Contributed By Nagaraju Durisetti
ఓ ఉదయం వార్తా పేపరు లో నా చూపులు… ఏ దయ లేని కామాంధుడి వేధింపు వాపులు… ఆ ఉదయిస్తున్న పసి పాప చావు అరుపులు… ఈ గడియ ఉద్వేగ జలపు నా గళం పలుకులు… నా కలం నుండి కురిసిన అక్షరాల ఉరుకులు….
అడుగులు కూడా కింద పడలేదేమో…. ఆ ఐదేళ్ల పాప పాదాలు అరగలేదు... పడగలు విప్పిన మృగం మీద పడి వర్జించలేదేమో ఆ పసిదాని ప్రాణం మిగల లేదు… పళ్ళ తో ఆ పసి మొగ్గ కొరకలేదేమో… భగ్గు మనే ఆ మగ పగ్గాన్ని తుంచలేదు… కాళ్ళు కూడా గట్టిగా కదపలేదేమో…. మగ మృగను తాట తీసి తన్నలేదు… గొంతు బిగ్గరగా విప్పలేదేమో… వాడి అంతు చూడడానికి దగ్గరకు ఎవర్ని పిలవలేదు.. ఊయల కూడా తుదకు కాపు కాయలేదేమో… గాయాలై ప్రాణం మెతుకు మిగలలేదు….
గోరు ముద్దలు ….చేరాల్సిన నోటి కి ఘోరుడి ముద్దులు చేరాయి చివరికి…. గారాలపట్టి చేరింది చివరికి కాటికి ఈ చామ చావు సద్దులు సాగుతూనే ఉన్నాయి ఈనాటికి… ఈ కామ ఎద్దుల మీరుతున్న హద్దులు ఆగేది ఏనాటికి…. మనం మారితెనే అంతం ఉంటుందేమో ఆ లైంగిక వేటకి మారడం అంటే….కాసేపు మౌనం పాట పాడడమా….? తినడం మాని..రోడ్లపై ర్యాలీ చేయడమా….? సోషల్ మీడియా లలో కాసేపు జాలి వర్షం కురిపించడమా..? కామాంధుడి ని ఉరి తీయ్యాలంటూ తీర్పు కోరాడమా….?
మౌనం పాటిస్తే ఆ మృగాల ఆలోచన మారుతుందా…? న్యాయం కావాలంటూ నిలబడితే పసి ప్రాణం తిరిగి పుడుతుందా… ఉరి తీసి చంపేస్తే భయపడి మిగతా మృగాల వేట ఆగుతుందా…. చంపినా ఆ మృగానికి జ్ఞానోదయం కాదు.. చెంప పై కొట్టి చెప్పినా… వాడికి బుద్ధి రాదు… చంపాల్సింది….ఆ కిరాచుకుడుని కాదు వాడి అరాచకపు ఆలోచనని… పంపాల్సింది …ఆ నరకాసున్ని నరకానికి కాదు
చదవాల్సింది వాడి దురాలోచనల మెదడుని…. అప్పుడైనా తెలుస్తుంది ఆ ఆలోచన పుట్టుక… నివారణ తీర్పు చెప్పాలి మానసికవైద్యుని కుత్తుక..
ఓ క్షణం చేయి చాచి, పేర్చి జీవితపు అభిమానం.. నా కలం అడుగుతోంది యువతిని ఓ అనుమానం…. పాతికేళ్లు నిండిన నీవు ఐదేళ్ల పాపతో కాదుగా సమానం.. ప్రసవ సమయంలో నీవు పడే నొప్పి బాధ కొలమానం.. ఇరవై ఎముకల ను విరిచినంత నొప్పి పరిమాణం… పోరాడి,ఆ పశువు పై పోట్లాడి కాపుడుకోవా నీ ప్రాణం…. ఏనాడో రుద్రమ దేవి…. పరాక్రమ కత్తి చేత పట్టింది.. ఈనాడు నీ చేయి దెబ్బకొట్టే ఓ సుత్తి కాదా….? ఏనాడో మణికర్ణిక ధైర్యం తో …. శత్రు గొంతు పట్టింది.. ఈనాడు నీ కురుల జడ అల్లిక వాడి మెడ కు చుట్టుకోదా…. ఓనాడు మంచు తుఫాను వచ్చి మృత్యువు చుట్టుముట్టింది… అయినా బచెంద్రి పాల్ ఎవరెస్ట్ ను అధిరోహించలేదా.. ఈనాడు నిన్ను చుట్టుముట్టే మగతుఫాను నువ్వు ఎదురించలేవా..
పోట్లాడు…. పోరాడు…. నీ మానాన్ని….. నీ ప్రాణాన్ని… నువ్వే కాపాడు…