పెట్రోల్/డీజిల్ ఎక్కువగా వాడడం వల్ల రెండు Problems ఉన్నాయి. ఒకటి.. ఏవైనా అవసరం ఉంటే మనం తిరిగి తయారు చేసుకోవచ్చు కాని పెట్రోల్/డీజిల్ లాంటివి వాటంతట అవ్వే తిరిగి తయారుకావాలంటే ఎన్నో లక్షల సంవత్సరాలు ఎదురుచూడాలి. భవిషత్తులో ఎన్నో అవసరాలకు వీటి అవసరం ఎంతో ఉంది. అనవసరంగా అవసరం లేని వాటికి మనం వాడితే వచ్చే తరానికి ఎంతో ప్రమాదం ఉంటుంది. ఇంకో Problem.. 'Pollution'. ఈ పొల్యుషన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు అందరికి తెలిసిందే.. ఈ రెండింటి మీద అవగాహన కల్పించడానికి మన హైదరాబాద్ అబ్బాయి ఏకంగా 14వేల కిలోమీటర్లు ప్రయాణించాడు అది కూడా ఒక ఆటోలో.
నవీన్ రాబెల్లి మన హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఆ తర్వాత రెవా ఎలక్ట్రిక్ కార్ సంస్థలో పని చేశారు. ఆ సంస్థలో పనిచేయడం వల్ల సోలార్ పవర్ ఆధారంగా నడిచే వాహనాల వాడకం వల్ల మరింత ఉపయోగాన్ని తెలుసుకున్నాడు. సోలార్ పవర్ తో నడిచే వాహనాల వల్ల ఎంతో ఉపయోగం ఉన్నా కాని ప్రస్తుత ప్రపంచం ఇంకా వినియోగించుకోవడం లేదు దీనికి ప్రధాన కారణం ప్రజలలో పూర్తి అవగాహన లేకపోవడమే అని గుర్తించారు. వీటి గురించి, వీటి ఉపయోగం గురించి అందరికి తెలియాలి అని కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు తిరుగుతూ సోలార్ పవర్ గూరించి అవగాహన కల్పిస్తున్నారు. అది కూడా తను తయారు చేసిన సోలార్ పవర్ ఆధారంగా నడిచే ఆటోలో..
2016 ఫిబ్రవరి 8న ప్రారంభమైన నవీన్ ప్రయాణం మొదట ఇండియా నుండి ఇరాన్ మీదుగా టర్కి, గ్రీస్, బల్గెరియా, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరి, సెర్బియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చివరికి లండన్ వరకు సాగింది తన ప్రయాణం. మనదేశంతో సహా 12 దేశాలు సోలార్ పవర్ తో నడిచే ఆటోలో ప్రయాణించాడు నవీన్. కేవలం అలా ప్రయాణించడమే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఎంచుకుని సోలార్ పవర్ పై చిన్నపాటి సమావేశాలు నిర్వహించేవారు. తాను సాగించిన ఈ సాహస యాత్రను ఎంతోమందిని కదిలించింది, ఆలోచింపజేసింది.. హాలీవుడు నటుడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ కూడా నవీన్ సాగిస్తున్న యాత్రను ప్రత్యేకంగా ట్విట్టర్ లో అభినందించారు.. నవీన్ చేసిన ఈ సాహసయాత్రలో "టుక్ టుక్ ఆటో" కూడా పాల్గొన్నది కనుక ఆ యాత్రకు గుర్తుగా ఆటోను స్విస్ మ్యూజియంలో ఏర్పాటుచేయబడింది. ఏదైనా మొదట ఆలోచన తోనే మొదలవుతుంది ఆ ఆలోచనను చాలామందిలో నవీన్ కల్పించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.