"మనసులో నీవైనా భావాలే బయటక నిపిస్తాయి దృశ్యాలై.." అన్నారు సిరివెన్నెల గారు. సాధారణ వ్యక్తి భావాల కన్నా ఓ ఆర్టిస్ట్ మనసులోని భావాలు బయటపడడం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే వారి భావాలను వారి ఆర్ట్ ద్వారా తెలుపుతారు కనుక. ఒక వస్తువును తీసి పక్కకు జరుపడం కొన్ని సెకండ్ల పని, కాని అదే వస్తువును తయారుచేయడమంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే ఆర్టిస్టులకు మన సమాజం ఓ ప్రత్యేక గుర్తింపునిస్తారు. ఆ ఆర్టిస్ట్ కుటుంబానికి చెందిన మరో కుటుంబ సభ్యురాలే మన సింధు. తన ఆర్టిస్ట్ కుటుంబ సభ్యులలా రొటీన్ గా సరిగ్గా వారు చేసేదే చేస్తే తన శ్రమ, ఇష్టం, టాలెంట్ బయటపడదు అని ఇలా మొదటిసారి చిన్ని వస్తువులను సృష్టిస్తున్నారు.
సింధు చిన్నతనం నుండి Madhubani Paintings వేసేవారు. ఆ పేయింటింగ్ లోనే తను ఆనందం, రిఫ్రెష్మెంట్ పొందేవారు. ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కాని తనలో దాగున్న ఆ ప్రత్యేకతను వదలలేదు.. ఇంకా మరింత సానబెట్టారు కూడా. ఈ మధ్య చాలామంది పెన్సిళ్ళ ద్వారా, చాక్ పీస్ ల ద్వారా మినియేచర్ లను తయారుచేస్తున్నారు.. అది సింధును ఎంతగానో ఆకట్టుకున్నది. చిన్ని చిన్ని వస్తువులను క్లే ద్వారా తయారుచేయాలని భావించి వాటికి సంబంధించిన రీసెర్చ్ వర్క్, ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. "ఈ స్టైల్ ఆఫ్ ఆర్ట్" తనకు ఎంతో ఇష్టం కనుక కేవలం రెండు నెలలలోనే నేర్చుకుని రిక్వెస్ట్ ల మేరకు మిత్రులకూ అందజేస్తున్నారు. "Mini surprise"(facebook.com/Minisurprise01/) ద్వారా మరింత మందికి తన టాలెంట్ ను చేరువ చేస్తున్నారు. ఇందులో వాడే కలర్స్ మిక్సింగ్ లోనూ ఎంతో నైపుణ్యత దాగి ఉండడంతో ఇవన్నీ జీవం ఉన్న వాటిలా భావాలు వ్యక్తీకరిస్తూ దర్శనమిస్తాయి.
"చూడగానే తినాలనిపిస్తుందంటే అది సింధులోని ప్రత్యేక ప్రతిభకు నిదర్శనం"
1. వీటిని సృష్టించేది నేనే, బ్రాండ్ అంబాసిడర్ ని కూడా నేనే.!
2. చూడడానికే చిన్నగా ఉంది.. ఇంకా మళ్ళి కట్ చేయడమెందుకో..
3. ఇంత చిన్న Ice Creamను అంత పద్దతిగా ఎవరు కొరికారబ్బా.?
4. ఓ పది కాఫీ చుక్కలతోనే నిండి పోతుందనుకుంటా..
5. Handle with Care
6. Pizza Hut వాళ్ళు తయారుచేయాలంటే వారం పట్టుద్ది.!!
7. ఆహా..
8. కొంత టైట్ చెప్పులు వేసుకోవచ్చు కాని మరీ ఇంత టైట్ హా..
9. ఆ!! వేడి వేడి పిజ్జా, చికెన్, నూడుల్స్..
10. ఈ కోడి కూడా చిన్ని గుడ్డులోంచే వచ్చి ఉంటుంది..
11. ఇవన్నీ నాకే.. ఎవ్వరికి ఇచ్చేది లేదు..
12. రెండు వేళ్ళ మధ్య జాగ్రత్తగా పట్టుకొని తినాలి.
13. ఈ చెప్పులు వేసుకొనే ఆ అందమైన పాదాలను చూడాలని ఉంది.
14. స్పూన్ కూడా ఉంటే బాగుండేది.
15. వీటి చెట్లు ఎలా ఉంటాయబ్బా..