సింగర్ గా కల్పన గారు మన తెలుగులో దాదాపు 400 పాటలు పాడినా గాని కొన్ని సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ వల్ల మనకు మరింత దగ్గరయ్యారు. ఐదు సంవత్సరాల వయసులో నుండే పాడడం మొదలుపెట్టిన కల్పన గారు అప్పటి నుండే స్టేజ్ మీద అలవోకగా పాడడంలో రాటుదేలిపోయారు. చిన్నతనం నుండే డబ్బింగ్ చెప్పడం, బాలనటిగా కొన్ని సినిమాలలో నటించారు కూడా. తన నాన్న గారు టీ.యస్ రాఘవేందర్ గారు తమిళనాడులో మంచి మ్యూజిక్ డైరెక్టర్. "పాట ఏదైనా గాని, పాటకు సంబందించిన సీన్, దాని అర్ధం తెలుసుకుని, పదాలు సరిగ్గా పలుకగలిగితే నువ్వో గొప్ప సింగర్ వి అవుతావు" ఇది కల్పన గారి నాన్న గారు చెప్పిన మాటలు. ఈ మాటలు తన మీద ఎంతో ప్రభావం చూపించాయి. మొదటిసారి తెలుగులో 1999లో మనోహరం(సంగీతం మణిశర్మ) సినిమా కు పాడారు, అప్పుడే తన తెలుగు స్పష్టంగా ఉండాలని రెండు నెలలలోనే తెలుగు(రాయడం కూడా) నేర్చుకున్నారు. అలా మలయాళం, హిందీ, జర్మనీ, అరబిక్, స్పానిష్, ఇటాలియన్ లాంగ్వేజస్ నేర్చుకున్నారు పట్టుదలతో.
కల్పన గారు మన తెలుగులో చాలా హిట్ సాంగ్స్ పాడారు అందులో కొన్ని..
1. అదిరే అదిరే.. (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
2. జోలె జోలె.. (వర్షం)
3. కంది చేను.. (నా అల్లుడు)
https://www.youtube.com/watch?v=Pg3oIk420eo4. మంచమేసి దుప్పటేసి..(సీమశాస్ర్తి)
5. ముసుగు వేయొద్దు మనసుమీద.. (ఖడ్గం)
6. ప్రేమంటే సులువు కాదురా.. (ఖుషి)
7. హే మామ మామ.. (టక్కరిదొంగ)
8. ఏ జిల్లా ఏ జిల్లా.. (శంకర్ దాదా యం.బి.బి.ఎస్)
9. చెలియా చెలియా సింగారం.. (కలుసుకోవాలని)
10. అబ్బో ని అమ్మ గొప్పదే.. (అంజి)
11. గోంగూర తోటకాడ కాపుకాసా.. (వెంకి)
13. అమ్మమ్మ ని మీసం.. (అందరివాడు)
14. చెప్పాలనుంది చిన్నమాటైనా.. (ఒంటరి)
15. పద పద.. (భీమిలి కబడ్డీ జట్టు)
ఎన్ని గొప్ప పాటలు పాడినా గాని విరామం లేకుండా పాడిన ఈ పాట మాత్రం అద్భుతం.