కొన్ని రంగాలలోని కొంతమంది నిష్ణాతులు తెలుగువారి మదిలో అలా జీవితాంతం గుర్తుండిపోతారు, తర్వాతి కాలంలో ఎంతమంది వచ్చినా వారి స్థానంలో ఏ మార్పూ ఉండదు.. కార్టూనిస్ట్ శ్రీధర్ గారు కూడా తెలుగువారి హృదయాలలో అలా నిలిచిపోతారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40సంవత్సరాల ప్రస్థానం వారిది. పాఠకులు ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై "ఇదీ సంగతీ" లో వచ్చే శ్రీధర్ గారి కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది ప్రముఖ నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గలమెత్తారు. 4 దశబ్ధాల ప్రయాణంలో కొన్ని కార్టూన్లను మాత్రమే ఇక్కడ పొందుపరుచడం నాతో పాటు మీకు ఇబ్బందిగా ఉంటుందని తెలుసు కాని తప్పడం లేదు.