ఈరోజు తెలుగు కనుమరుగు అవ్వడానికి బలమైన కారణం "ఉద్యోగం". అవును తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్ధి కన్నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విద్యార్ధికే గల్లి నుండి డిల్లీ దాక అవకాశాలున్నాయి. పోని ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విద్యార్ధుల కన్నా జ్ఞానం ఉందా అంటే అది అంతంత మాత్రమే. మీకో విషయం తెలుసా ఈ మధ్య ఓ సంస్థ సర్వే నిర్వహిస్తే అందులో "90% ఇంజినీరింగ్ విద్యార్ధులకు సరైన నైపుణ్యాలు లేవని" తేలింది. నిజంగా ఈ విషయాలు మనమేమి కొత్తగా తెలుసుకున్నవి కావు సంవత్సరాల తరబడి వింటూ వింటూ విసుగు పుట్టి వదలలేని చేదు నిజాలు. మార్పు తీసుకువచ్చే బలమైన శక్తి ప్రభుత్వం, కాలేజీల దగ్గర ఉన్నా బాధ్యత కన్నా స్వార్ధం ఎక్కువ ఉండడంతో సమస్య ఇప్పటికి నెరవేరడం లేదు. ఎక్కడ ధర్మం అధర్మం అవుతుందో అక్కడ ఓ ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమమే నాయకుడిని పెంచి, ప్రయోజికుడిని చేసి సమస్యలపై పోరాడడానికి శక్తిని ధారపోస్తుంది. పైన పేర్కొన్న రెండు సమస్యలపై రవి కోగంటి గారు ఉద్యమం చేస్తు వేలాది మంది యువతకు తనదైన శైలీలో దిశా నిర్ధేశం చేస్తున్నారు.
మొదటి ఓటమి: చిన్నతనం నుండి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కుని ఎం.సి.ఏ పూర్తిచేసిన రవి గారికి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. జీతం జీవితానికి సంతృప్తినివ్వకపోవడంతో రాజీనామా చేసి ఖాళీగా కొంతకాలం గడిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళి ఓ కొత్త కంపెనీలో జాబ్ అంటే మళ్ళి అదే పాత జీవితం గడపాల్సి ఉంటుంది. అలా కాదు అని "సబ్జెక్ట్స్ మీద మంచి పట్టున్న టీచర్స్ ను ఎంపిక చేసి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం మొదలుపెట్టారు". దానిని సక్సెస్ చేయడంలో మాత్రం చాలా అవస్థలు పడ్డారు. ఆన్ లైన్ క్లాసులు అప్పుడప్పుడే మంచి వృద్దిలోకి వస్తుంది కాని ఆ వృద్ధిలో తాను భాగం కాలేకపోయాడు. సక్సెస్ ను అందుకోవాలని చెప్పి మార్కెటింగ్ కు సంబంధించి ఎన్నో పుస్తకాలు, ఎన్నో బ్లాగ్స్, కొంతమంది వ్యక్తులను కలిసి వారి విలువైన అనుభవాలను తెలుసుకున్నారు ఆ ఓటమి తరువాత.
స్మార్ట్ తెలుగు: ఓటమి, పరిశోధన, అనుభవాల నుండి పుట్టిందే స్మార్ట్ తెలుగు వెబ్ సైట్. "నేను నా వెళుతున్న మార్గం నాకు ఎంత ఉపయోగపడుతుందో సమజానికి ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలని ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ముందుగా మనం చెప్పుకున్నాం కదా "తెలుగు బాష, విద్యార్ధులలో నైపుణ్యం" లోపించడం అని.. రవి కోగంటి గారు మొదలుపెట్టిన ఈ వెబ్ సైట్ రెండు సమస్యలపై ఒకే వేదికగా పోరాటం చేస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో ఈ-మేయిల్ క్రియేట్ చేయడం దగ్గరి నుండి వెబ్ సైట్ స్థాపించి దానిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా తెలుగులోనే వివరిస్తారు. ఈరోజు గ్లోబలైజేషన్ మూలంగా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సధుపాయం లభించింది. దాదాపు ప్రతి ఒక్క అంశం కూడా ఇంగ్లీష్ లో ముడిపడి ఉన్నది గ్రామీణ ప్రాంతం మాత్రమే కాదు నగరంలోను ఇంగ్లీష్ పై పట్టులేని విద్యార్ధులు చాలామందే ఉన్నారు. ఈ స్మార్ట్ తెలుగు వెబ్ సైట్ మూలంగా ఎన్నో వేలమంది విద్యార్ధులు తమ జీవితాలను మార్చుకుంటున్నారు.
పూర్తిగా తెలుగులోనే: అవును చాలామంది విద్యార్ధులకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నాగాని ఇంగ్లీష్ లో మాత్రమే బోధించడంతో సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం దగ్గరి నుండి ఎన్నోరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ వెబ్ సైట్ లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి వివరాలన్నీ కూడా తెలుగులో మాత్రమే విశదీకరించడంతో అటు తెలుగును కాపడడంతో పాటు ఇటు విద్యార్ధులు ఉన్నతులు అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రవి కోగంటి గారి ద్వారా తమని తాము మలుచుకున్న ఇలాంటివారు ఎందరో..