Recent times anni songs hit ayina albums lo Ala Vaikuntapuram lo Album okati. Jukebox lo unna prathi song chaala mandi favorite list tappakunda long time untundi. Kaakapothe Ee songs tho paatu surprising cinema climax lo vache "Sitharaala Sirapadu" ane song kuda same hype create cheskundi. Vinna first time ey andariki nachesina aa song official audio kosam chaala mandi edhuru chusaaru and it is finally out.
ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటని రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట రాయడం మొదటిసారైనా ఆ పాట ని చాలా తక్కువ టైం లోనే రాసారంట. ఈ పాట climax ఫైట్ అప్పుడు వస్తుంది. ఒక పాట తో fight ని compose చేయడం చాలా అరుదు గా జరుగుతుంటుంది కాబట్టి. ఆ fight చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. ఈ పాట "ఎంకి పాటలు" లాగ ఒక వ్యక్తిని వర్ణిస్తూ సాగుతుంది. విజయ్ గారు తన youtube channel లో ఎంకి పాటలని, మరెన్నో అలాంటి జానపద, లలిత సంగీతాన్ని సేకరించి తాను పాడి, తన స్నేహితుల చేత పాడించి upload చేసేవారు. ఆ పాటల ప్రభావం ఈ "సిత్తరాల సిరపడు" బాగా కనిపిస్తుంది.
- "సిత్తరాల సిరపడు" పాట లోని సాహిత్యం ఇది.