కొన్ని కథలు, థియేటర్ దాటిన తరువాత గుర్తుండవు. కానీ కొన్ని కథలు మాత్రం కొన్ని రోజులు వరకు మనల్ని విడువవు. సీతారామం సినిమా లాగ. మనకు ప్రేమంటే, ఎడబాటు అంటే, ప్రేమ పెట్టిన పరీక్షలు అంటే, ప్రేమ వల్ల కలిగిన బాధలంటే, అన్ని కలిపితే ప్రేమంటే, మొదట గుర్తొచ్చే జంట సీతారాములు. సీతారామం అనగానే 'హను' రాసుకున్న సీతారాముల కథ అని తెలిసిపోతుంది కానీ, ఆ సీతారాముల కథలోని, ఈ సీతారాముల కథలోని పాత్రలకి, పరిస్థితులకి, మధ్య గమనించిన parallels కొన్నిటిని పంచుకునే ప్రయత్నం ఇది.
రాజ్యం లేకున్నా, దేశానికి సైనికుడిగా ధర్మం నిర్వర్తిస్తున్న గుణాభిరాముడు.
వనవాసమే కాదు, రాముడి ప్రేమ కోసం అజ్ఞాతవాసం కూడా చెయ్యడానికి సిద్ధపడిన సీత.
చూడామణి
రామదండు.
ఆశ్రయమిచ్చిన సుగ్రీవుడు, సూచనలు చెప్పే జాంబవంతుడు, సీత జాడ తెలిసిన జటాయువు.
రాముడి సాయం తో శిల నుండి మనిషి గా మారిన అహల్య, రాముడిని తన ఆత్మబంధువుగా భావించిన శబరి.
రాముడు, సీత వనవాసానికి సాయం చేసిన సారధి గుహుడు.
రాముడి గురువు వశిష్ఠుడు.
రాముడికి యుద్ధం అప్పజెప్పిన విశ్వామిత్రుడు.
శత్రువులలో మిత్రుడు, విభీషణుడు.
ఇష్టమున్న, ఆ ఇష్టాన్ని ముంచేసే అసూయ, స్వార్థం ఉన్న, కైకేయి..
(Spoiler alert: వనవాసానికి మూల కారణమయిన కైకేయి)
రావణుడు.
రావణ కాష్టం.
రాముడి ఆచూకి, సీతకి అందించిన హనుమంతుడు.
ఎన్ని అడ్డంకులు అడ్డొచ్చిన గమ్యం చేరే రామబాణం ఈ ఉత్తరం.
రాముడి గురించి తెలుసుకున్న ఒక బోయావాడు వాల్మీకిగా మారి, ఆ రామాయణం రాసాడు. ఇష్టంలేకున్నా ప్రయాణం మొదలెట్టి, సీతారాముల కథకి ఒక ముగింపు ఇచ్చింది.. అఫ్రిన్.
కానీ తనే ఈ కథలో మాయలేడి, (అంతకుమించి చెప్తే spoiler అవుతుంది).
ఇది నాకు అనిపించిన parallels మాత్రమే. మీకేమన్న interesting గా కనిపించిందా, అనిపించిందా? కామెంట్ లో కలుద్దాం వచ్చేయండి మరి.