కొన్ని సంవత్సరాల క్రితం..
అమెరికా, నార్త్ కరొలినా.
స్టేజ్ మీద దిలీప్ అతనికి సహాయం కోసం మరొక మిత్రుడు ఉన్నాడు.. దిలీప్ ఎవ్వరిని గమనించడం లేదు, పూర్తిగా అతని మనసులోని ఆకారాన్ని బయటపెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు.. అతడ్ని, ఇంకా అతను వేయబోతున్న పెయింటింగ్ ను కొన్ని వేలమంది పరిశీలిస్తున్నారు. ముందు "కళ్ళు" వేస్తే అది ఎవరో ముందుగానే తెలిసిపోతుంది.. "అదే చివరి వరకు ఎవరో తెలియకుండా వేస్తేనే కదా అసలైన థ్రిల్!! పెయింటింగ్ పూర్తి కాబోతుంది అప్పుడే వేలమంది ప్రేక్షకులు ఒక్క ఉదుటున అరిచారు "జై బాలయ్య"!! అది బాలకృష్ణ గారి పెయింటింగ్.. ఫ్యాన్స్ వెంటనే స్టేజ్ మీదకు వచ్చి వెయ్యి అమెరికన్ డాలర్లు పెట్టి కొనుక్కున్నారు.


దిలీప్ speed painting artist. ఒక పెయింటింగ్ ను గంటలు, రోజుల తరబడి వేస్తే దిలీప్ కొన్ని నిమిషాల్లోనే వేస్తాడు. ఇప్పటివరకు అతి తక్కువ టైమ్ లో వేసిన పెయింటింగ్ రజినీకాంత్ గారిది కేవలం 3:15 నిమిషాల్లోనే వేసేశాడు. ఎక్కువ టైమ్ తీసుకున్నది మాత్రం 6:07నిమిషాలు. మన ఇండియాలో speed painting artists చాలా తక్కువ ఉన్నవారిలో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ "విలాస్ నాయక్". విలాస్ చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ కు సెలవు చెప్పేసి నచ్చిన స్టేజ్ మీదకు వచ్చేశారు. బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న దిలీప్ ఒకసారి స్టేజ్ మీద విలాస్ performance చూసి guidance తీసుకుని దిలీప్ కూడా అద్భుతాలను వెయ్యడం మొదలుపెట్టాడు.


దిలీప్ గురుంచిన ఒక సీక్రెట్ చెప్పనా.. "అతనికి స్టేజ్ ఫియర్ ఉంటుంది". మొదట మరి ఎక్కువగా ఉండేది కాని తర్వాత జాగ్రత్తతో కూడిన భయంగా మారిపోయింది. దిలీప్ ది మణుగూరు నాన్న గారు సింగరేణిలో మంచి జాబ్. నాన్న కెరీర్ పరంగా జాగ్రత్తలే చెప్పాడు తప్ప భయపెట్టలేదు. దిలీప్ కలలకు వారధిగా ఉండాలనుకున్నాడే తప్ప అతని మార్గానికి చెక్ పోస్ట్ పెట్టి అడ్డుతగలలేదు. చిన్నతనం నుండే అక్షరాలతో పాటుగా పెయింటింగ్ నేర్చుకున్నాడు. B.tech పూర్తిచేసిన తర్వాత బెంగళూర్ లో జాబ్ ఆ తర్వాత అమెరికా వెళ్ళడం, ఎడ్యుకేషన్, జాబ్, పెయింటింగ్స్, ఫోటోగ్రఫీ, క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్స్ తో దిలీప్ తనకు నచ్చిన జీవితంలో జీవిస్తున్నాడు.


Speed painting artist గానే కాదు దిలీప్ మంచి డైరెక్టర్ కూడా.. సింపుల్ కథతో ప్రేక్షకుల మనసులోకి దూరి వారిని ప్రభావితం చేయగలడు. "ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే జాగింగ్ కు వెళుతుంటాడు. ప్రతిరోజూ జాగింగ్ వెళుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాడు. పోయేటప్పుడు అహంకారం గానే ఉంటాడు తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాడు. కాని ఒకరోజు మాత్రం అహంకారంగా వెళ్లి మనశ్శాంతిగా తిరిగి వస్తాడు. "Real Eyes" తో Realize ఐన ఒక వ్యక్తి కథ ఇది. రకరకాల భావనలకు గురిచేసే ఈ సినిమా Filmi toronto south asian film festival కి సెలెక్ట్ అయ్యింది కూడా. దిలీప్ కు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం కాకపొతే కాస్త డిఫ్రెంట్ గా చేస్తాడు. ఒకసారి Canvas brush పట్టుకుని మెడిటేషన్ చేస్తాడు. మరోసారి కెమెరా పట్టుకుని మెడిటేషన్ చేస్తాడు. దిలీప్ నరనరాల్లోనూ ఆర్ట్ దూరిపోయింది. ఏ పనిచేసిన తనలోని క్రియేటివిటీ కనిపిస్తుంది.


దిలీప్ వేసిన Speed Painting Live Performances:
Bahubali Speed Painting:
NTR Speed Painting:
Rajini Speed Painting:
NBK Speed Painting:
You Can Follow Him on Instagram here.