70 ఏళ్ళు గా సినిమా రంగానికి తన అభినయంతో ఎన్నో పాత్రలతో పేరు తెచ్చిన షావుకారు జానకి గారికి 2022 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ప్రభుత్వం. ఈ పురస్కారానికి, తమిళనాడు నుండి ఆమె పేరు సిఫార్సు చెయ్యబడింది. రాజమండ్రి లో పుట్టి, తెలుగు సినిమా తో పరిచయమయ్యి. తమిళ్ సినిమాలలో తార స్థాయి చేరుకున్నారు, షావుకారు జానకి గారు. ఆమె సినీ ప్రయాణం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
దుర్గాబాయి దేశముఖ్ గారు స్థాపించిన బడిలో చదువుకునేవారు. ఆ టైం లో గాంధీ, నెహ్రు లాంటి వారికి వాలంటీర్ గా కూడా ఉండేవారు. అప్పట్లో చదువుకున్న అతి కొద్దిమంది నటులలో షావుకారు జానకి గారు ఒకరు.
15వ ఏట రేడియో నాటకాలలో ఆమె కంఠాన్ని విని, బి.ఎన్ రెడ్డి గారు హీరోయిన్ గా నటించడానికి అవకాశం ఇస్తా అన్నారు. కానీ, ఇంట్లో ఒప్పుకోక పోవడంతో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్కోవాల్సి వచ్చింది.
కానీ, పెళ్లి తరువాత గోహతి యూనివర్సిటీ లో మెట్రిక్యూలేషన్ పూర్తిచేసి. మొదటి సంతానం పుట్టిన తరువాత భర్త కి ఆర్థికంగా సహాయంగా నిలవడానికి సినిమాలోకి వచ్చారు షావుకారు జానకి గారు. షావుకారు ఆమె మొదటి చిత్రం, అప్పటికే జానకి అనే పేరు తో ఒకరు ఉండటం వల్ల, అందరూ షావుకారు జానకి అని పిలిచేవారు ఆ పేరే permanent అయ్యింది. కన్యాశుల్కం లో విధవ గా, మంచి మనసులో అంధురాలి గా, ఇలా నటన కు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేశారు జానకి గారు.
ఆమె చెల్లెలు కృష్ణ కుమారి గారు తెలుగు సినిమాలలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న మొదటి తరం నటులలో ఒకరు.
పొట్టి గా ఉండేవారని చాలా విమర్శలు ఎదుర్కున్న, తనదైన కంచు కంఠం తో స్పష్టమైన డైలాగ్ డెలివరీ తో అందరి గౌరవాన్ని పొందారు. డాక్టర్ చక్రవర్తి సినిమాలో, పొగరు ఉన్న క్యారెక్టర్ ని చేసి, ఆ సినిమాలో అందరిని డామినెట్ చేస్తారు షావుకారు జానకి గారు
తెలుగు లో విభిన్నమైన పాత్రలు. చేశారు. తమిళ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని స్టార్ స్టేటస్ ని సంపాదించుకుని, హిందీ లో కలిపి 200 పైగా సినిమాల లో హీరోయిన్ గా చేశారు. మంచి మనసులు, అక్క చెల్లెల్లు లాంటి సినిమాలో నటన గురించి ఇప్పటికి చెప్పుకుంటారు.
శ్రీదేవి గారి కి తొలి అవకాశం రావడానికి సహాయం చేశారు. చాలా విషయాల్లో శ్రీదేవి, షావుకారు జానకి గారి సలహాలు తీసుకునే వారు.
హీరోయిన్ గానే కాకుండా, ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు.
Second ఇన్నింగ్స్ లో కూడా, చాలా విభిన్నమైన పాత్రలు చేశారు. సంసారం ఒక చదరంగం సినిమా లో 'చిలకమ్మ' గా షావుకారు జానకి గారి యాక్టింగ్ అద్భుతః. ఆ తరువాత చాలా సినిమాల్లో నానమ్మ గా చేశారు జానకి గారు.
1931, December 12 న పుట్టిన జానకి గారు, 70 ఏళ్ళు పైగా నటి గా సినిమా రంగానికి సేవలు చేస్తూనే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తరువాత హీరోయిన్ అయ్యి ఒక స్టీరియోటైప్ ని బ్రేక్ చెయ్యడమే కాకుండా, స్టార్ గా ఎదిగి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. Contraversies కి చోటు ఇవ్వకుండా, తనకు అనిపించింది, నొప్పించకుండా చెప్తూ. ఆమె professionalism గురించి ఇప్పటికి చెప్పుకునే విధంగా తన ప్రయాణాన్ని మలుచుకున్నారు జానకి గారు. నటన ని career గా ఎంచుకున్న వాళ్ళు, ఆమె ప్రయాణం నుండి చాలా నేర్చుకోవచ్చు.