చిత్ర గారి గురించి, వారి ప్రతిభ గురించి ఏమని వర్ణించగలం ఎంతని వర్ణించగలం. భారతదేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు లాటిన్, అరబిక్ లతో కలిపి ఇప్పటికి 25,000కు పైగా పాటలు పాడారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, 6 నేషనల్ అవార్ఢులు, కేరళ ప్రభుత్వం నుండి 16 అవార్ఢులు, ఆంధ్రప్రదేశ్ నుండి 10 అవార్ఢులు , తమిళనాడు కర్నాటక ప్రభుత్వాల నుండి 7అవార్ఢులు, 7 ఫిల్మ్ ఫేర్ అవార్ఢులు.. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా అభిమాన సంఘాల నుండి దాదాపు 200 అవార్ఢులు, 20 కి పైగా బిరుదులు ఇంకా మరెన్నో. చిత్రమ్మ గారు ఎంత ఎదిగారో అంత ఒదిగి ఉంటారు.. ఎన్ని అవార్ఢులు అందుకున్నా గాని ఇంకా నేర్చుకోవాల్సినది ఎంతో ఉన్నదని వినమ్రంగా ముందుకు సాగుతుంటారు.. బహుశా ఈ గొప్ప లక్షణమే కావచ్చు వారిని మన హృదయాలలో ఉన్నత స్థానంలో కూర్చునబెట్టేలా చేసింది. చిత్రమ్మ గారి పాటలలో కొన్నీటిని మాత్రమే పొందుపరచాలంటే చాలా చాలా కష్టం కాని సాహసం చేసి కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం.. వారి పాటలలో కొన్ని అద్భుతాలు..
Heroine Intro:
1. నువ్వొస్తానంటే.. (వర్షం)
2. జల్లంత కవ్వింత.. (గీతాంజలి)
3. ఎన్నోన్నో అందాలు.. (చంటి)
4. గోపికమ్మా చాలునులేమ్మా.. (ముకుంద)
5. మౌనంగానే ఎదగమని.. (నా ఆటోగ్రాఫ్)
6. కలవర మాయే మదిలో.. (కలవర మాయే మదిలో)
Heroin's Love:
1. లోకాలే గెలువగా.. (బాలు)
2. మనసున ఉన్నది.. (ప్రియమైన నీకు)
3. కిటకిట తలుపులు.. (మనసంతా నువ్వే)
4. నిన్ను కోరి వర్ణం.. (ఘర్షణ)
5. తెలుసునా తెలుసునా.. (సొంతం)
6. అహ అల్లరి.. (ఖడ్గం)
7. చెప్పమ్మ చెప్పమ్మ (మురారి)
8. కన్నానులే.. (బొంబాయి)
Duet:
1. చిలుకా క్షేమామ.. (రౌడి అల్లుడు)
2. అసలేం గుర్తుకు రాదు.. (అంతపురం)
3. ముద్దబంతి నవ్వులో.. (అల్లుడుగారు)
4. మనసే ఎదురుతిరిగి.. (ప్రేమంటే ఇదేరా)
5. కళ్యాణం కానుంది.. (అంతపురం)
6. మేఘాలే తాకింది.. (ప్రేమించుకుందాం రా)
7. అబ్బని తియ్యని దెబ్బ.. (జగదేకవీరుడు అతిలోక సుందరి)
8. మనసున మనసున.. (లవ్ బర్డ్స్)
9. తెలుసా మానసా.. (క్రిమినల్)
10. కన్నులో నీ రూపమే.. (నిన్నే పెళ్ళాడుతా)
Fast Beat:
1. భీమవరం భుల్లోడ.. (ఘారాన బుల్లోడు)2. ఆటాడుకుందాం రా.. (సిసింద్రి)
3. ప్రియరాగాలే.. (హలో బ్రదర్)
4. చలిగా ఉందన్నాడే.. (సమరసింహారెడ్డి)
5. నువ్ విజిలేస్తే ఆంధ్రాసోడ.. (సింహాద్రి)
Mother's Love:
1. ఎవరు రాయగలరు.. (అమ్మ రాజీనామా)
2. నల్లనివన్నీ నీళ్ళని.. (ఛత్రపతి)
3. చుక్కల్లారా.. (ఆపద్భాందవుడు)
4. గోపాల బాలుడమ్మ.. (ఊయల)
5. సిరులోలికించే చిన్ని నవ్వులే.. (యమలీల)
Pathos:
1. నువ్వే నువ్వే.. (నువ్వే నువ్వే)
2. వేణువై వచ్చాను.. (మాతృదేవోభవ)
3. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. (ఎలా చెప్పను)
4. ఆడ కూతురా నీకు.. (కంటే కూతుర్నే కను)
5. ఓ ప్రియా ప్రియా.. (గీతాంజలి)
Climax:
1. భారత వేదమున.. (పౌర్ణమి)
2. ఏ శ్వాసలో చేరితే.. (నేనున్నాను)