హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన ఎక్కా యాదగిరి రావు గారు ఆర్ధికంగా మధ్యతరగతిలో, జ్ఞానం పరంగా సంపన్నంగా ఉండే కుటుంబంలో జన్మించారు.. తండ్రి హెడ్ మాస్టార్ ఐనా కూడా జీవితానికి సరైన దారి కనపడని రోజులవ్వి. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తర్వాత బలవంతంగా ఇంజనీరింగ్ కాలేజిలో జాయిన్ ఐనా కాని ఏదో వెలితి.. ఇక ఈ ఇంజనీరింగ్ నా వల్ల కాదు అనే అనుమానం బలపడింది. అప్పుడే ఓ స్వామి వారి ప్రవచనాలు ఒక మార్గాన్ని నిర్దేశించాయి.. "నీకు నచ్చిన రంగంలో నీ లక్ష్యాన్ని వెతుకు" అని చెప్పిన ఆ స్వామి వారి మాటలను అనుసరించి ఇంజనీరింగ్ ను మధ్యలోనే ఆపేసి ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అయ్యారు. మొదట చాలా కష్టపడ్డప్పటికి అందమైన శిల్పాలను చేక్కేంతటి నేర్పు వచ్చిన తర్వాత కూడా వదలలేదు ఆ కష్టాన్ని. అందరిలా అందమైన శిల్పాలను మాత్రమే చెక్కితే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండదని శిల్పాల ద్వారా ప్రజలలో ఒక ఆలోచన పుట్టించే శిల్పాలను సృష్టిస్తున్నారు.. ఇప్పటికి ఆయనది అదే మార్గం.

జ్ఞానపీఠ్ అవార్ఢ్ గ్రహిత సి.నారాయణ రెడ్డి గారు ఎక్కా యాదగిరి గారి గురించి ఇలా అన్నారు "ఎక్కా ఎక్కానంటడు.. ఎక్కుతునే ఉన్నడు.. ఎక్కని అంతస్తులు.. ఏకైక శిల్పి ఎక్కా యాదగిరిరావు" ఇది నిజంగా అక్షర సత్యం. సాదారణంగా ఒక శిల్పి అనే వారు కేవలం ఉన్నది ఉన్నట్టుగానే చెక్కుతారు మహా ఐతే కాస్త అందంగా చెక్కినందుకు ప్రశంసలందుకుంటారు కాని యాదగిరి గారు మాత్రం ఆ శిల్పంలో వేల భావాలను పలికిస్తారు. ఈ విభాగంలో శిల్పాల ద్వారా ఆయన సంఘాన్ని ఛైతన్య పరుచడంలో విశేష ఖ్యాతినందుకున్నారు. పేయింటింగ్స్ లో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటివి శిల్పాలలోకి కూడా ప్రవేశపెట్టి రాష్టంలో, దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా ఎంతో మందిని సంభ్రమాశ్ఛర్యాలకు గురిచేసి అంతర్జాతీయంగా ఎన్నో అవార్ఢులను అందుకున్నారు. ప్రస్తుతం భారత కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం వరించడం ఆయన విశేష ప్రతిభకు సత్కారం.

తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు యాదగిరి గారి కొన్ని ఆలోచన పుట్టించే శిల్పాలు..















Here is an interview where he shared some thoughts about his process.