12 Self Defense Techniques & Security Tips From International Karate Champion Ramya Garu

Updated on
12 Self Defense Techniques & Security Tips From International Karate Champion Ramya Garu

ప్రియాంక రెడ్డి గారి సజీవ దహనం గాయం పచ్చిగా ఉండగానే, శంషాబాద్ లో మరొక దాడి. ఇవి కేవలం ఈ రెండు మూడు రోజుల్లోనే కాదు ప్రతిరోజూ ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి.. ప్రతిరోజూ ఈవ్ టీజింగ్ కేసులు, మిస్సింగ్ కేసులు, రేపులు, గృహహింస కేసులు, వేధింపులు, కాస్టింగ్ కౌచ్ లు ఇంకా చెప్పుకుంటే ప్రతి రంగంలోనూ మహిళా బాధితుల సంఖ్య అత్యధికం. కాలేజీలో ఎవరో ఒకరు లవ్ ప్రపోజ్ చేస్తే బుద్దిగా చదువుకుంటున్న అమ్మాయికి బలవంతంగా పెళ్లిచేస్తున్నారు. లక్షల కట్నం ఇచ్చి మరో ఇంటికి వెళ్ళినప్పుడు భర్త పెట్టె టార్చర్ ఇంట్లో చెబితే "సర్దుకు పోవాలమ్మా" అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట ఉద్యోగాల కోసం వెళ్లినా అక్కడ రెజ్యూమె బాగుండడంతో పాటు మరొకటి ఆ మహిళ నుండి expect చేస్తున్నారు. ఇన్ని చట్టాలు, ఇంత సెక్యూరిటీలు, కాల్ చేసిన వెంటనే పోలీసులు వస్తున్నారని తెలిసిన ప్రతిరోజు ఇన్ని అత్యాచారాలు, గృహహింస, వేధింపులు, దాడులు సర్వ సాధారణంగానే జరుగుతున్నాయి. అరె! పుట్టినదగ్గరి నుండి చనిపోయేంత వరకు మహిళలపై ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయంటే సమాజంతో పాటుగా మహిళలు కూడా మరాల్సిన అవసరం ఉంది. ఏదైనా అఘాయిత్యం జరిగితే భయంతో ఇంటికో, పోలీస్ స్టేషన్ కో కాల్ చెయ్యడంతో పాటు తనని తాను రక్షించుకోగల మార్గం కూడా తనకు తెలిసి ఉండాలి. స్కూల్ కు వెళ్లే పిల్లలకు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, హోమ్ మేకర్లకు, జాబ్ చేసే ఎంప్లాయిస్ కు ప్రస్తుతం సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వారి ఆత్మవిశ్వాసం పరంగా, అలాగే వారి కుటుంబ సభ్యులపై మానసికంగా ఎలాంటి భరోసా లభిస్తుంది.? దాని నుండి మనం పైన చెప్పిన సమస్యల నుండి మహిళను ఎలా రక్షించగలుగుతాము.? అనే విలువైన టాపిక్ తో పాటుగా 12 సెల్ఫ్ సెక్యూరిటీ టిప్స్ లను The Stage వేదిక మీద ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ రమ్య గారు తన అభిప్రాయాలను మనతో పంచుకున్నారు.