నిజామాబాద్ జిల్లా కిషన్ తండా అనే మారుమూల గ్రామానికి చెందిన సౌమ్య ఓ రోజు నిజామాబాద్ సిటీలో ప్లే గ్రౌండ్ కొంతమంది ప్లేయర్స్ ఫుట్ బాల్ ఆడడాన్ని చూసింది. ఈ ఆట చాలా బాగుందని చెప్పి ఫుట్ బాల్ గేమ్ ను నేర్చుకుంటూ ఆడడం మొదలుపెట్టింది. ఏదో కాలక్షేపం కోసం కదా అని పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఈ గేమ్ చాలా శ్రమతో కూడుకున్నది నిత్యం బాల్ నే గమనిస్తూ గ్రౌండ్ అంతా పరిగెత్తాల్సి ఉంటుంది. ఇంతటి కష్టమైన ఆటను అలుపు లేకుండా చురుకుగా పరిగెత్తుతూ నేర్పుగా ఆడటాన్ని గమనించిన సీనియర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. తనకి గనుక ఇంటర్నేషనల్ లెవల్ లో కోచింగ్ ఇస్తే గనుక భారతదేశం గర్వించదగ్గ గొప్ప ప్లేయర్ అవ్వగలదు అని కోచ్ నాగరాజు గారు అనుకున్నారు.
ఓ చిన్న పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నారు.. బ్రతకడానికి ఇబ్బంది గురి చేసే జీతం. వికలాంగుడైనా గాని ఉన్నా పొలం కౌలుకి తీసుకుని సాగు కూడా చేస్తుండేవారు. ఈ పరిస్థితిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఇందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. కాని సౌమ్య ఓపికతో ఒప్పించగలిగింది. అలా హైదరాబాద్ లోని కేర్ ఫుట్ బాల్ అకాడెమీలో చేరింది. అనుకున్నట్టుగానే సౌమ్య త్వరగానే మెళకువలు తెలుసుకుని ఫుట్ బాల్ లో మరింత రాటుదేలింది. టెన్త్ క్లాస్ పూర్తి కాకుండానే వివిధ టోర్నమెంట్ లోనూ ఆడటం మొదలుపెట్టింది.
ఒక పక్క చదువుకుంటునే మరోపక్క వివిధ ప్రాంతాలలో జరిగే ఫుట్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొంటూ వచ్చేది. ఎక్కడో నిజామాబాద్ మారుమూల ప్రాంతంలో పుట్టిన సౌమ్య తన టాలెంట్ అనే వారధితో అండర్ 14 భారత ఫుట్ బాల్ జట్టుకు ఎన్నికయ్యింది. అండర్ 16లో ఐయితే ఏకంగా భారత్ టీమ్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా రికార్డ్ కూడా సాధించింది. పది నిమిషాలలో మూడు గోల్స్ చేయడం, అండర్ 17 ప్రపంచ కప్ లో తెలంగాణ టీమ్ ను ఫైనల్ వరకు చేర్చడంలో సౌమ్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.