విజయ్, స్వాతి వీళ్ళిద్దరికి పేయింటింగ్స్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ జే.ఎన్.టి.యూ లో ఫైన్ ఆర్ట్స్ (పీ.జి) కంప్లీట్ చేశారు. అక్కడే ఇద్దరు మంచి Friends అవ్వడం, ఇద్దరి Ideology Thoughts ఒకేలా ఉండడంతో ఇద్దరూ Marriage చేసుకుని వారికి నచ్చిన జాబ్ చేస్తునే Societyని వారి Style లో Motivate చేస్తున్నారు. బహుశా మీరు హైదరాబాద్ లో ఈ పేయింటింగ్స్ చాలా చోట్ల చూసే ఉంటారు. చూసిన ప్రతిసారి ఎవరు వేశారా అని అనుకోవచ్చు స్వాతి విజయ్ గారే వేశారు. ఆర్టిస్ట్ గా చేస్తూనే వీలున్నప్పుడు ఇలా Public ఎక్కువగా తిరిగే Placesలో Thought Provoking Paintings వేస్తుంటారు. స్ట్రీట్ పేయింటింగ్స్ వేస్తున్నారు అని వీరి స్థాయి గురించి అనుమానం రావచ్చు సహజమే వీళ్ళు మామూలు Artists కాదండి National, International లెవల్ లో చాలా చోట్ల వీరి పేయింటింగ్స్ ప్రదర్శితమయ్యాయి. చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు. వీరు చాలా పేయింటింగ్స్ వేశారు ప్రస్తుతానికి మన హైదరాబాద్ లో వేసిన పేయింటింగ్స్ చూద్దాం.