లొకేషన్ - యూసుఫ్ గూడా లో మూడోఅంతస్థులో ఉన్న పెంట్ హౌస్ బావా.. రేయ్ బావా లేరా,లెగు బావా, ఏంటి బే ????? బావా మొన్న రాసావ్ కదా బ్యాంక్ ది ఎగ్జాం,దాని రిసల్ట్ ఓచిందిరా,అది అదీ ………. నసదొబ్బకుండా చెప్పేహే ……. అదేరా బావా, నువ్వు సెలెక్ట్ అవల్లేదు,నువ్వేం ఫీల్ అవ్వకురా,నీకున్న knowledge కి దీని బాబు లాంటి జాబ్ ఒస్తది,నీ మీద నాకు నమ్మకం ఉంది బావా,ఇంత టైం పడుతుంది అంటే ఎదో గొప్పదే కొడతావ్ బావ నువ్వు,నేను చెప్తున్నా రా ఎదో ఓరోజు పీక్ పోసిషన్ లో ఉంటావ్ రా,బావా…. నాకు టైం అవుతుంది, క్యాబ్ కూడా వచ్చేసింది ,నేను వెళ్తున్నా, నువ్ ఫ్రెష్ అయ్యి తినేసి చదుకోరా,బావా……..,రాత్రి రైస్ పెట్టకు నాకు,నేను తినేసి వస్తా,లేట్ అవుతది....
ఈ పాటికే మీకో క్లారిటీ వచ్చేవుంటుంది కదా,కానీ మీరు నా మీద ఒక కంక్లూషన్ కి రాకముందు నా గురించి కొంచెం చెప్పాలి,నేనో సీనియర్ మోస్ట్ నిరుద్యోగిని, ఇంట్రెస్ట్ లేని ఇంజనీరింగ్ పూర్తిచేశాక,ఎంతో ఇష్టం తో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా,ఇప్పటికి 3 ఆట్టెంప్ట్స్ ఇచ్చా,రెండుసార్లు ప్ప్రిలిమ్స్ లో,ఓసారి మెయిన్స్ దాకా వెళ్లి ఫెయిల్ అయ్యాను. Software లో ఇంట్రస్ట్ లేక ఏ కోర్స్ నేర్చుకోలేదు,చదివిన కోర్ సైడ్ లో అసలు బేసిక్ ఐడియా కూడా లేదని అటు చూడడం కూడా మానేశా.కొడితే సివిల్స్ కొట్టేయాలని తెగ చదివేసా,కానీ క్లియర్ అవ్వలేదు,వొచ్చిన ఏ competitive exam వదలలేదు,ఇంటర్వ్యూ దాకా వెళ్లినా మళ్ళీ స్టోరీ మొదటికే వచ్చేది,బి.టెక్ పూర్తయ్యి నాలుగేళ్లయింది,ఒక్క పైసా సంపాదన లేదు,ఒక్క ఉద్యోగం లేదు,ఇది నా బ్రీఫ్ ఇంట్రో లొకేషన్ -బాత్రూం లో-- షవర్ కింద నిలబడి రాత్రి చదివిన MN Roy and Humanism కాన్సెప్ట్ ని నాతో నేనే డిస్కస్ చేసుకుంటూ రాలిపోతున్న నా వెంట్రుకలని చూస్తూ,దీనమ్మా,అన్నీ పోతున్నాయి,నా దరిద్రం తప్ప అని నన్ను,నా జీవితాన్ని తిట్టుకుంటూ ఉంటుంటే, ఎప్పుడూ కోమా లో ఉన్న పేషెంట్ లా ఉండే నా మొబైల్,అంబులెన్సు సైరెన్ లా అరవడం మొదలెట్టింది,నాకెవడ్రా కాల్ చేసేది అని పట్టించుకోలా,స్నానం అయ్యాక చూస్తే,12 మిస్డ్ కాల్స్,ఎదో కొత్త నెంబర్,ఎవడో రాంగ్ నెంబర్ అయ్యుంటాడు అని పక్కన పడేస్తుంటే,మళ్ళీ కాల్ వచ్చింది,కాల్ అటెండ్ చేశా
