స్పష్టంగా చూడడమే ఆర్ట్! ప్రశాంత్ చిన్నతనం నుండి బొమ్మలు వేస్తున్నాడు.. ఒకప్పుడు పెయింటింగ్ అంటే చూస్తూ వెయ్యడం మాత్రమే అని అనుకున్నాడు.. ఐతే సంవత్సరం క్రితం ఒక పదిహేను రోజుల పాటు విపరీతమైన మార్పులు ప్రశాంత్ లో సంభవించాయి. అప్పుడే పెయింటింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా గీయడం కాదు నిశితంగా పరిశీలించడం అని తెలుసుకున్నాడు. ఈ మార్పులకు కారణం ఆనందకరమైన సంఘటనో, లేదంటే బాధాకరమో కాదు. సహజంగా తయారుకాబడిన అగ్ని జ్వాల భూగర్భం నుండి ఎగిసిపడినట్టుగా, ఏదో తెలియని శక్తి అతనిలోకి ప్రవేశించి రకరకాల ఆలోచనలు కలుగజేసిన మధనం మర్చివేశాయి.. ఆ భావాలు నిరంతరం విడుదల అవుతున్నాయి. అప్పటినుండే 15 సంవత్సరాలుగా బొమ్మలు గీయడం చేస్తున్నా కానీ కేవలం సంవత్సరం క్రితం నుండే నేను ఆర్టిస్ట్ అయ్యానని భావిస్తాడు.

పెన్సిల్ ఆత్మ, శరీరం వాటిపైన రంగులు.. తాండూరు ప్రాంతానికి చెందిన ప్రశాంత్ మంచి ఆర్టిస్ట్. ఇంతకు మునుపు 2,000 వేల కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతూ రకరకాల ప్రదేశాలను తిరిగారు. ఒక ప్రదేశాన్ని మనం పరిపూర్ణంగా అనుభూతి చెందాలంటే బొమ్మ గీయడమే మార్గమని విశ్వసిస్తాడు. అది కూడా పెన్సిల్ తో అయితేనే నిండుతనం వస్తుంది, పెన్సిల్ ఆత్మ ఐతే ఉపయోగించే వివిధ రంగులు శరీరం అని ప్రశాంత్ ఉద్దేశ్యం.

డబ్బులవసరం లేదు!! తాజ్ మహల్ చూసినప్పుడు మాత్రమే కాదు, తాజ్ మహల్ కోసం ఇంటి బయట కాలు పెట్టి నడిచే ప్రయాణాన్ని కూడా ఆస్వాదిస్తాడు ప్రశాంత్. ఎన్ని బొమ్మలు గీసినా అరే! బాగానే వచ్చిందే అని అనుకుంటాడు కానీ దానిని అమ్ముకోవాలని ప్రయత్నించడు. అతని గురుంచి మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే..
నాకు రేపటి గురుంచి భయం లేదు, నేను ఈ జన్మలో జాబ్ చెయ్యను, దాచుకోవడం కోసం నేను డబ్బులు సంపాదించను, నాకిష్టం లేదు, పాతుకున్న చెట్టులా, ప్రవహించే నదిలా, జ్ఞానాన్ని పంచే భాషలా నేను ఒకడిని. నేను మంచివాడిని అయితే, నా అవసరం ఈ ప్రపంచానికి ఉంటే కనుక ఈ ప్రకృతే నన్ను కాపాడుకుంటుంది. ఇవి తన ఆలోచనలు.
ప్రశాంత్ సందర్శించిన కొన్ని ప్రదేశాలు..















మరింత ప్రశాంత్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: Sketch and Travel