విదేశాల్లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ప్రదీప్ తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఊరికి వచ్చేసి ఉన్న కొన్ని ఎకరాలల్లోనే వ్యవసాయం స్టార్ట్ చేశారు, సంవత్సరానికి లక్షల్లో సంపాదిస్తున్నారు.. విజయవాడకు చెందిన శ్రీరామ్ ఇంకా తన మిత్రులు ఐతే ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే 'ఆన్ లాన్ లాండ్రీ' అనే స్టార్ట్ అప్ స్టార్ట్ చేశారు, ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే లక్షల్లో సంపాదిస్తున్నారు.. పూర్వం డబ్బు సంపాదించాలంటే ఒకే పద్దతిని ఉపయోగించేవారు "అదే బాగా చదువుకోవాలి.. మంచి కంపెనీలో జాబ్ కొట్టాలి ఆ తర్వాత బాగా కష్టపడి కంపెనీకి పేరు తెస్తూ Salary పెంచుకోవాలి.." కాని మన అదృష్టం ఏమిటంటే ఇప్పుడు డబ్బు సంపాదించడానికి పర్సెంటేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి.. మనకు నచ్చిన ఫీల్డ్ నే ఎంచుకుని సమజానికి ప్రస్తుతం అవసరమయ్యే వాటిని నేర్పుగా అందిస్తే చాలు..
శ్రీ విద్య గారు ఇక్కడ CBITలో ఇంజనీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్ళారు.. M.S Complete చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ లో కూడా జాయిన్ ఐయ్యారు.. ఆ తర్వాత ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాల పాటు అదే సాఫ్ట్ వేర్ జాబ్ కంటిన్యూ చేశారు. కాని ఇండిపెండెన్సీ ని ఇష్టపడడం, ఒకరి కింద పనిచేయడం నచ్చకపోవడంతో ఏదైనా ప్రత్యామ్నయం ఉంటే బాగుంటుందనిపించింది. భర్త కు తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం ఆ బిజినెస్ మీద కూడా కొంత అవగాహన ఉంది. సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అది కూడా యే హోటల్, యే రెస్టారెంట్ లానో కాకుండా Different గా చేద్దాం అని చెప్పి ఈ ఫుడ్ ట్రక్ 2014లో హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు.
మిగిలిన వాటికి ఈ ఫుడ్ ట్రక్ కు తేడా ఏమిటంటే.. రెస్టారెంట్ అంటే Maintenance అవసరం ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఫుడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది అది కస్టమర్స్ కు చాలా ఇబ్బంది ఉంటుంది దీని వల్ల ఒక వర్గం వారే వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఎక్కడైతే అవసరం ఎక్కువగా ఉంటుందో అక్కడికే ట్రక్ ను తీసుకెళ్ళి వేడి వేడిగా వారి ముందే మంచి రుచికరమైన ఫుడ్ అందిస్తే చాలు అని బలంగా నమ్మి దీనిని మొదలుపెట్టారు. Startingలో కొన్ని Problems ఎదుర్కున్నా గాని ఇప్పుడు ఇప్పుడు సిటిలో నాలుగు ఫుడ్ ట్రక్స్ తో మాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
పిజ్జా దోశ, తీన్మార్ దోశ లాంటి 111 దోశ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. కేవలం 30 నుండి 130 వరకు తక్కువ ధరకే మంచి ఫుడ్ దొరకుతుండడంతో సైకిల్ నుండి ఆడి కార్లలో వచ్చే అన్ని వర్గాల వారందరూ ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు మన రాజమౌళి గారి కుటుంబానికి, అనుష్క ఇంకా చాలామంది సెలెబ్రెటీస్ కి ఇది ఫేవరేట్ ఫుడ్ స్పాట్.