Checkout This Amazing Story Of "Sculptor Bhuvaneshwari" Who's Now A Prominent Face In Our Telugu States!

Updated on
Checkout This Amazing Story Of "Sculptor Bhuvaneshwari" Who's Now A Prominent Face In Our Telugu States!

"వినియోగదారుల కోసం మనం వెళ్ళడం కాదు, మన శిల్పాల కోసం వెతుక్కుంటూ వారే మన దగ్గరికి రావాలి" ఈ సూత్రాన్నే బలంగా నమ్మి, లక్ష్యంగా నిర్ధేశించుకుని శిల్పాలు తయారు చేయడం, అమ్మడం మొదలు పెట్టారు భువనేశ్వరి గారు. కట్ చేస్తే పాతిక సంవత్సరాల వయసులోనే గొప్ప శిల్పిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

భువనేశ్వరి గారు బీఈడి పూర్తి కాగానే మంచి సంబంధం అని చెప్పి బెంగుళూరులో ఉంటున్న వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. బెంగుళూరులో భర్త ఓ చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. "అది ఎంత నిజమైన ప్రేమ కానివ్వండి, అన్ని విషయాలు నిశితంగా పరిశీలించుకున్నా సరే పెళ్ళైన కొన్ని రోజులకు భార్య భర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయి". భువనేశ్వరి గారి జీవితంలో కూడా అంతే జరిగింది. ఈ గొడవలలోనే తను గర్భవతి కావడం, ప్రసవానికి పుట్టింటికి వెళ్ళడం, బాబుకు జన్మనివ్వడం జరిగిపోయాయి, ఐనా గాని భర్త తనని చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు.

ఒక పక్క భర్త ప్రేమను పొందలేక పోవడం మరోపక్క అమ్మ నాన్నలకు భారం అవ్వడంతో మానసికంగా కృంగిపోవడం మొదలయ్యింది. "మనకు నిజమైన శక్తి కష్టంతో పాటు వస్తుంది" అని అన్నట్టు అప్పుడే నాన్న అద్భుతంగా తయారుచేస్తున్న శిల్పాలనే మంచి మార్కెటింగ్ ప్లానింగ్ తో ఎందుకు అమ్మకూడదు అనే ఆలోచన వచ్చేసింది. కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన భువనేశ్వరి గారి నాన్న, తాత గొప్ప శిల్పులు. శ్రీశైలంలోని భ్రమరాంబిక మండపం, మహానందిలోని అద్దాల మండపం వారి తాతయ్యే నిర్మించారు. నాన్న కూడా ఎన్నో దేవాలయాలకు ప్రతిమలు, శిల్పాలు అందిచారు. వారసుడు అంటే కొడుకు మాత్రమే కాదు కూతురు కూడా, భువనేశ్వరి గారు శిల్పాలు చెక్కడం నేర్చుకుని తనదైన శైళిలో ప్రణాళికలు రుపోందించుకున్నారు.

మార్కెటింగ్ స్ట్రాటజి: "ఏదైనా వాడడం మాత్రమే కాదు దానిని ఉపయోగించుకుకోవడం కూడా తెలిసుండాలి". శిల్పాలు అమ్మడానికి ఫేస్ బుక్ నే వేదికగా చేసుకున్నారు. "Stone Statues" తో ఒక పేజ్ ను క్రియేట్ చేసి తాను చెక్కిన శిల్పాలను పోస్ట్ చేసేవారు. కట్ చేస్తే పెద్ద సక్సెస్.

కలెక్టర్లు, మంత్రులు కూడా: శారాద శిల్ప మందిరానికి సామన్యులు మాత్రమే కాదు ప్రజా ప్రతినిధులు కూడా వినియోగదారులున్నారు. ఫేస్ బుక్ పేజ్ లో శిల్పాలు చూసిన ఐ.ఏ.ఎస్ అధికారిని చందనాఖన్ గారు ప్రత్యేకంగా పిలిచి ప్రభుత్వం తరుపున కొన్ని అర్ఢర్లు ఇచ్చారు. మన భారతదేశం నుండే కాదు మారిషస్, దుబాయ్, అమెరికా నుండి కూడా తనకు వినియోగదారులున్నారు. వృత్తి పరంగా మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలోను తన ఆనందాన్ని తిరిగి పొందారు.