సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదండి యూట్యూబ్ లో కూడా పరమ రొటీన్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువై పోయాయి. అలా బోరింగ్ షార్ట్ ఫిల్మ్స్ చూసి చూసి విసుగు చెందిన వారికి ఎల్.బి. శ్రీరాం గారి హార్ట్ ఫిల్మ్స్ బాగా నచ్చుతాయి. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ తో, పకడ్బంది స్కీన్ ప్లే తో, జీవిత సారంశాన్ని తెలిపే మాటలతో ఈ ఫిల్మ్స్ మన హృదయానికి హత్తుకుంటాయి. ఈ హార్ట్ ఫిల్మ్స్ అన్ని 10నిమిషాలలోపే ఉంటాయి కాని మన జీవితానికి అవసరమయ్యే ఎన్నో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక మంచి పుస్తకంలో కేవలం ఒకే ఒక్క పేజీతో ఉన్న కథలను చదివినట్టుగా ఉంటుంది ఎల్.బి శ్రీరామ్ గారి హార్ట్ ఫిల్మ్స్.
1. మా నాన్న: ఉగాది పచ్చడికి-'ఆరు రుచులు' అని మనకి తెలుసు! నాన్నకి-'రెండు రుచులే' తెలుసు! నీకు తినిపించే- 'తీపి' ; తను మింగే- 'చేదు' !!
2. గంగిరెద్దు: నన్ను నమ్ముకుని నువ్వు ఉన్నావు.. నిన్ను నమ్ముకుని నేను ఉన్నాను!! ఇద్దరం.. ఒక 'కళ' ని నమ్ముకుని ఉన్నాం!! ' ఆ కళ '' బాగుంటేనేరా బసవా అందరం కళకళలాడుతూ ఉంటాం!!
3. పండగ: 'పాడీ పంటా' లేకపోవచ్చు.. 'పేడతో' కూడా 'పండగ' చేసుకోవచ్చు .
4. నర్స్: రోగి 'శరీరానికే' కాదు-! 'మనసుకీ' సేవలందిస్తుంది..
5. దేవుడు: తనని ఎవరు ఎలా నమ్ముతున్నారో-- అందర్నీ ఓ కంట కనిపెడ్తూనే ఉన్నాడు-- 'దే-వు-డు'!
6. ఉమ్మడి కుటుంబం: ఇవేల్టి ఈ 'గజిబిజి బిజీ ప్రపంచం'లో బతకడం మన నేరం కాదు! కాని, అన్నీ తెలిసిన మనలో చాలామంది- ఆ పరుగు పందెంలో పడి- 'మకరందం'లేని ప్లాస్టిక్ పువ్వుల్లా- 'ఆనందం' లేని యాంత్రిక జీవితాల్ని గడిపెస్తూండడం మాత్రం మన దురదృష్ఠమే! జీవితంలో 'అటెన్షన్' ఉండాలి తప్ప- 'టెన్షన్' ఉండకూడదు!! "ఆప్యాయతలు-అనుబంధాలూ ఆనాటి పల్లెటూళ్ళలోనే కాదు.. ఈనాటి పట్టణాలలో ఇంకా ఎక్కువగా పెంచుకుని, పంచుకోచ్చు" అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే- ఈ 'ఉమ్మడి కుటుంబం'!
7. ప్రసాదం: ఇక్కడ ప్రసాదం అంటే పుస్తకం.
8. జీవితాన్ని మరల కొత్తగా ప్రయత్నించడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందా.?
9. సామాన్యుడు కూడా మహానుబావుడే..
10. యువత చుట్టూ కమ్ముకున్న అంధకారాన్ని ఛేదించడానికి- ఇంకా ఉదయిస్తూనే ఉన్న సూర్యభగవానుడిలాంటి ఉత్తమ గురుదేవుఁళ్ళు ఎందరో ఉన్నారు!!
11. రావయ్య తండ్రీ...!! నువు రామయ్య తండ్రీ...!! మల్ట్రి లోకి ఎల్తనాడు మా రామయ్య తండ్రీ...!!!