A Short Poem About Why One Should Never Lose Self Confidence Even In Toughest Times

Updated on
A Short Poem About Why One Should Never Lose Self Confidence Even In Toughest Times

Contributed by Vineeth Alladi

తలవంచకు తలదన్నుతూ తలఎత్తుకు తిరగరా మగ్గుతున్న జ్వలనాన్ని తగ్గకుండ నిలుపురా బుద్ధిబలమే పెట్టుబడిగా చెమటజడినే ఇంధనముగా నడవరా నడిపించరా జీవనయంత్రాన్ని భగభగ భానుడు మండనిదే వెలుగు వెలులోకి వచ్చునా మలమల నీ కలలు రగలనిదే విజయం నిన్ను వరించునా నరుడు వచ్చి నరుకుతాడని తరువు పెరుగుడు ఆపుతుందా బోయవాని బలికి భయపడి పిట్ట ఎగురుడు మానుతుందా ఎగరనిదే పక్షి భువిని విహరించేదెన్నడు పెరగనిదే వృక్షం ప్రాణవాయువునిచ్చునెన్నడు శరత్తులోన తన ఆకులు రాలుతాయని చెట్టు కుంగిపోతుందా కొత్త పూతలు పూస్తాయని వసంతానికై వేచిచూడదా జగత్తులోన ఓటములు చూచావని స్వహత్యకు పాల్పడతావా బతికుండి సాధించి ఆ విధికి నీ సత్తువ చూపుతావా తల్లిపడిన పురిటివేదన నీ జన్మకు ఆదికాగా ఇప్పుడది నీ వంతు అనుభవించు ఆ తిప్పలు గొప్పగా మారుటకు ఆ తల్లికి చూపుటకు అవరోధాలకు తలవంచి ఆత్మవంచన చేసుకోకు ఆటంకాలను పటాపంచలు చేసి నీ సత్తా చాటుకొనుము ప్రపంచమే ఆగినా నీ పయనాన్ని ఆపకు సాగించు సాగించు అన్నిటినీ అధిగమించి సాధించు జీవితమనే కురుక్షేత్రంలో నీవే కృష్ణుడవు నీవే అర్జునుడవు స్వాభిమానం స్వయంకృషి ఆత్మవిశ్వాసం పెంచుకో గెలుపు నీ దరికి చేర్చుకో