ప్రతిరోజు చూస్తుంటాం రోడ్డు పక్కన గాని, బస్టాండ్ లో గాని, ఇంకెక్కడైనా గాని... వాళ్ళు ఎవరో పరిచయం లేని వ్యక్తుల కోసం తమ సర్వస్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు... తన వాళ్ళ ఆకలి తీర్చడానికి విటుల ఆకలి తీర్చి తన కన్నీటి వరదగోదారీని ఆపుకుంటూ విటులకు ఆనంద చెమటను అందిస్తుంది. చాలమంది అనుకుంటారు సెక్స్ వర్కర్లను Easy గా గుర్తుపట్టొచ్చు ఎందుకంటే వాళ్ళు వేసుకునె Over Makeup వాళ్ళ, ఇంకా వాళ్ళ హావభావాలను చూస్తే తేలికగా గుర్తుపట్టొచ్చు అని... కాని వాళ్ళు ఒక భయంతో అలా ఓవర్ గా మేకప్ వేసుకుంటారు. తనని Select చేసుకుంటారో లేదో అని వాళ్ళ భయం... ఆ భయంతోనే మిగిలిన వారి కన్నా ఎక్కువ అందంగా కనపడాలనె ఆశతో అలా.
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న Example...
వాళ్ళున్న Place లో మన ఇంట్లోని ఆడవాళ్లు ఉండేదుంటే ?? ఆ ఊహ కూడ మన గుండె తట్టుకోలేదు. పోని ఒక Male Prostitute గా మనమే ఉన్నామనుకోండి Financial గా చాల Down stage లో ఉండి ఆ వృత్తి చేయాల్సి వచ్చి రోడ్డు పక్కన నిలబడ్డాము ...
మనతో చదువుకున్న మన స్నేహితులు చూస్తే ...?
మన ఫ్యామిలి చుట్టాలు అలా మనల్ని చూస్తే ...?
మన ఇంటి దగ్గర చుట్టు పక్కల వారు చూసి భాదపడితే ...? మన పరిస్థితి ఏంటి ?
ఒక మగాడిగా మనకే అంత భాద ఉంటే "శీలాన్ని దైవంలా భావించె ఆడవారికి ఎలా ఉండాలి"...!
కోట్ల భారతీయులంటారు మా తల్లి భారతమాత అని... భారతదేశాన్ని ఒక ఆడదానిలా, ఒక అమ్మలా, ఒక దేవత లా పోలుస్తారు .. భారత్ మాతాకి జై, అంటూ కికెట్ లొ గెలిచినప్పుడు గొంతు చించుకుంటారు... కనపడని దేవతకిచ్చే గౌరవం కనిపించె దేశం లోని ఆడవారికి ఇవ్వరు చాలా మంది!!!! ఏ సెక్స్ వర్కర్ కూడ తను పుట్టుకతోనే నేను ఇలాంటి వృత్తిని ఎంచుకుంటాను అని కోరుకోదు.. కనీసం తన కూతురు ఐనా అలా కాకుడదు అనే అనుకుంటుంది. కాని వాళ్ళని తయారు చేస్తున్నది ఎవరు? ఈ సమాజమే, మనమే... మనమే అలాంటి పరిస్తితులను కల్పించి చివరికి మనమే తిడుతున్నాము, ఈసడించుకుంటున్నాము..! ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కొత్తగా వ్యభిచారి వృత్తిలోకి వస్తున్న వారిలో 60% మంది 12నుండి16 మధ్య Age ఉన్న పిల్లలున్నారంటే వాళ్ళని ఆ రొంపిలోకి దింపుతున్న వారి నుండి ఒత్తిడి ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవత" ఎక్కడైతే ఆడవారు గౌరవించ బడతారో అక్కడ దేవతలుంటారంట... ప్రపంచానికి అసలయిన ధర్మాన్ని నేర్పుతున్న మన భారతదేశంలో ఇలాంటి నీచ సంస్కృతి ఉండటం దారుణం.
ఇప్పుడు సెక్స్ వర్కర్ లకు కావల్సింది ఓదార్పు కాదు పని... పని కల్పించండి. చైనా లాంటి దేశంలో మెమోరికార్డు, మొబైల్స్ కి సంబందించిన కొన్ని పరికరాలను ఇంట్లోనె ఒక చిన్న కుటీర పరిశ్రమలా తయారు చేస్తున్నారు... అలా మన దగ్గరున్న Human Resource ఉపయోగించుకొని Production ని పెంచండి.... ఒక్క రోజుకి 40,50 మంది రాక్షసులతో గడుపుతున్న ఆ ఆడవారి శక్తి భూదేవి ఓర్పు... అది చాల గొప్పది వాళ్ళను ఆ వృత్తి నుండి బయటపడేయండి... దయచేసి రాజకీయ నాయకులు.. నీకు అవ్వి ఉచితంగా ఇస్తా ఇవ్వి ఉచితంగా ఇస్తా అనే ముందు సెక్స్ వర్కర్ లు లేని సమాజం ఇవ్వండి..!
Wouldn't The World be A better Place Had we Treated all the Women Like our Mother India?!
