Contributed By Nagaswarit Durishetty
తెల్లారుజామున గుడిలో ఆడే పాటల నుండి
చల్లారు జాబిలి జోల పాడే పాటల వరకు…
పల్లేటుల్లో పేదోడి వాడల్లో నుండి..
పరదేశి తెలుగోడి వేడుకల వరకు…
వనిత మాత కొడుకు కై పాడే బుజ్జగింపు నుండి..
భరత మాత తన బిడ్డ కై పాడే గర్జన వరకు..
అంతటా మీ పాటే...అంతా మీరున్న చోటే..
మీ పాట ఇప్పటికీ వింటున్నాం కదా బాలు గారు..
మరి నా మాట ఒక్కసారి వినరు..!!!
గెలిచినా, ఓడినా మీకోసమే..అనుకొని చేస్తున్న ఈ కవితాత్మక పోరు..
కోదండపాణి గారి పరిచయం గా రాసిన పీఠిక కు మహాగ్రంధం మీరు..
ఘంటసాల గారి మరణనంతరం ఆ లోటు తీర్చిన చోటు మీరు..
తెలుగు సాహిత్యానికి.. తేనెలంటి ఉచ్చారణ మీరు…
తెలుగు సంగీతం లో తరగని ఆస్తి మీరు..
పలుకు లు పలికే పసివాడికి పాడలన్న ఆసక్తి మీరు..
మెలుకు వచ్చిన ఆలయానికి ఉదయం ఉప్పొంగే భక్తి మీరు..
సంగీతకారులు కు వారు నేర్చుకొనే రేపటి పాఠం మీరు..
సంగీత దర్శకులు చేసే ప్రయోగాలకు సిద్ధమై ఉన్న సమాధానం మీరు..
అన్నీ మీరయ్యి ఇలా మమ్మలని వదిలేసి వెళ్ళారు..
బాలు గారు మాకోసం మళ్ళీ రారు..!!?
మీలా ఆభై ఏళ్ళు పాడగలిగేది ఎవరు…
మీరు లేని లోటు సంగీతానికి తీర్చేది ఎవరు..
మీలా అక్షరాలను తియ్యగా పలికేది ఎవరు..
మీలా మూడు తరాల వరకు గాత్ర దానం చేసేవారు ఎవరు…
మీలా నాలుగు పదివేలలు పైగా పాటలుకు చేరేది ఎవరు..
మీలా మాకు పాటల పాఠాలు నేర్పేది ఎవరు..
మీలా గొంతు తో నటించేదేవరు..
మీ చిన్న పిల్లాడి మనస్తత్వం తో మమ్మల్ని ఆటపట్టించేది ఎవరు…
మీలా పాత సంగీతపు జ్ఞాపకాలు మాతో పంచుకునేది ఎవరు..
మీలా
ఇవన్నీ ఇంకెవరి వల్ల సాధ్యం అన్న ప్రశ్న కి సమాధానం మీరు..
అందుకే మీ జననం మాకు కావాలి మరో మారు..
బాలు గారు ...ఒక్కసారి మాకోసం రారు..??
ఇప్పటికీ మీరు ఉన్నట్టే అనిపిస్తోంది…
ఈనాటికీ రాజా గారి హార్మోనియం పక్కన మీ
పాటే వినిపిస్తూ ఉంటుంది..
సాహిత్యం లో ళ, ణ లు వస్తే మీ చిత్రపట మే కనిపిస్తుంది..
మీతో నా పలుకుల కవిత్వం అనంతపు సంద్రం లా ఇలా సాగిపోతూనే ఉంది...
అయినా మీ గూర్చి వర్ణణనికి పది పాటలు అయినా సరిపోవు
మీ గొంతు ఖర్చు చేసే తరుణంలో వంద తూటా లు కూడా మమ్ము గాయపరచ లేవు
మీ ప్రతిభా కిరణనికి వేయి పుటాల్లో అక్షరాలు రాసిన
చాలవు..
ఇప్పటికి ఓ తీరని అనుమానం ఏంటంటే బాలు గారు..
మీకు సంగీతం, వ్యాకరణం తెలియదని అంటుంటారు..
అయినా శంకరాభరణం లో ఆ శాస్త్రీయ సంగీతం ఎలా ఆలపించారు..
బహుశా దైవమే మీకు సంగీతం నేర్పించి పంపించు ఉంటారు..
అందుకే అంటుంటారు ..మీలాంటి వారు ఇక పుట్టరు .. .
పుట్టబోరు..
మీ లా ఈ లోకం లో ఎవరు ఉండరు.. ఉండబోరు..
అందుకే వేడుకుంటున్నాను ..బాలు గారు ఒక్కసారి తిరిగి రారు..
ఇంతటి తో మీకిష్టమైన మాటతో ఆపెస్తున్న నా ఈ కవిత్వపు కన్నీరు..
సర్వే జనా సుజనోభవంతు…
సర్వే సుజన సుఖినోభవంతు..