఫ్రెండ్ కి ఎంత గొప్పగా చెప్పావ్ బంగారం! ఏంటి మళ్ళీ నన్ను నీ దగ్గరకు చేస్ర్చుకున్నావా! అయ్యో! నేను నీ గురించి ఎంత తక్కువగా ఆలోచించాను! నువ్వు నన్ను మర్చిపోయావ్ అనుకున్నాను! సారీ! నన్ను క్షమిస్తావ్ కాదు! నీ జీవితం లోకి ఎన్ని బాగ్స్ వచ్చినా, నేను ఎప్పటికి ఫస్ట్! బెస్ట్! మనిద్దరం made for each other! love you! ప్రియమైన నీకు, నీ ఫస్ట్ అండ్ బెస్ట్ స్కూల్ బాగ్