కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి అనే మారుమూల పల్లెకు చెందిన పురెళ్ళ శ్రీనివాస్ అనే యువ సైంటిస్ట్ తన ప్రతిభతో ప్రజలకు ఉపయోగపడె ఎన్నో పరికరాలను సృష్టిస్తున్నాడు.. అవి మాములు పరికరాలు కావు ఇప్పుడు దేశం ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఆ పరికరాలను నూతనంగా రూపొందిస్తున్నాడు. సైంటిస్ట్ అంటే ఏ సైన్స్ స్టూడెంటో, ఇంజనీరింగ్ స్టూడెంటో అనుకునేరు శ్రీనివాస్ చదివింది బి.ఏ. ఒక ఇంజనీర్ యే నెలలు, సంవత్సరాలు ఎంతో కష్టపడితే తప్ప ఆవిష్కరించలేని ఎన్నో పరికరాలను సోషల్ స్టడీస్ కు సంబందించిన చదువు చదివిన శ్రీనివాస్ అలవోకగా ఆవిష్కరిస్తున్నాడు. పేదరికంతో ఎన్నో కష్టాలు అనుభవించి డిగ్రి పూర్తిచేశాడు. శ్రీనివాస్ ది దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం. తండ్రి మరణంతో ఆర్ధిక భారం కష్టతరం అవ్వడంతో చిన్నపాటి మొబైల్ రిపేర్ షాపు నడుపుతూ, ఎలక్ర్టికల్ వర్క్స్ చేస్తు ఉపాధి కల్పించుకుంటున్నాడు. పనికిరాని ఏ వస్తువులు కనపడినా చాలు వాటితో ప్రయోగాలు చేస్తు సమజానికి ఉపయోగపడే నూతన పరికరాలను సృష్టించడం అతనికి చాలా ఇష్టమైన పని. శ్రీనివాస్ కు రెండు గదులున్న చిన్నపాటి ఇల్లు తప్పా ఇంకే ఆస్థులు లేవు.
పురెళ్ళ శ్రీనివాస్ ఆవిష్కరణలు..
• అట్టముక్కలు ఇంకొన్ని పరికరాలతో రేడియో స్టేషన్ ను రూపొందించాడు. ఇందుకోసం రేడియో ట్రన్సిస్టర్, ఏరియల్ కర్రముక్కలతో ప్రత్యేకంగా టవర్ ను రూపొందించాడు.. ఎలాంటి పవర్ అవసరం లేకుండా సూర్యుని సౌరశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. పాటలు, మంచి కథలు, మాటలతో ఇది 24 గంటలు పనిచేస్తుంది ఆ ఊరి ప్రజలకు ఇది మంచి కాలక్షేపంగా దీనిని నిర్వహిస్తున్నాడు.
• చెవిటి వారికోసం ప్రత్యేకంగా వినికిడి యంత్రాన్ని తయారుచేశాడు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న Sound Amplifier Machine పుట్టుకతో వచ్చిన చెవుడుకు పూర్తిగా పరిష్కారాన్ని చూపలేవు కాని శ్రీనివాస్ Complete Hearing & Deaf Machine ద్వారా వినికిడి సమస్యకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది మనిషికున్న దంతాల ద్వారా మెదడుకు సెన్సార్ల ద్వారా ధ్వని తరంగాలను యాంత్రిక తరంగాలుగా చివరకు కంపన తరంగాలుగా మార్చి మెదడుకు నేరుగా వినికిడి అందేలా ఈ మెషిన్ పనిచేస్తుంది.
•ఇతని సృష్టిలో మరొక అద్భుతం "Women Protective Shirt". నిర్భయ చట్టం లాంటి అతి కఠినతరమైన చట్టాలను అమలు చేసినా మహిళను రక్షణ కరువైంది మానభంగాలు, ఈవ్ టీజింగ్ లాంటి అగత్యాలు ఆగడం లేవు. ఇందుకోసం ఆడవారి రక్షణ కోసం దీనిని తయారు చేశాడు. ఇది ఒక మామూలు చొక్కాలా ఉంటుంది దీనిని వేసుకున్న అమ్మాయికి తప్పా మిగితా ఎవ్వరు ముట్టుకున్నా షాక్ తగిలి కొన్ని నిమిషాలపాటు అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు. కొన్ని అనుమానమున్న ప్రదేశాలలో మహిళలు దీనిని ధరించి రక్షణ పొందవచ్చు. దీనికి ఛార్జింగ్ సౌరశక్తి ద్వారా ఉంటుంది. ఈ రక్షణ కవచాన్ని తయారుచేయడానికి శ్రీనివాస్ కు పట్టింది కేవలం రూ.500.
• నేటి కరెంట్ కష్టాల వల్ల రైతులకు ఎప్పుడో రాత్రికి ఒక నిర్ధిష్ట సమయం అంటు లేకుండా విద్యుత్ ఇస్తున్నారు.. మార్కెట్ లో దొరికే స్టాటర్లు కేవలం తమ మోటర్ల దగ్గరికెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనవశక్తి విద్యుత్ శక్తి నిరుపయోగం కావడమే కాక కొన్ని సందర్భాలలో కరెంట్ షాక్ కు గురై రైతులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ప్రమాదాలు నివారించడానికే ఈ మొబైల్ స్టాటర్ ను తయారుచేయడం జరిగింది. ఇందుకోసం Mobile Starter చక్కని పరిష్కారం ఒక ఫోన్ మన దగ్గర ఇంకొ ఫోని మోటారుకు అమర్చి ఉంటుంది ఈ మొబైల్ నుండి మోటారుకు అమర్చిన మొబైల్ కు ఒక్క మిసిడ్ కాల్ ఇస్తే ఆటొమాటిగ్ గా ఆన్ అవుతుంది పంట పొలానికి నీరు పారినాక ఇంకొ మిసిడ్ కాల్ ఇస్తే ఆఫ్ అవుతుంది ఇలా ఒక రైతు ప్రపంచంలో ఎక్కడున్నా నీటిని, విద్యుత్ ను సరైన విదంగా వాడుకోవచ్చు.
ఇంతే కాకుండా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల అనే తేడా లేకుండా ప్రతి పాఠశాల నిర్వహించె సైన్స్ ఎగ్జిబిషన్ కెళ్ళి విద్యార్ధులకు అమూల్యమైన సూచనలిస్తు తన ప్రతిభను అందరికి పంచుతుంటాడు
ఇవ్వేమి సాధారణ ఆవిష్కరణలు కావు నేడు భారతదేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇచ్చె ఆవిష్కరణలు.. ఏ ఆర్ధిక ప్రోత్సాహం లేకుండానే ఇంతటి ప్రతిభ బయటకు వస్తే ప్రభుత్వం అన్ని విధాల ఈ పేద సైంటిస్ట్ కు అందిస్తే ప్రపంచాన్నే మన దేశం వైపుకు తిప్పుకునేలా చేయగలడు ఈ మట్టిలో మణిక్యం.