రాత్రి పార్టి లేట్ అయ్యి, ఇంటికి వచ్చే సరికి తెల్లవారు జాము 3 అయ్యింది. కాని 7 గంటల కల్ల మెలకువ వచ్చింది ఆ చేతక్ గాడి చేతక్ బండి సౌండ్ వల్ల. వాడు మా రూం ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటాడు. ఒక 25 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉండాలి నా లాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ, ఆనందంగా ఉండాలి. కాని వాడు పొద్దునే 7 గంటలకి లేచి స్పీడ్ తక్కువ సౌండ్ ఎక్కువ చేసే బండేస్కుని ఆఫిస్ కి వెళ్తాడు. గవర్న్మెంట్ ఎంప్లాయ్ జీతం బాగనే వస్తుంది కదా. సరైన ఉద్యోగం లేని నా లాంటి వాడి దగ్గరే రేస్ బైక్ ఉంది. తను మంచి బైక్ కొనుక్కొవచు కదా ఆ పిసినారి తనం తో మా నిద్రలు చెడగొట్టటానికి కాకపోతే.
రోజు వాడి బైక్ సౌండే మాకు అలార్మ్. రోజు నేను జాగింగ్ చేస్కోవడానికి బయటకి వస్తే ఎదురుగా తన పాత కాలం బైక్ ని తుడుచుకుంటూ కనిపిస్తాడు. మా ఫ్రెండ్స్ అందరికి తనొక టైం పాస్ టాపిక్. ఎదో జోకులు వేసి మాట్లాడుకుంటాం. తన బైక్ ముందే అందరం క్రాస్స్ చేసి వెళ్ళిపోతాం. మరీ అంత పాత కాలం మనిషి లా అందరితో కలవలేక పోతే ఇలా ఎక్కిరించకుండా ఏలా ఉంటాం. ఒక్క మనిషికి ఇంకో మనిషి గురించి కన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏముంటుంది చెప్పండి.
ఇలా పొద్దున జాబ్ ట్రైల్స్, సాయంత్రం ఆ చేతక్ గాడి మీద జోక్స్ తో సాగిపోతోంది లైఫ్. ఒక రోజు నా డ్రీం కంపెనీ నుండి కాల్ లెటెర్ వచ్చింది,చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నా ఫోన్ అలార్మ్ తో పని పడింది, పెట్టుకుని పొద్దునే లేచి బయలుదేరాను. మా రూం నుండి ఆఫీస్ కి వెళ్ళాలంటే, మినిమం 2 గంటలన్న అవుతుంది. ఇంటర్వ్యు కి 9 లోపల చేరుకోవాలి. అందుకని 7 గంటలకే బయలుదేరాను. ప్రతిరోజు లానే తను కూడ తన ముద్దుల చేతక్ బండిని స్టార్ట్ చేసాడు కాని నేను దాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెళ్ళి పోయాను.
ఆల్మోస్ట్ ఇంకో అరగంట లో ఆఫీస్ చేరుకుంటా అనుకునేలోపు బండి పంచర్ అయ్యింది. అరగంట లో చేరుకోక పోతే ఆఫీస్ లోపలికి పంపరు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడి నుండి రావడానికి టైం పడుతుంది, ఓల బుక్ చేసుకునేంత బడ్జెట్ లేదు, లిఫ్ట్ అడిగిన ప్రయోజనం లేకుండా పోయింది... ఆటో వాళ్ళు అక్కడికి వెళ్ళం అని చెప్పారు ఎలా...?. ఇంతలో అక్కడికి చేతక్ గాడు వచ్చాడు,
నన్ను చూసి తన బండి ఆపి "ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్" అని అడిగాడు. "ఇంటర్వ్యు కి వెళ్ళాలి ఇంకో అరగంటే ఉంది" అని చెప్పాను " పదండి నేను డ్రాప్ చేస్తాను" అని అన్నాడు. ఆ చేతక్ మీద వెళ్ళంటే ఇష్టం లేక " వద్దు లేండి మీకెందుకు శ్రమ" అన్నాను. "పర్లేదు లే బ్రదర్ త్వరగానే వెళ్తాం మీరేం టెన్షన్ పడకండి" అని చెప్పాడు. నేను టైం ఎక్కువ లేక వెరే ఆప్షన్ కనపడకా.. ఆ చేతక్ ఎక్కాను.
