ప్రస్తుతం యుద్ధ వాతావరణం అలుముకున్నది. అమెరికా ఉత్తరకొరియా, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్.. ఇలా ఏ దేశం ఎప్పుడు మరో దేశం మీద ఎలా దాడి చేయబోతున్నదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో మన రక్షణ సామ్రాజ్యంలో మరో అపూర్వ ఆస్థి చేకూరడం వల్ల దేశ ప్రజలకు ఎంతో ధైర్యాన్ని తీసుకువస్తుంది. 21 సంవత్సరాల రోహిత్ పాండురంగ కేవలం ఒక సెంటిమీటర్ ఉన్న నానో మిస్సైల్ ను తయారుచేసి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేశాడు.
చిన్నతనం నుండి: రోహిత్ ది ఒంగోలు జిల్లా కమ్మపాలెం స్వగ్రామం. రోహిత్ కు చిన్నతనం నుండి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఇష్టం మూలంగా అందరికి సినిమా హీరోల మీద విపరీతమైన అభిమానం ఉంటే మనోడికి మాత్రం మన మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారంటే ఎంతో గౌరవం, ప్రేమ. చిన్నతనం నుండి ఆయనను స్పూర్తిగా తీసుకుని తన వయసుకు మించి ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం చెన్నైలోని ఎస్.ఆర్.ఎంటీ యూనివర్సిటీలో బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఈయర్ చదువుతూ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
నానో మిస్సైల్ ను చేయడానికి గల కారణం: మన భారతదేశంలో అన్ని రకాల వనరులున్నాయి. కాని ఇప్పటికి యుద్ధ సామాగ్రి విషయంలో కాస్త వెనుకబడి మిగిలిన దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ సమస్యే రోహిత్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం తీవ్రవాదులు ముంబాయ్ తాజ్ హోటల్ లో ధైర్యంగా దాడి చేయడం, వారిని పూర్తిగా ఓడించడానికి మన సైన్యం పడ్డ ఇబ్బందులను చూసి మరల ఇలాంటి పరిస్థితి దేశానికి రాకూడదు అని ప్రపంచంలోనే అత్యంత చిన్నని నానో మిస్సైల్ ను తయారుచేశారు.
వరల్డ్ ఇండియా రికార్డ్స్" దీనిని గుర్తించి దానిలో స్థానం కూడా కల్పించారు. (ఈ మధ్యనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు కూడా పరిశీలనకు పంపారు) త్వరలోనే రోహిత్ దీనిని డి.ఆర్.డి.ఓ కు అందజేయనున్నారు. రోబోల నుండి ప్రయోగించే ఈ నానో మిస్సైల్ గ్యాంగ్ స్టార్లు, తీవ్రవాదులు ఇతర యుద్ధ సమయంలో అద్భుతంగా ఉపయోగపడబోతున్నది.