భీకరమైన కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల తండ్రి దృతరాష్టృడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు.. కృష్ణా.. నా వంద మంది కొడుకులు నీ సాక్షిగా చనిపోయారు నీకు కొంతైనా బాధలేదా? నా శోకం నీకు అర్ధం కావడం లేదా?
శ్రీకృష్ణుడు: దృతరాష్ట్రా... నీకు గుర్తుందా 50 జన్మలకు పూర్వం నువ్వొక వేటగాడివి. అప్పుడు నువ్వు ఒక మగపక్షిని చంపడానికి ప్రయత్నించావు. కాని అది ప్రాణ భయంతో ఎగిరి పారిపోయింది.. ఆ పరిస్థితికి నువ్వు ఆగ్రహంతో ఊగిపోతు కనికరం లేకుండా కోపంతో పక్కన అప్పుడే పుట్టిన 100 పక్షి పిల్లలను చంపావు.. ఆ సమయంలో ఏమి చేయలేని స్థితిలో ఆ తండ్రి మగపక్షి చూస్తు ఉండిపోయింది. ఆరోజు నువ్వు చేసిన మహాపాపమే నిన్నుఈ పరిస్థితికి తీసుకువచ్చింది.
దృతరాష్టృడు: కాని దానికి నాకు 50 జన్మల సమయం ఎందుకు పట్టింది?
శ్రీకృష్ణుడు: నువ్వు ఆ పాపాన్ని కడిగేయడానికి నీకు పుణ్యం కావాలి, అందుకు వందమంది కొడుకులను కనాలి.. ఆ పుణ్యాన్ని నువ్వు 50 జన్మలలో సంపాదించావు.. కొన్ని అదే జన్మలో పాపానికి శిక్ష వేసి ప్రాయశ్చితం చేస్తే, కొన్ని మరుసటి జన్మలో చేస్తాను.నాకు ఎప్పుడు, ఏది, ఎలాచెయ్యాలో బాగా తెలుసు..!