అస్సలు అనుకోలేదు తను బండి అంత స్పీడ్ గా నడుపుతాడని. నేను అనుకున్న టైం కన్న ముందే ఆఫీస్ కి చేరుకున్నాను. కాని ఒక్క ప్రశ్న అప్పటి నుండి నా మైండ్ పోవట్లేదు, వెంటనే ఆ తన దగ్గరికి వెళ్ళి "బ్రదర్ ఒకటి అడొగొచ్చా? అది అలానే ఉంటే మైండ్ వెరే వాటి మీద వెళ్ళదు" అని అన్నాను. "పర్లేదు అడగండి " అని అన్నాడు.
"మీరు ఈ చేతక్ నే ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు, కొత్త బైక్ కొనుక్కోవచు కదా ఎందుకింకా ఇదే వాడుతున్నారు." అని నా అడిగాను. తన ముఖం లో భావం ఎందుకో మారింది "నేనేమైనా తప్పు గా అడిగానా??" అని అంటే...
"అదేం లేదు 5 ఏళ్ళ క్రితం నేను బైక్ రేసర్ ని ఎలాంటి రోడ్ లో అన్న ఎలాంటి బైక్ నైన చాల సులభంగా డ్రైవ్ చేయగలను. మా నాన్న గవర్న్మెంట్ ఎంప్లాయ్ ఓ రోజు ఆఫిస్ నుండి వస్తూ ఎవరో రాష్ గా డ్రైవ్ చేయడం వల్ల జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయారు.ఆయన లేరని నాకు ఇప్పటికి నమ్మ బుద్ధి వేయట్లేదు.అందుకే ఆయన చనిపొయిన తరువాత వచ్చిన ఈ జాబ్ ని చేసుకుంటూ, ఆయన నడిపిన ఈ బైక్ లో ఆయన్ని చూసుకుంటున్నాను. ఈ బైక్ నాకు మా నాన్న గుర్తు.ఆ తరువతా ఫాస్ట్ గా నడపాలంటే ఏదో తెలీని భయం. చాల రోజుల తరువాత మీ వల్ల ఇలా మళ్ళీ నాలోని రేసర్ బయటకి వచ్చాడు. మిరిదేం మనసులో పెట్టుకోకండి ఆల్ ది బెస్ట్ ఫర్ ద్ ఇంటెర్వ్యు... పక్కనే నా ఆఫీస్ ఎమన్నా అవసరం అయితే కాల్ చేయండి " అని నెంబర్ ఇచ్చాడు.
"పర్లేదు లేండి నా ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టాను థ్యాంక్యు బ్రదర్ " అని చెప్పి ఆఫిస్ లోకి వెళ్ళాను. తను వెళ్ళిపోయాడు.
కాని నా లోపల ఏదో తెలీని అపరాధ భావం మొదలయ్యింది. ఆ భావన వల్ల జాబ్ వచ్చింది అన్న సంతోషం కూడ లేదు. ఒక మనిషి గురించి తెలుసుకోకుండా ఇన్నాళ్ళు తనని ఎక్కిరించాం. చేతక్ గాడు అని జోకులేసుకున్నాం. ఈరోజు తను తెలీనట్టు గా వెళ్ళిపోకుండా లిఫ్ట్ ఇచ్చి చాలా సాయం చేసాడు. మనం చాలా మందిని ఎక్కిరిస్తాం హేళన చేస్తాం కాని వాళ్ళ వెనకున్న కథ, ఆ కథలోని బాధ, ఆ బాధ వల్ల వాళ్ళు ఇలా మారారు అని తెలుసుకున్నాక కూడ.. మనం వాళ్ళని అలానే ట్రీట్ చేస్తే మాత్రం, మనం మనుషులం కానట్టే లెక్క. అందుకే అతని చేతక్ గాడు అని పిలవడం మానెశాను. ఆ మరుసటి రోజు ఒక చిన్న చిరునవ్వు తో తనతో స్నేహం చేయడం ఆరంభించాను.