హలో హలో,శ్రీరామ్ ,నేనయ్య సంజయ్ సర్ ని, సంజయ్ సర్ ఆ అవునయ్యా, కాలేజీ లో మీ HOD ని Sorry Sir,Good Morning Sir ,అదే,Good Afternoon Sir ఎలా ఉన్నావయ్యా,చాలా కాలం అయిన్ది మాట్లాడి, ఎదో ఉన్నాను సర్ నువ్వొక పని చేయాలయ్యా నాకు ఏంటి సర్??? మన కాలేజీ లో ఫెస్ట్ ఉంది,నువ్వు కూడా ఒక గెస్ట్ వి,ఒక మంచి స్పీచ్ ఇవ్వాలయ్యా నువ్వు సార్,మీరు అనుకున్నంత లేదు సర్,ఆ రోజులన్నీ అప్పుడే అయిపోయాయి,ఇప్పుడు నేనో పెద్ద ఫెయిల్యూర్ ని ,నేను గెస్ట్ ఏంటి,నేను స్పీచ్ ఏంటి సర్ అవన్నీ నాకు తెలీదు రామ్,నువ్ ఒస్తున్నావ్,స్పీచ్ ఇస్తున్నావ్,,డీటెయిల్స్ అన్నీ నీకు మెయిల్ చేశా, రేపే ప్రోగ్రామ్,ఉదయం 11 కి నువ్వు నా ఎదురుగా ఉండాలి,ఇక నీ ఇష్టం ,ఇది ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో,ఎమన్నా అనుకో,నా మీద నీకు గౌరవం ఉంటె నువ్ వొస్తావ్ అంతే
నేనేంటి,కాలేజీ కి గెస్ట్ ఏంటి అని మీరే కాదు,నేను కూడా షాక్ లోనే ఉన్నా అంటే నేను గుర్తుపెట్టుకునేంత గొప్పోడ్ని కాదు,మర్చిపోయేంత మామూలోడ్ని కాదు ఇప్పుడంటే నేనో బేవార్స్ గాడ్ని కానీ,అప్పట్లో కాలేజీలో తోపు ,ఫస్ట్ బెంచ్ లో ఉండే బాక్బెంచెర్ ని,కల్చరల్ టు టెక్నికల్,సోషల్ ఆక్టివిటీస్ టు స్పోర్ట్స్ ఏవైనా మనమే ఫస్ట్, ఇలా అన్నీ కలిపికుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఆపేశాం,అప్పట్లో కిరీటం లేని రాజుని లెండి,అయినా,ఎప్పుడో అయిపోయిన టోర్నీ కి ఇప్పుడు ప్లేయర్ అఫ్ ది టోర్నీ అవార్డు లాగ ఇదేంటి.. ..ఇదేమి కొత్త తలనొప్పిరా దేవుడా,అని అనుకుంటున్నా,అసలు ఎవరికీ కనపడకుండా,ఎదో నా ఏడుపు నేను ఏడుస్తుంటే,ఈయనెంట్ర ఇలా కాలేజీ కి రమ్మంటున్నాడు, అదీ నాలుగేళ్ల తరువాత,ఎదో మూడిందిరో నాకు .అని అదే టెన్షన్ లో ఉన్నా………….
లొకేషన్ - కాలేజీ ఆడిటోరియం ఒకప్పుడు నా అడ్డా ఇది,ఏ ప్రోగ్రామ్ అయినా, Organizing, Anchoring, ఇలా All in All మనమే, ఇప్పుడు ఈ హాల్ లో నేనొక గెస్ట్ ని,నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది,ఎవరైనా ఎం చేస్తున్నావ్ అని అడిగితే ఎం చెప్పాలా అని, రావయ్యా శ్రీరామ్,నీకోసమే ఎదురుచూస్తున్నా,రా,రా
ఏంటి సర్,నా మీద ఇంత కోపమా,ఎందుకు సర్ నన్ను రమ్మన్నారు,నన్నొదిలేయండి సర్ అవన్నీ కాదయ్యా,మనోళ్ళకి మాంచి Motivation ఇవ్వాలి,నువ్వే కరెక్ట్ ,అందుకే,రమ్మన్నా సర్,నాకే దిక్కులేదు,నేనేం ఇస్తా సర్,నా వాళ్ళ కాదు సర్
అదిగో,చైర్మన్,ప్రిన్సిపాల్ సర్ వోచారు,రా వెళదాం After Speeches of Chairman and Principal Now I request our Special Guest Sri Ram on to the dais and deliver his speech..
