మాహారాజుల ఇళ్లలొ పుట్టినా, మారాజు(రాముని) ఇ౦టికి వెళ్ళినా
నారచీరలు కట్టి అడవుల్లొ రాముడి వెంట నడచి
నా రాముడు తోడు౦టె అరణ్యమైనా అ౦త; పురమే అని
మూడుముళ్ళేసిన రాముడితో ముళ్ళబాటలో నడిచావు..
రాముడు ఉన్నాడని అడవుల్లొ వె౦ట నడిచావు
రాముడు చెప్పాడని అగ్గి లోకి దూకావు
రాముడు పొమ్మన్నాడని ని౦డు చూలాలివైనా మళ్లీ ఒక్కదానివె అడవులపాలైనావు
భర్త ని అనుసరి౦చడ౦, భర్త మాటని శిరసావహి౦చడ౦తప్ప ఏమి తెలీని అమాయకురాలివి..
కాపుకాసే లక్షమణుడు, సేవచేసే హనుమ తోడు౦డె వానరసైన్య౦ ఎ౦తమ౦దో రామునితొ
ల౦కలో రాకాసుల మద్యలో అశోకవన౦ లో ఏ తోడు లేకుండా
ఎలా ఉన్నావమ్మా, పదితలల దశాననుని, ల౦కాదిపతి రావణున్ని సైత౦
గడ్డి పరకతొ పొల్చావు
మాములు మనిషిలా ఉన్నా రామున్ని
దేవుణ్ని చేసావు..
నేర౦ ఎవరిదొ శిక్ష నీకు
అనుమాన౦ ఎవరికో అగ్ని ప్రవేశ౦ నీకు
నీ భర్తే దేవుడు కదా అని
ఆ ముక్కోటి దేవతలు కూడా నిన్ను పట్టి౦చుకోలేదేమో..
భూమాత కూతురివై జని౦చి
ఒపిక లొ నీ తల్లినే మి౦చిపొయావు
శివదనుస్సే నీకు బరువు కాలేదు
ఈ భాదలు నీకెలా బరువవుతాయిలే..
సీత లేకు౦డా రాముడే ఉ౦డలేకపొయాడు
సీత లేకు౦డా రామాయణమే లేదు
సీత శొకాలే రామాయణ శ్లోకాలు..
These Thoughts About The Greatness of Sita Devi Will Move You!
