మన భారతదేశంలో దాదాపు 4కోట్ల మందికి వెహికిల్స్ ఉన్నాయి. వీళ్ళంతా సంవత్సరానికి వేలకోట్లల్లో పెట్రోల్ ను కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పెట్రోల్ బంకుల్లో చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మీటర్ రీడింగ్ సమయంతో పాటు, పొడవైన పంపులను ఉపయోగిస్తూ రీడింగ్ చూపించిన వెంటనే నాజిల్ స్టాప్ చేస్తున్నారు. ఇలాంటి రకరకాల పద్దతుల వల్ల 10% నుండి 20% వరకు తక్కువ పెట్రోల్ మాత్రమే అందుతుంది.
చాలాసార్లు మన కళ్ళముందే మోసం జరుగుతుందని అర్ధం అవుతున్నా గాని సరైన ఆధారాలు లేకపోవడంతో బంక్ సిబ్బంది మాటే చెల్లుబాటు అయ్యింది. ఇదే పరిస్థితి శివశైలేష్, రామకృష్ణకు కూడా "మనం మోసానికి గురి అయ్యామా" అనే పరిస్థితే ఎదురయ్యింది. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉన్నారు. ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో రూ.12 వేలతో ఈ Fuel Flow Measurementను సృష్టించారు. Micro Controller Monitors సహాయంతో పెట్రోల్ ఎంతవరకు ట్యాంక్ లో పడుతున్నదో వెంటనే మనకు తెలియజేస్తుంది.
దీనిని పెట్రోల్ ట్యాంక్ మూత దగ్గర అమరుస్తారు. వెహికిల్ కు అమర్చిన L.C.D Displayతో పాటు ఈ మిషిన్ ను స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయడం వల్ల పెట్రోల్ ఎంత పోయించామన్నది మన మొబైల్ కు మెసేజ్ వచ్చేస్తుంది. ఈ పరికరానికి GPS కూడా అనుసంధానమై ఉండడం వల్ల వెహికిల్ దొంగతనం జరిగినా గాని మనం బండి ఎక్కడ ఉన్నదనే విషయం సులభంగా తెలిసిపోతుంది.