“Very Good Morning to every one,Am sure u people don’t know me,but this Hall,This college and the faculty were almost my family for 4 years,Let me Introduce myself, I Am Sri Ram, నేను చెప్పేది మీ Academics కి కానీ,మీ Technical Subjects కి కానీ ఏ మాత్రం పనికిరాదు, But మీ జీవితానికి ఎంతో కొంత పనికొస్తుంది
నేనేమి Achieve చేసి ఇక్కడికి రాలేదు,నేను Successful Person ని కాదు,Atleast ఒక JobHolder కూడా కాదు ,ఒక Failure ని ,Failure in all Aspects..ఒక Sucessful Failure ni, ఎందుకంటే ఎవరూ,ఎప్పుడూ నేర్పనిది ఓటమి నాకు నేర్పింది అయినా గెలిచే గెలుపుకి ఏం తెలుసు ఓటమి ఇచ్చే కసి,ఓటమిలోనే ఉంది అంతా, నువ్వెవరో,నీకెవరో చెప్పేది ఓటమే,మన తప్పులు మనకి తెలిసేలా చేసేది,సరిదిద్దుకునే తెలివిని ఇచ్చేది ఓటమే,నేనిప్పుడు అలాంటి కసి తోనే ఉన్నా నాకే కాదు ఓడిపోయినా ప్రతీ వాడు అలానే ఉంటాడు,రేపు మీరు కూడా ఇంతే, ఎందుకంటే అమావాస్య చూడని చ౦ద్రుడు లేడు,గ్రహణ౦ పట్టని సూర్యుడు లేడు
ఒక్కటి చెప్తా వినండి ..జీవిత౦ ఎవరికీ వడ్డి౦చిన విస్తరి కాదు.పుట్టిన ప్రతీ శిశువు ఒక సైనికుడే, పుట్టిన మరు క్షణ౦ ను౦డి యుద్ద౦ చేయాల్సి౦దే.నా వల్ల కాదు అని అనుకొకూడదు .కథల్లోనో ,గాదల్లొనొ,చరిత్ర లొనో ఎక్కడో వీరుల గురి౦చి చదవడ౦ కాదు,నీకు నువ్వే ఒక వీరుడి లా మారు.ఒక గమ్యం అ౦టూ ఒకటి పెట్టుకొని,దానికొసమే పొరాడు,ఒక్కసారికే గెలవక పొవొచ్చు,పర్లెదు,ప్రయత్ని౦చు,కి౦ద పడ్డావా?? మళ్ళీ పైకి లే..దెబ్బలు తగలనీ,రక్త౦ కారనీ,ఎముకలు విరగనీ,…ప్రాణ౦ ఉ౦ది గా..లొపల కసి ఉ౦ది గా...సాది౦చాలనే కొరిక బల౦గా ఉ౦ది కదా,,చాలు,నాకు రాసి పెట్టి లేదు పొనీ అని సర్దుకుపొకు,నా రాత ఇ౦తే అని మెట్ట వేదా౦త౦ మాట్లాడకు.పాకుతూ ఉన్నప్పుడు నువ్వు ఊహి౦చావా పరిగెడతానని,ఇక్కడే ఉ౦టే ఇలానే మిగిలిపొతావు చదలు పట్టి పొతావు. కదులు అడుగు ము౦దుకు వెయ్యి,చరిత్ర లొ వెలిగిపొతావు.అగాదాలు,అవరొదాలు,అన్ని దాటు.నేను ఇ౦త దూర౦ వచ్చి౦ది ఈ ఓటమిని చూడడానికి కాదు అని నిశ్చయి౦చుకొ,నా కథ ముగియాల్సి౦ది ఇలా కాదు అని నిర్ణయి౦చుకొ.నీ చుట్టూ ఉన్న అ౦దకారాన్ని నీ గు౦డెల్లొని జ్వాలతొ మాయ౦చెసెయ్,ఎప్పుడు సమస్యలు చెప్పి రావు,బాదలు ఇ౦త కాలమే ఉ౦టాను అనే టై౦ బా౦డ్ ఉ౦డవు,ఎదుర్కొడానికి సిద్ద౦గా ఉ౦డు.నీకు వొచ్చె ప్రతీ కష్టం పరీక్ష మాత్రమే,శిక్ష కాదు..ఏటికి ఎదురీదడానికి కావల్సిన దైర్యాన్ని కూడబెట్టుకొ..నీ ఎదలొ ఉన్న లక్ష్యాన్ని మాత్ర౦ చేరుకొ.అప్పుడే సైనికుడిలా పుట్టిన నువ్వు వీరుడి లా మారతావు..అలా జరిగినప్పుడే నీ జన్మకి సార్దకత
చివరగా ఒక్క మాట పట్టాభిషేకానికి ము౦దు అరణ్యవాస౦,అజ్ఞాతవాస౦ తప్పదు నీకు లేనిది కావాలి అని కోరుకున్నప్పుడు,నీకున్నది వదులుకునే ధైర్యం ఉండాలి” ఒక్కసారిగా హల్ అంతా చప్పట్లు, అసలు నేనేం మాట్లాడానో నాకే తెలీలేదు,ఎప్పటినుండో గుండెలో ఉన్న కసి, భాద బయటకి మాటల రూపం లో ఒచ్చేసిందా అనిపించింది,నాకు నేను కొత్తగా కనిపించా, అసలు ఇలా ఎలా మాట్లాడనురా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటుంటే ఇందుకేనయ్యా నిన్ను బలవంతం చేసి రమ్మన్నా ఇలాంటివి ఫాకల్టీ చెప్తే ఎక్కవు, నువ్ మాట్లాడుతుంటే నాకే ఎదో ఉత్సాహం వచేసింది,బాగా మాట్లాడావ్ అబ్బాయ్… థాంక్స్ శ్రీరామ్ …పద ఓసారి నా కేబిన్ కి వెళ్దాం కేబిన్ కి వెళ్తుంటే,ఎవరో వచ్చి,చైర్మన్ గారు రమ్మన్నారు అని తీసుకెళ్లారు, నన్ను సంజయ్ సర్ ని
లొకేషన్ - చైర్మన్ రూమ్ చాలా బాగా మాట్లాడావ్ శ్రీరామ్, If you don’t have an Objection,I want to you to be counsellor for Students in all our College Branches. We Need People like you to make students determined to their Goals. We Need Your Service I mean, శాలరీకూడా ఉంటుంది, నీకు ఓకే కదా....?
నిన్నటి దాకా నన్ను,నా తలరాతని తిట్టుకుంటానే ఉండేవాడిని,నేను ఇలా ఉన్నందుకు,కానీ అదంతా నా ఆలోచనల వల్ల అని నాకర్ధం అయింది, ప్రతీ మనిషిలో, Positive, Negative Thoughts ఉంటాయి, మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే మనకి Reflect అవుతుంది, నేను నిన్నటి దాకా నెగటివిటీ తోనే ఉండేవాడిని,ఇవాళ బాగా మాట్లాడాలి అని పాజిటివ్ థాట్ తో మనసులో ఉన్నది మాట్లాడాను,మోటివేషన్ ఇవ్వమని నన్ను పిలిస్తే,నాకే మోటివేషన్ దొరికింది,నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా. ఏదేమైనా నేను అనుకున్నది సాదించగలననే ధైర్యం నాకొచ్చింది ఇదే కావొచ్చు యద్భావం తద్భవతీ అంటే.... Your Life is What your Thoughts are!